S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

07/20/2017 - 01:34

ప్రజాప్రతినిధులు, అధికారులు పాజిటివ్ ధృక్పధంతో ఆలోచించి, సమన్వయంతో పనిచేస్తే ఏ విధమైన సమస్య ఉండదు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఏ ఒక్కరూ తక్కువా కాదు ఎక్కువా కాదు. నిత్యం ప్రజలతో మమేకమయ్యే ప్రజాప్రతినిధులకు క్షేత్ర స్థాయిలో ఉండే సమస్యలపై అవగాహన ఉంటుంది.

07/13/2017 - 01:40

అంతర్జాతీయంగా వస్తున్న వ్యాపార ధోరణులు వివిధ రంగాల్లోకి కంటికి కనిపించని రీతిలో చొచ్చుకు వచ్చి అవి అసాంఘిక కార్యకలాపాలకు బీజం వేస్తున్నాయి. మద్యం విపరీతంగా అమ్ముడుపోవడం, పొగాకు వినియోగం, నీలిచిత్రాలు, డ్రగ్స్ (మాదకద్రవ్యాల) వినియోగం ఇలా చెప్పుకుంటూపోతే అదో పెద్ద చేంతాడంత ఉంటుంది. గోప్యంగా ఇంతకాలం జరిగిన డ్రగ్స్ వినియోగం అంచెలంచెలుగా సినిమా పరిశ్రమ నుండి ఇటు విద్యారంగానికి సోకింది.

07/13/2017 - 01:39

మాదకద్రవ్యాలు వల్లన కలిగే నష్టాలు, అనర్థాలు, సమస్యలు తదితర విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అన్ని చర్యలు, తీసుకున్నాం. మాదకద్రవ్యాలు వాడకం వల్లన కలిగే నష్టాలపై విద్యార్ధులకు అవగాహన కార్యక్రమాలు, సదస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేశాం. వీటితోపాటు విద్యార్థులు డ్రగ్స్ వాడకుండా వర్శిటీ కళాశాలలు, హాస్టళ్లు, అనుబంధ కాలేజీల్లో ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేసాం.

07/13/2017 - 01:38

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్ మాఫియా డొంక కదిలింది.. గుట్టుచప్పుడు కాకుండా సాగుతోన్న ఈ వ్యవహారంలో దోషులెవరైనా.. ఎంతటివారైనా, ఎవరినీ వదిలిపెట్టం. ఇప్పటికే డ్రగ్స్ సరఫరా చేస్తున్న 16 మందిని అరెస్టు చేశాం. డ్రగ్స్ సరఫరా చేసేవారిలో సినీ పరిశ్రమకు చెందినవారు కూడా ఉన్నారు. డ్రగ్స్ సరఫరా ముఠాకు చెందిన రెండు వెబ్‌సైట్‌లను కూడా గుర్తించాం.

07/13/2017 - 01:38

టీనేజిలో విద్యార్థులు దురలవాట్లకు గురికాకుండా ఉండాలంటే వారికి క్రీడలపట్ల ఆసక్తిని పెంచాలి. కొన్ని విద్యాసంస్థల్లో పర్యవేక్షణ కొరవడటం వల్ల విద్యార్థులు దురలవాట్లకు గురవుతున్నారు. పర్యవేక్షణ తక్కువగా ఉన్న విద్యా సంస్థలు విద్యార్థులకు క్రీడల్లో తర్ఫీదునివ్వాలి. క్రీడా సదుపాయాలుంటే విద్యార్థులు దురలవాట్లకు గురికాకుండా క్రీడల వైపు మళ్లే అవకాశం ఉంది.

07/13/2017 - 01:37

పిల్లలతో తల్లిదండ్రులు స్నేహితులుగా మెలిగినప్పుడే వారి అభిప్రాయాలను తెలుసుకోవచ్చు. విద్యార్థులు స్మార్ట్ ఫోన్ వాడడం వల్ల వారిపై అనేక చెడు ప్రభావాలు పడుతున్నాయి. తెలిసీ, తెలియని వయస్సులో ప్రేమలో పడడం అనేక అనార్థలకు దారితీస్తుంది. స్మార్ట్ఫోన్ వల్ల అశ్లీలత పెరిగిపోతోంది. విద్యార్థులు మద్యానికి, ధూమపానాలకు బానిసలౌతున్నారు. పిల్లలు బయటికి వెళ్లినప్పుడు తల్లిదండ్రులు వారిపై దృష్టి పెట్టాలి.

07/13/2017 - 01:37

డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టం గురించి, అనర్థాల గురించి విద్యార్థులను అప్రమత్తం, చైతన్యవంతం చేసేలా పాఠ్యాంశంలో చేర్చాలి. ఇంతకాలంగా డ్రగ్స్ రాకెట్స్ విద్యార్థులను, యువతను పెడదారి పట్టిస్తున్నా, వారిని దీనికి బానిసలుగా చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారించింది.

07/13/2017 - 01:36

సరదాగా మొదలయ్యే మత్తు పదార్థాలు, ఆల్కహాల్, గుట్కా, సిగరెట్, కొకైన్, గంజాయి, నిద్రమాత్రలు వంటి వాటికి క్రమేణా అలవాటు పడి చివరికి ఆ పదార్థాలు అందకపోతే కనీసం కాలకృత్యాలు తీర్చుకోలేక, చివరకు బతకలేని స్థాయికి చేరుకుంటున్నారు. మత్తు పదార్థాలకు బానిస కావడంతో ప్రపంచంలో ప్రతి నిమిషానికి ఒక వ్యక్తి మరణిస్తున్నాడు.

07/13/2017 - 01:35

డ్రగ్ మాఫియా దేశానికి చీడపురుగు. యువతను నిర్వీర్యం చేస్తోంది. కఠినమైన చట్టాలు తెచ్చి మాదకద్రవ్యాల అమ్మకాలకు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపాలి. ఇటీవల హైదరాబాద్‌లో వెలుగుచూసిన డ్రగ్ మాఫియాను చూస్తే ఆందోళన కలుగుతోంది.

07/13/2017 - 01:35

విద్యార్థుల జీవితాన్ని మలిచే బాధ్యత ప్రధానంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉంటుంది. విద్యార్థులపై సామాజిక అంశాలు చాలా ప్రభావం చూపిస్తుంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో చదివే విద్యార్థులు మత్తుమందుకు, తాగుడు తదితర అలవాట్లకు లోనుకావడం తక్కువగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఏ విధంగా నడుచుకుంటున్నారో వెంటనే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యాసంస్థల యజమానులకు తెలిసిపోతుంది.

Pages