S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

08/17/2017 - 00:25

సామూహిక గుర్తింపు ఉండి, సంఘటితమైన అనేక ప్రజా సముదాయాలతో కూడిన సమాహారమే సమాజం. సమాజ పరిణామంలో చతుర్వర్ణ వ్యవస్థ అనేక పరిణామాలకు గురై అగ్రకులాలు, నిమ్నకులాలు అనే వివక్ష ఏర్పడింది. నిమ్న కులాల వారిని అంటరాని వారిగా సమాజం చూడటం మొదలుపెట్టింది. అంటరాని వారిని గాంధీజీ హరిజనులు అని వ్యవహరించారు. కులవ్యవస్థ అణచివేత సంస్కృతికి ప్రాతినిధ్యం వహిస్తుంది. కుల ప్రాతిపదికన అస్పృశ్యతను పాటించడం నేడు నేరం.

08/17/2017 - 00:23

దళితులను గౌరవించినప్పుడే రాజ్యాంగ పరిరక్షణ సాధ్యపడి అంబేద్కర్ ఆశయాలు నెరవేరుతాయి. దళితుల రక్షణకు అనేక చట్టాలున్నా వాటిని అమలుచేసే అధికారుల నిర్లక్ష్యం కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. దళితుల్లో చైతన్యం తీసుకొస్తేనే వారిపై జరిగే దాడులు ఆగుతాయి. అసమానత, దళితుల అభివృద్ధి నిరోధకతనాన్ని పూర్తిగా రూపుమాపాలి. చట్టాలను నిర్లక్ష్యం చేసే ఎంతటివారిపైనైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

08/17/2017 - 00:23

దాడులు అంటేనే చట్టాన్ని అతిక్రమించడం. దాడులు దళితులపైనే కాదు.. ఎవరిపైనైనా కావచ్చు.. అది చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడమే. ప్రస్తుత సమాజంలో దళితులపైనే దాడులు జరుగుతున్నాయనుకోవడం దురదృష్టకరం. దాడులు అన్ని వర్గాల వారిపై, అంతటా జరుగుతున్న సమస్య. అయితే దళితులే లక్ష్యంగా జరిగే దాడులను ఖచ్చితంగా అందరూ ఖండించాల్సిందే. కేవలం ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేసుకుని దాడులకు పూనుకోవడం భావ్యం కాదు.

08/17/2017 - 00:22

స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలవుతున్నా ఇప్పటికీ కొన్నిచోట్ల దళితులు వివక్షకు గురవుతూనే ఉన్నారు. బలహీనులను బలవంతులు భయపెట్టే పరిస్థితి మొదట్నుంచే వస్తూనే ఉంది. అలానే సామాజికంగా, ఆర్థికంగా దళితులు బలహీనులు కావడం, ప్రభుత్వాలు సైతం వారి అభివృద్ధికి మాటల్లో చెప్పినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం వంటి కారణాలతో దళితులు వెనుకబడే ఉంటున్నారు. ఈ పరిస్థితి తొలగాలంటే ఆర్థికంగా దళితులు స్వావలంబన సాధించాలి.

08/17/2017 - 00:22

దళితులపై దాడులు జరగడానికి ముఖ్య కారణం, ఇంకా కుల వ్యవస్థ కొనసాగడం, దళితులను చిన్నచూపు చూడడమే. దేశానికి స్వాతంత్య్రం రాకముందు కుల వ్యవస్థ ఇంకా తీవ్రంగా ఉండేది. దాడులు తరచూ జరిగేవి. దళితులపై ఎవరైనా దాడి చేస్తే, దాడి చేసిన వారికి శిక్ష పడేది కాదు. స్వాతంత్య్రానంతరం దేశంలో పెను మార్పులు వచ్చాయి.

08/17/2017 - 00:21

కులం, మతంతో సంబంధం లేకుండా మనిషిని మనిషిగా చూడాలి. తోటివారు సాటి మనుషులే అనే భావన మనుషులందరిలో ఉండాలి. దేశంలో దళితులపై దాడులు అనే అంశంలో రాజకీయ నాయకులు, మీడియా, వామపక్షాల పాత్ర విధ్వంసకరంగా ఉంటోంది. సెనే్సషనలిజంకోసం మీడియా ఇద్దరు వ్యక్తుల మధ్య, కొంతమంది వ్యక్తుల మధ్య జరిగే వివాదాన్ని, ఘర్షణను, దాడులను కులపరమైన దాడులుగా చూపుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కమ్మ, కాపులు కొట్టుకున్న సంఘనలు ఉన్నాయి.

08/17/2017 - 00:21

స్వాతంత్య్రం లభించి 70 ఏళ్లు గడచినా నేటికి దళితులపై దాడులు ఆగడం లేదు. దేశంలో ప్రధానంగా బిహార్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో గుజరాత్‌లో కూడా దళితులపై దాడులు జరుగుతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. సాధారణంగా దళితులను బహిరంగంగా అవమానపర్చడం, హత్యలు, బహిరంగ ప్రదేశాల్లో తిరగనివ్వక పోవడం.

08/17/2017 - 00:20

మనది కుల సమాజం. ఈ కుల సమాజంలో ప్రతి ఒక్కరినీ కులం కోణం నుంచి చూస్తారు. అసలు ఈ కుల వ్యవస్థలో అసమానతలు, ఆధిపత్యాలు, అవమానాలు భరించినంతకాలం బాధలేవీ కన్పించవు. వీటిపై ధిక్కారస్వరం వినిపించినపుడే అత్యాచారాలు, దాడులు, బహిష్కరణలు, ఏరివేతలు సంభవిస్తున్నాయి.

08/17/2017 - 00:20

దళితులపై దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడచిన తర్వాత కూడా దేశంలో పలు రాష్ట్రాల్లో దళితులపై దాడులు జరుగుతున్న వార్తలు చూసి మనసు బాధతో కుంగిపోతోంది. కాని దళితులపై దాడులు జరిగినా నిందితులను శిక్షించేందుకు ఇప్పుడున్న చట్టాలు సరిపోతాయా అనే అనుమానం వస్తుంది.

08/17/2017 - 00:19

దళితులపై దాడులు ఇప్పుడే కొత్తగా జరగడం లేదు. అనాదిగా వస్తున్నదే. వారిపై వివక్ష కొనసాగినంత కాలం దాడులు జరుగుతూనే ఉంటాయి. గ్రామ పెద్దలు దళితులను వివిధ పనులకు వాడుకుంటున్నారు. వారిని కేవలం సేవకులుగానే అనేక ప్రాంతాల్లో చూస్తున్నారు. ఇప్పటికీ దళితులు గ్రామాల పొలిమేరల్లోనే జీవనం సాగిస్తున్నారు. గ్రామాల్లో ఏ గొడవ జరిగినా, అది పొలిమేరల్లోనే జరుగుతుంటుంది. ఈ గొడవల్లో అమాయక దళితులను చేరుస్తున్నారు.

Pages