S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

03/23/2017 - 01:35

పంచాంగాల పట్ల సామాన్య జనానికి వున్న గందరగోళాన్ని నివృత్తి చేయాల్సి వుంది. మన ఆంధ్రదేశంలో 4 రకాల పంచాంగాలు బజారులో లభ్యమవుతున్నాయి. ఒకటి- ఆనాడు సూర్య సిద్ధాంతంలో చెప్పిన నేటి కాలానుగుణంగా మార్చకుండా చేస్తున్న గణిత సంబంధాన్ని పూర్వ పద్ధతి పంచాంగం అంటారు. ఇది శ్రీశైలంవారి ద్వారా విడుదల అవుతోంది.

03/23/2017 - 01:34

హేమలంబ ఉగాది పర్వదినము జరుపుకొనేందుకు కొంతమంది సిద్ధాంతులు అవగాహనా రాహిత్యంతో, తప్పుడు నిర్ణయాలతో ప్రజలను గందరగోళపరుస్తున్నారు. తిథి, నక్షత్రాన్ని అనుసరించి పండుగల నిర్ణయం చేస్తారు. దీన్ని అన్ని శాస్త్ర గ్రంథాలలోనూ, ధర్మశాస్త్ర గ్రంథాలలోనూ వివరించారు. ఇక్కడ ధర్మశాస్తప్రరంగా ఎలాంటి బేధం లేదు. కాని గణితపరంగా (దృక్సిద్ధాంతం, పూర్వపద్ధతి) వచ్చే బేధాలు మాత్రమే ఈ గందరగోళానికి కారణం.

03/23/2017 - 01:33

‘శ్రుతిశ్చ భిన్నాః స్మృతయశ్చ భిన్నాః
మహామునీనాం మతయశ్చ భిన్నాః
ధర్మస్య తత్త్వం నిహితం గుహాయాం
మహాజనో యేన గత స్స పంథాః

03/23/2017 - 01:32

పండుగలను ఒక్కో పంచాంగంలో ఒకరకంగా తేదీలను ఖరారు చేస్తున్నారు. ఇందులో వ్యత్యాసాలు రావడానికి ప్రధానంగా తిథి, నక్షత్రాదులలో తేడాలు రావడం కారణం. కొన్ని పండుగలు తిథి ప్రాధాన్యతను కలిగి ఉంటే మరికొన్ని పండుగలు నక్షత్ర ప్రాధాన్యత కలిగి ఉంటాయి.

03/23/2017 - 01:31

జ్యోతిష్యంపై ఇటీవల కాలంలో ప్రజలకు నమ్మకం పెరిగిపోయింది. దీంతో కొందరు తమ వ్యక్తిగత ప్రచారంకోసం పండుగలను వివాదాస్పదం చేస్తున్నారు. పండుగలను ఆయా తిథి నక్షత్రాల ప్రకారం ఖరారు చేస్తారు. పంచాంగకర్తలు చాలామటుకు అనాదిగా పూర్వ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు. మరికొందరు సూర్య సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు.

03/23/2017 - 01:30

దృక్సిద్ధ పంచాంగం ప్రకారం 2017 మార్చి 28న అమావాస్యనాడు పాడ్యమి ‘ఏష్య’మయింది. ఏష్యా అంటే ముందురోజు సూర్యోదయానికి తిథి ఉండదు. తర్వాతిరోజు సూర్యోదయానికి తిథి ఉండదు. రెండు సూర్యోదయాలను స్పృశించని తిథిని ‘ఏష్య’ అంటారు. పూర్వపద్ధతి పంచాంగం ప్రకారం 2017 మార్చి 29న సూర్యోదయం అనంతరం ఉదయం ఏడుగంటల వరకు పాడ్యమి ఉంది.

03/23/2017 - 01:28

భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే పండుగలపై పంచాంగకర్తలు, మఠాధిపతులు, పీఠాధిపతుల మధ్య విభేదాలు నెలకొనటం ఒక ఎత్తయితే మీడియాద్వారా బహిరంగ సవాళ్ళకు దిగటం దురదృష్టకరం. దీనివల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. తెలుగువారి తొలి పండుగ ఉగాది తేదీలపై వివాదం నెలకొనటం బాధాకరం.

03/15/2017 - 20:44

దేశంలో నగదు రహిత సమాజాన్ని నెలకోల్పేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సామాన్యులపై పెనుభారాన్ని మోపుతున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు, తర్వాత కొత్త రెండు వేల రూపాయిల నోట్లు మార్కెట్‌లోకి రావడంతో కొద్దిగా కోలుకున్నా, రెండో దశ ఆర్థిక సంస్కరణలు అమలులోకి తెచ్చే ప్రయత్నంలో ఆర్‌బిఐ మార్గదర్శకాలను అనుసరించి బ్యాంకులు బాదుడు మొదలుపెట్టాయి.

03/15/2017 - 20:42

డిజిటల్ ఎకానమి కోరుకుంటున్న ప్రభుత్వం అందుకు అనువైన వాతావరణం కల్పించకుండా, ప్రజన నెత్తిన భారం రుద్దాలనే ప్రయత్నం చేస్తోంది. బ్యాంకుల్లో నగదు లావాదేవీలకు సంబంధించి ఇటీవల జరుగుతున్న ప్రచారం ప్రజల్లో అభద్రత భావాన్ని పెంచుతోంది. ఈ విధమైన నిర్ణయాలతో ప్రజలు తమ సొమ్ము బ్యాంకుల్లో కంటే ఇంట్లో ఉంటేనే మేలనుకునే పరిస్థితులకు దారితీస్తోంది.

03/15/2017 - 20:42

సాధారణ ప్రజానీకం ఇప్పుడిప్పుడే డిజిటల్ లావాదేవీలపై అవగాహన పెంచుకుంటున్న తరుణంలో అందుకు తనవంతు సహకారం అందించాల్సిన బ్యాంకులు, నగదు లావాదేవీలపై చార్జీలు వసూలు చేయాలని భావించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. దీనివలన బ్యాంకులే ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది.

Pages