S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

03/02/2017 - 03:45

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే విద్యార్థులను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగ నియామకాలు కళ్ల ముందు కనిపిస్తున్నా రాజకీయ కోణంలో విమర్శలు చేస్తున్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తాననేది చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ. కానీ కొందరు నాయకులు కెసిఆర్ హామీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

03/02/2017 - 03:44

తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు అబద్ధాల ఎన్నికల ప్రణాళికలు విడుదల చేసి, అమాయక ప్రజలను, నిరుద్యోగులను, రైతులను నమ్మించి, ఆకర్షించాయి. వరుసగా రెండు టర్మ్‌లు (దాదాపు పదేళ్ళు) అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కంటే మరో పార్టీ అధికారంలోకి వస్తే ఇంకా కొత్తగా, మరింతగా మేలు జరుగుతుందేమోనన్న భ్రమతో ప్రజలు ఓట్లు వేసి మోసపోయారు.

03/02/2017 - 03:44

నిధులు, నీళ్లు, నియామకాలు... ఈ ట్యాగ్‌లైన్‌తోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంకోసం ఉద్యమం జరిగింది. ఏన్నో ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం అవతరించటంతో నిధుల సమస్య దానికంతకు అదే తీరిపోయింది. తెలంగాణ ప్రాంత ఆదాయ వనరులన్నీ సొంత రాష్ట్రానికే దక్కడంతో ఈ సమస్య పరిష్కారం అయిపోయింది. ఇక విషయానికి వస్తే ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఏటా రూ.25 వేల కోట్ల నిధులను సాగునీటి రంగానికి కేటాయిస్తోంది.

03/02/2017 - 03:43

తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగ సమస్య పెరుగుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ అభివృద్ధిలో పోటీపడుతూ పాలన సాగిస్తున్నారే తప్ప నిరుద్యోగ సమస్యను పరిష్కరించే దిశగా పాలకులు కృషి సల్పడం లేదు. నిరుద్యోగులు తమ ఆందోళనలు కొనసాగిస్తూనే స్వయం ఉపాధి వైపు దృష్టిసారించడం మేలు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు నిరుద్యోగ సమస్య ఒక్కటే కాదు. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాలు ప్రజాసంక్షేమంకోసం ఎన్నో పథకాలు రూపొందించారు.

03/02/2017 - 03:42

రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన హామీపై ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు భృతి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో నిరుద్యోగులకు భృతి కల్పిస్తామనే ప్రధానమై అంశంగా ఉంది. బాబు వస్తే జాబు వస్తుందన్నారు. కాని ఆంధ్ర రాష్ట్రంలో ఏమైంది. యువకుల కలలు కల్లలయ్యాయి.

03/02/2017 - 03:42

నిరుద్యోగ సమస్య తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగానే ఉంది. ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. సుమారు 1.42 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం భర్తీ చేయాలి. ఏపీపీఎస్సీ 10వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించింది. అందుకు సంబంధించి నాలుగున్నర వేల ఉద్యోగాలకోసం నోటిఫికేషన్లు జారీ చేసింది. తాజాగా స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా 982 గ్రూప్-2 పోస్టులకోసం పరీక్షను నిర్వహించింది.

02/22/2017 - 22:14

పాఠశాల విద్య సవాలక్ష సమస్యలకు నిలయంగా మారింది. విద్యార్థుల సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యలు, తల్లిదండ్రుల సమస్యలతోపాటు పాఠశాల కమిటీలకు, అధికారులకు, సిబ్బందికికూడా అనేక రకాల సమస్యలున్నాయి. అనునిత్యం విద్యార్థుల సమస్యలపై ప్రధానాంశంగా చర్చ కొనసాగుతోంది.

02/22/2017 - 22:06

21వ శతాబ్దంలో విద్య స్వరూపంలో చాలా మార్పు వచ్చింది, ఆనాడు అక్షరమే ప్రధానం, నేడు భావన ప్రధానం. ఈనాడు డిజిటల్ యుగం వచ్చింది. ప్రతికాలంలో కూడా ఆ యుగంలో జరిగిన ఆవిష్కరణలు విద్యారంగంపై ప్రభావం చూపుతాయి. ఈ యుగంలో డిజిటల్ ప్రభావం విద్యారంగంపై చూపాల్సిన అవసరం ఉంది. ఆనాడు చదువులు ఆరేళ్ల తర్వాత మొదలయ్యేది, కాని నేడు మూడేళ్ల ప్రాయంలోనే చదువు మొదలవుతోంది. మూడు-ఆరేళ్ల మధ్య కాలం చాలా ప్రధానమైంది.

02/22/2017 - 22:05

గుణాత్మక విద్య నందించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేస్తోంది. కనీస వౌలిక సదుపాయాల్లేకుండానే కార్పొరేట్ తరహా విద్య నందిస్తానంటూ ప్రగల్భాలు పలుకుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2006-07 నుంచి సక్సస్ స్కూల్స్ పేరిట ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా తీసుకున్న చర్యలు శూన్యం.

02/22/2017 - 22:04

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ విద్యా హక్కు కల్పించినప్పటికీ ఆచరణలో అవి అందని ద్రాక్షగానే మారుతున్నాయి. నేటికి ప్రాథమిక విద్యకు నోచుకోని వారెందరో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో మోడల్ స్కూళ్ల ఏర్పాటు పేరిట 1400 పాఠశాలలు మూసివేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో బడిఈడు గల పిల్లలు 86.50 లక్షల మంది ఉండగా, బడిలో 73.12 లక్షలు మంది చదువుతున్నారు.

Pages