S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

11/16/2016 - 23:29

నోట్లను రద్దు చేసి ప్రధాని నరేంద్ర మోదీ పేదలను బిక్షగాళ్ళుగా చేశారు. పేదలు, చిరు వ్యాపారులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు తమ వద్ద ఉన్న డబ్బులను మార్చుకోవడానికే బ్యాంకులు, పోస్ట్ఫాసుల వద్ద గంటల తరబడి నిలబడాల్సి వస్తుంది. వారికి అప్పనంగా ఆ డబ్బులు రాలేదు. వారి కష్టార్జితం. కష్టపడి సంపాదించిన డబ్బును సద్వినియోగం చేసుకోవడానికే మరింత కష్టపడాల్సి రావడం దురదృష్టకరం. పైగా అనేక ఎటిఎంలు పని చేయడం లేదు.

11/16/2016 - 23:28

కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దుపై తీసుకున్న నిర్ణయం సమంజసమే. దేశంలో పెచ్చుమీరుతున్న ఉగ్రవాదం, తీవ్రవాదం నకిలీ కరెన్సీపైనే ఆధారపడి ఉంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలన్నీ రూ.500ల నోట్లపైనే ఆధారపడి తమ మనుగడను సాగిస్తున్నాయి. అదేవిధంగా భారత్‌లో కూడా తీవ్రవాదులు, మావోయిస్టుల వద్ద రూ.500ల కరెన్సీ విచ్చలవిడిగా ఉంది.

11/16/2016 - 23:27

పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవడంతో సామాన్య ప్రజలు నానాపాట్లు పడుతున్నారు. వారి అగచాట్లు ప్రధాని నరేంద్ర మోదీకి పట్టవా? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తి చేశామంటూ చెప్పినా, ఇప్పటివరకు సామాన్య ప్రజలు బ్యాంకులు, పోస్ట్ఫాసుల వద్ద బారులుతీరి నిలుచుండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనిని ఎందుకు పట్టించుకోవడం లేదు?

11/16/2016 - 23:21

నోట్లను రద్దు చేయడాన్ని ఏ కోణంలో చూసిన స్వాగతించాల్సిందే. ఇది మోదీ ప్రభుత్వం తీసుకున్న సాహాసోపేత చర్య. అయితే ఈ నిర్ణయం వల్ల సామాన్యుడు ఇబ్బంది పడటం లేదని చెప్పడం లేదు, కానీ ఈ ఇబ్బందులన్నీ తాత్కాలికం మాత్రమే. సామాన్యుడికి ఇబ్బంది కలుగకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తుగా మరిన్ని చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది. వంద, యాభై, ఐదు వందల నోట్లను మార్కెట్‌లోకి సరిపోయినంత చెలామణిలో ఉంచి ఉంటే బాగుండేది.

11/16/2016 - 23:20

దేశంలో పాత 500 రూపాయిలు, వెయ్యి రూపాయిల నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విప్లవాత్మకమైన చర్య, చారిత్రాత్మక సంఘటన. నల్లధనం దాచుకున్న వారికి, అవినీతిపరులకు, నకిలీ నోట్లు సరఫరా చేస్తున్న ఆర్థిక ఉగ్రవాదులకు ఇదొక సర్జికల్ స్ట్రైక్. ఈ చర్య ఎంతైనా ఆహ్వానించదగింది. ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక అభినందనలు.

11/10/2016 - 08:06

అమెరికా ఎన్నికల క్రతువు ముగిసింది. ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అంటూ నినాదాలు చేస్తున్నారు. ట్రంప్ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టాలనుకుంటున్నారు.

11/10/2016 - 07:58

అమెరికా, భారత్ రెండూ ప్రపంచంలోనే అతిపెద్ద, బలమైన ప్రజాస్వామ్య దేశాలు. ఈ రెండు దేశాల్లో ప్రజలు ఎన్నుకునే పార్టీలపై సర్వత్రా ఉత్కంఠత నెలకొని ఉంటుంది. అమెరికా ఎన్నికల్లో ఎవరుగెలుస్తారనే దానిపై భారత్‌తోసహా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశాయ. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ గెలిచుంటే ఆర్థిక రంగానికి సంబంధించి పాతవిధానాలే కొనసాగేవి.

11/10/2016 - 07:57

ట్రంప్ గెలిచారు, అంతమాత్రాన ప్రపంచం తలకిందులై పోతుందని భావించనక్కర్లేదు. డోనాల్డ్ ట్రంప్ సైతం ఆషామాషీ వ్యక్తేమీ కాదు, ఆయన అమెరికాలో అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్త, అందరూ కలిసి అమెరికాను అగ్రపీఠాన కొనసాగించేందుకు పనిచేద్దామని చెప్పడం ద్వారా అమెరికన్లకు విశ్వాసాన్ని కలిగించడమేగాక, ప్రతి ఓటరుకు తాను అధ్యక్షడినేనని చెప్పి అందర్నీ సమ్మిళితం చేసుకునే మనస్తత్వాన్ని ట్రంప్ ప్రదర్శించారు.

11/10/2016 - 07:57

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు ఎవరిదైనా మన దేశంతో సత్సంబంధాలు యధావిధిగా కొనసాగుతాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగేలా సంబంధాలు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు అనుగుణంగా వీసాల మంజూరు విషయంలో ఉన్న నిబంధనలు చారావరకు సరళీకృతం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం వీసాల మంజూరులో అనేక సాధకబాధకాలు ఎదురవుతున్నాయి.

11/10/2016 - 07:56

ప్రపంచ దేశాలను శాసించే అమెరికా అధ్యక్షుడుగా ఎవరు గెలిచినా అక్కడ స్థిరబడ్డ లేదా వేర్వేరు విధులు నిర్వర్తించే ఎన్‌ఆర్‌ఐలకు, భారతదేశ ప్రయోజనాలకు ఎలాంటి భంగం వాటిల్లబోదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరితోనైనా సత్సంబంధాలు కొనసాగిస్తారు. అలాంటి శక్తియుక్తులు వారికున్నాయ. అయితే ఎన్‌ఆర్‌ఐలకు, హిల్లరీకి మధ్య అనాదిగా సత్సంబంధాలున్నాయి.

Pages