S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

03/09/2017 - 05:08

తమకు అనుకూలంగా ఉండే వ్యక్తులను ఉపకులపతులుగా నియమించటం, కాంట్రాక్టు పద్ధతిలో అధ్యాపకుల నియామకాలు దశాబ్ధాలుగా కొనసాగించటం, అడ్మిషన్లతోనే విద్యార్థులకు ఏదో జరిగిపోయిందనే అభిప్రాయం ప్రభుత్వాలకు ఉన్నంతకాలం విశ్వవిద్యాలయాలలో అశాంతి కొనసాగక తప్పదు. ఒకప్పుడు ఒక లక్ష్యం, స్వయం నిర్ణయం తీసుకునే శక్తి కలిగిన వ్యక్తులు ఉపకులపతులుగా నియమితులైనందువల్ల యూనివర్సిటీలకు ఎంతో గుర్తింపు వచ్చింది.

03/09/2017 - 05:07

ఒకప్పుడు విశ్వవిద్యాలయాలు విద్యా నిలయాలు. విద్య మీద ఆసక్తి కలిగిన విద్యార్థులతో కళకళలాడుతుండేవి. ఒకవేళ ఎప్పుడైనా, ఎవరైనా ఒకరిద్దరు విద్యార్థులు విద్యకు సంబంధం లేని అంశాల మీద అలజడి చేసే యత్నం చేస్తే ప్రొఫెసర్లు మందలించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రొఫెసర్లే విద్యార్థులను రెచ్చగొడుతున్నారు. అలజడి లేని, విద్యా ప్రాంగణాలను ఆశాంతి నిలయాలుగా ఎలా మార్చవచ్చో నేర్పుతున్నారు.

03/09/2017 - 05:06

దేశంలో విశ్వవిద్యాలయాలను పాలకులు సంక్షోభంలో పడేశారు. కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం జాతీయత, దేశభక్తి అంటూనే స్వదేశీ విశ్వవిద్యాలయాలను నిర్లక్ష్యం చేస్తూ, విదేశీ విశ్వవిద్యాలయాకు రెడ్‌కార్పెట్ పరుస్తున్నారు. బనారస్ యూనివర్సిటీ, అలహాబాద్ యూనివర్సిటీలతోపాటు దేశంలోని ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలను ఉద్దేశపూర్వకంగా సంక్షోభంలోకి నెట్టివేశారు.

03/09/2017 - 05:06

విద్యావ్యవస్థలో రాజకీయ జోక్యంవల్లే యూనివర్శిటీల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి. విద్యార్థుల్లో అసంతృప్తి, సిబ్బందిలో అభద్రతాభావం వ్యక్తమవుతోంది. దీంతో కళాశాలల్లో ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. వీటన్నింటికి కారణం విద్యావ్యవస్థ స్వయంప్రతిపత్తితో ఉండకపోవడమే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మారినప్పుడల్లా వారి వారి అభిరుచుల మేరకు విద్యవిధానాల్లో మార్పులు చేస్తున్నారు.

03/09/2017 - 05:05

రాజ్యాంగం ప్రతి వ్యక్తికి భావ వ్యక్తీకరణ స్వేచ్చను ఇచ్చింది. ఈ స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేయడంవల్ల విశ్వవిద్యాలయాల్లో అశాంతి నెలకొంటోంది. ఢిల్లీలో ఒక కాలేజీలో ఒక యూనియన్ జెఎన్‌యుకు చెందిన విద్యార్థి నాయకులను ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ మరో విద్యార్థి సంఘం వ్యతిరేకించింది. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. విద్యార్థి దశలో ప్రతి అంశంపై విద్యార్థులను చర్చ చేయాలి.

03/09/2017 - 05:04

ప్రభుత్వ నిర్వాకం, పని తీరుకు విశ్వ విద్యాలయాలు అద్దం పడుతున్నాయి. విశ్వ విద్యాలయాల విద్యార్థుల్లో అసహనం కనిపిస్తున్నది. అందుకు పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల విధానం మారాలి. ఎలా మారాలంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ కాకుండా కెరీర్ ఓరియంటెడ్ కోర్సులను ప్రవేశపెట్టాలి.

03/09/2017 - 05:03

సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో కన్నా, సాధారణ ఉన్నత విద్యను అభ్యసించే విశ్వవిద్యాలయాల్లో అశాంతి నెలకొనే పరిస్థితులు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా విద్యా సంబంధ అంశాలు, ర్యాగింగ్, బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు, ప్రభుత్వ విధానాలపై యూనివర్సిటీల్లో వివిధ రూపాల్లో ఆందోళనలు, బంద్‌లు చేస్తుండటం పరిపాటి. ఇలాంటి వాటిల్లో ఎక్కువగా వర్సిటీ విద్యార్థుల కన్నా, బయటి వారి ప్రమేయం అధికంగా ఉంటుంది.

03/02/2017 - 03:47

బంగారు తెలంగాణలో మన ఉద్యోగాలు మనకే, ఉద్యోగం ఖాళీ అనే మాటే వినిపించదు అంటూ ఒక పార్టీ, జాబు కావాలంటే బాబు రావల్సిందే అంటూ మరో పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో గట్టి ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చాయి. రెండు రాష్ట్రాల్లో అధికారిక లెక్కల ప్రకారం నిరుద్యోగుల సంఖ్య 30 లక్షలు, వీరంతా వివిధ ఎంప్లాయిమెంట్ ఎక్సైంజిల్లో నమోదు చేసుకున్నవారే. తెలంగాణలో అధికారిక లెక్క 11,68,235 మంది నిరుద్యోగులు.

03/02/2017 - 03:47

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 33 నెలలు కావస్తున్నా సుమారు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక దీనావస్థలో మగ్గుతున్నారు. ఇందుకోసం ఎబివిపి ఆధ్వర్యంలో రాజకీయేతర ఉద్యమానికి పిలుపునిస్తున్నాం. రాష్ట్రంలో 25,125 పాఠశాలల్లో 16వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

03/02/2017 - 03:46

దేశంలో ఒకవైపు విద్యావంతుల సంఖ్య పెరుగుతుండగా, మరోవైపు ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతోంది. అంతర్జాతీయ సంస్థల సూచనలతో ఉద్యోగాలు కల్పించలేని అభివృద్ధి నమూనా మన దేశంలో అమలవుతోంది. ఈ విధానం మన దేశానికి ఉపయోగపడదు. తెలంగాణ రాష్ట్రంకోసం జరిగిన ఉద్యమం ప్రధానంగా మూడు అంశాలపై కొనసాగిందన్న విషయం అందరికీ తెలుసు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు.. ఇవీ ఉద్యమానికి ఊపిరిగా కొనసాగాయి.

Pages