S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

03/15/2017 - 20:41

బ్యాంకుల వల్ల సమాజంలోని బడుగు, బలహీన వర్గాలు ఇతర వర్గాలకు చెందిన పేదలకు లబ్ధి జరగాల్సి ఉంది. ఇటీవల బ్యాంకింగ్ రంగంలో వచ్చిన వాణిజ్యపరమైన ఆలోచనలతో వినియోగదారులపై పెనుభారం పడుతోంది. సేవ (సర్వీస్) పేరుతో వినియోగదారులపై బ్యాంకర్లు చార్జీల భారం మోపుతున్నారు. ఇది మంచి సంప్రదాయం కాదు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐ, నాబార్డ్, ఇతర బ్యాంకులు పునరాలోచన చేయాలి.

03/15/2017 - 20:40

బ్యాంకు లావాదేవీలపై పరిమితులు విధించటం ప్రజల ప్రాథమిక హక్కులను హరించటమే. ఖాతాదారులకు సేవలు అందించటంవల్ల నష్టాలు వస్తున్నాయని బ్యాంకులు వాదించటం సబబుకాదు. ఒకపక్క కార్పొరేట్ సంస్థలకు రెడ్‌కార్పెట్ పరచి వేలకోట్లు రూపాయలు రుణాలు ఇవ్వటం, అవికాస్తా తిరిగి చెల్లింపులు జరుగక బ్యాంకులు దివాళా తీయటం అందరూ గమనిస్తునే ఉన్నారు.

03/15/2017 - 20:40

బ్యాంకులు చార్జీలు పెంచడం చాలా దారుణమైన విషయం.. ఈ చార్జీలు వర్తకులకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి. నగదు రహిత లావాదేవీలతో ఇప్పటికే తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే ఇపుడు చార్జీల మోతవల్ల మధ్యతరగతివారు వ్యాపారాన్ని సాగించలేని దుస్థితి నెలకొంది. ఇటువంటి చార్జీల భారం కాస్తా చివరికి వినియోగదారుడిపైనే పడే పరిస్థితి దాపురిస్తోంది. నియంత్రణ లేని ఈ చార్జీలను పెంచడం ఖాతాదారులకు పెనుభారం.

03/15/2017 - 20:39

దేశవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు కోట్లాది రూపాయలు ఎగ్గొట్టి బ్యాంకులకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నారు. నిరర్థక ఆస్తులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి నష్టాల నుంచి గట్టెక్కేందుకు బ్యాంకులు ఇష్టారాజ్యంగా వినియోగదారులపై వివిధ చార్జీల పేరుతో భారం మోపడానికి సిద్ధమవుతున్నాయి. దీనివల్ల ప్రజలు, వ్యాపారులు కూడా తీవ్రంగా నష్టపోతారు. బ్యాంకుల్లో డిపాజిట్లు చేయాలంటే సామాన్యులే కాదు..

03/15/2017 - 20:38

ఏప్రిల్ 1 నుంచి లావాదేవీలపై భారీగా చార్జీలు వసూలు చేయాలని బ్యాంకులు నిర్ణయించడం సరైంది కాదు. నగదు డిపాజిట్లు, ఏటిఎంలలో నగదు ఉపసంహరణపై పరిమితులు పెట్టి చార్జీలు విధించడం దారుణం. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతుంది. చార్జీల వసూళ్లతో బ్యాంకులు ప్రజలకు దూరమయ్యే ప్రమాదం ఉంది. అక్రమ లావాదేవీలు పెరిగి అసాంఘిక శక్తులు పేట్రేగే అవకాశం ఉంది.

03/15/2017 - 20:37

మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు.. కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం నుంచి సామాన్య ప్రజలు తేరుకునేలోపు సామాన్య ప్రజలపై బ్యాంకు చార్జీల పేరుతో మరో భారం మోపడం సరైన పద్ధతి కాదు. సామాన్యులు కూడా బ్యాంకింగ్‌కు అలవాటు పడాలంటే కొనే్నళ్లపాటు బ్యాంకింగ్ చార్జీలు తగ్గించాలి. అదనపు రుసుములు, సర్వీస్ చార్జీల పేరుతో బ్యాంకులు సామాన్యుల నడ్డిని విరగ్గొట్టరాదు.

03/15/2017 - 20:36

నగదు రహిత లావాదేవీలను మరింత పగడ్బందీగా అమలుచేయాలన్న ఉద్దేశంతోనే బ్యాంకులు, ఎటిఎంల లావాదేవీలపై పన్ను విధించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. లక్ష్య సాధనకు చేపట్టిన ఉద్దేశం మంచిదే అయినా... మన దేశ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. మన దేశంలో అక్షరాస్యత చాలా తక్కువగా ఉంది. నగదు రహిత లావాదేవీలు అంటే ఒక నిరక్ష్యరాస్యుడు తన కార్డును సక్రమంగా ఉపయోగించుకోలేడు.

03/09/2017 - 05:12

చదువులకు, పరిశోధనలకు, నైపుణ్యాలకు, వికాసానికి కేంద్రం ఉన్నత విద్యాసంస్థలు. ప్రతి యువకుడి విద్యాభ్యాసంలో చివరి మజిలీ కూడా అక్కడే. జీవితంలో తన లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన ఉన్నత చదువులను అక్కడ పూర్తి చేసి, అత్యుత్తమ విలువలతో మంచి వ్యక్తిత్వంతో సమాజంలో అడుగుపెట్టేందుకు గొప్ప వేదిక విశ్వవిద్యాలయాలు.

03/09/2017 - 05:10

విశ్వవిద్యాలయాల్లో అశాంతి లేకుండా ఉండాలంటే విద్యార్థులు పాజిటివ్ దృక్పధంతో ఆలోచించేలా వారిని తీర్చిదిద్దాలి. చదువులో పోటీతత్వం పెంచాలి. విద్యార్థులు చదువు కాకుండా ఇతర వాటిపై దృష్టి మరల్చకుండా ఉండేందుకు నిరంతరం వారు చదువు, క్రీడలు తదితర వాటిపై నిమగ్నమయ్యేలా అనువైన వాతావరణాన్ని కల్పించాలి. దీనివల్ల వారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతులు కాగలుగుతారు. తద్వారా పాజిటివ్ దృక్పథం అలవడే అవకాశం ఉంటుంది.

03/09/2017 - 05:09

పలు విశ్వవిద్యాలయాల్లో ఆందోళనలు, అశాంతికి మార్క్సిస్ట్ మదర్సాలే కారణం. కొన్ని శక్తులు దేశంలో, విశ్వవిద్యాలయాల్లో అశాంతిని రేకెత్తించి దేశాన్ని విచ్చిన్నం చేయాలని కుట్ర పన్నుతున్నాయి. మార్క్సిస్ట్ శక్తులు, ఇస్లామిక్ ఉగ్రవాద శక్తులు, మతమార్పిడి శక్తులు ఇవన్నీ కలిపి మార్క్సిస్ట్ మదర్సాలుగా కొన్ని విశ్వవిద్యాలయాల్లో అరాచకాలకు ప్రయత్నిస్తున్నారు.

Pages