S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

09/22/2016 - 06:08

రాజకీయ పార్టీలు నేరగాళ్లను పొంచిపోషించే సంస్కృతిని విడనాడాలి. లేనిపక్షంలో ఆ నేరగాళ్లే కాలనాగులా తయారై సమాజాన్ని కాటేస్తారు. ఉదాహరణకు తెలంగాణలో నరుూమ్ చరిత్రనే చూడండి. నరుూమ్ పూర్వాశ్రమంలో నక్సలైట్. అతనిని లొంగదీసుకున్న పోలీసులు, ప్రభుత్వం స్వప్రయోజనాలకు వాడుకుంది. ఫలితంగా లబ్ధిని పొందారు. ఇక్కడ బ్యూరోక్రసీ, లెజిస్లేచర్ కుమ్మక్కై ఒక నేరగాడిని చేరదీశాయి.

09/22/2016 - 06:06

నేరస్థులతో రాజకీయ నాయకులు సంబంధాలు పెట్టుకుంటే నేరస్థులతో సమానంగా శిక్ష పడేలా చట్ట సవరణ చేయాలి. అందుకు రాజకీయాల్లో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. సంస్కరణలు రానంతవరకూ ఈ పరిస్థితులు కొనసాగుతాయి. ఎంపి, ఎమ్మెల్సీ, ఇతర ప్రజాప్రతినిధులుగా పోటీచేసే వారు లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

09/22/2016 - 05:17

నిజాం కాలంలో నిరంకుశపాలన సాగినరోజుల్లో, రజాకార్ల దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు వామపక్షాలు ప్రజాఉద్యమాన్ని తీసుకువచ్చాయి. నిజాంనిరంకుశపాలన నుండి ప్రజలను విముక్తుల్ని చేశాయి. ఇప్పుడు భూస్వాములు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రియల్‌ఎస్టేట్ వ్యాపారులు, కార్పోరేట్ సంస్థల యజమానులు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. పేద ప్రజలను దోచుకుంటున్నారు. ఈ దోపిడీని అరికట్టేందుకు మరో ప్రజాఉద్యమం రావలసి ఉంది.

09/22/2016 - 05:15

కలుషితమైన రాజకీయాలను ప్రక్షాళన చేసేందుకు ప్రజల్లో చైతన్యం రావలసి ఉంది. ప్రజాస్వామ్య విధానమైన మన దేశంలో రాజకీయ వ్యవస్థ పవిత్రమైంది. రాజకీయాలు, రాజకీయ పార్టీలు లేకుండా సమాజం నడవదు. గతంలో నీతి, నిజాయితీ కలిగిన వారు రాజకీయాల్లో ఉండేవారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చట్టసభలకు సైకిళ్లపై వెళ్లేవారు, నడిచివెళ్లేవారు, ఆర్టీసి బస్సులో వళ్లేవారు.

09/15/2016 - 06:57

చట్టసభలు ప్రజాసమస్యలను పరిష్కరించే కేంద్రాలుగాకంటే రాజకీయ పార్టీల బాహాబాహీకి వేదికగా మారాయి. ‘దురదృష్టవశాత్తు కాలంతోపాటు చట్టసభల పనితీరులో విలువలు పతనమవుతున్నాయని, దీనిని నియంత్రించకపోతే భవిష్యత్‌లో సభలు తమ ప్రాధాన్యం కోల్పోయే ప్రమాదం ఉంది’ అని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఒక సందర్భంలో అభిప్రాయపడ్డారు. ఈ భావన అందరిలోనూ ఉంది.

09/15/2016 - 06:57

చట్ట సభలు ప్రజలు ఆలోచనలు ప్రతింబించేలా ఉండాలి. తాము ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు చట్ట సభల్లోకి వెళ్లి తమ సమస్యల గురించి మాట్లాడతారన్న ఉద్దేశంతో ప్రజలు ఉంటారు. అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలను కొంతమంది పనిగట్టుకుని చూస్తుంటారు. తమ ప్రాంత సమస్య ఏదైనా ప్రస్తావనకు వస్తుందా? అన్న ఆశతో ఎదురు చూస్తుంటారు. అయితే అనేక సందర్భాల్లో చట్ట సభల్లో ప్రజా సమస్యలు చర్చకు రావడం లేదు.

09/15/2016 - 06:56

రాజకీయ పార్టీలు ద్వంద్వ ప్రమాణాలు అవలంబిస్తున్నాయి. పాలకపక్షంగా ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలోకి వస్తే మరో రకంగా వ్యవహరిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సభను స్తంభింపజేయడంద్వారా ప్రజలను ఆకర్షించాలన్న తాపత్రయమే తప్ప ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి సహకరించాలన్న తపన ఉండడం లేదు. ఇక ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లోని చట్టసభల్లో విలువలు పడిపోతున్నాయి.

09/15/2016 - 06:55

ప్రజా ప్రతినిధులలో క్రమశిక్షణా రాహిత్యం రోజురోజుకు పెరిగిపోవడానికి రాజకీయ నేతలు ఒక్కరినే తప్పుపట్టలేం. అలాంటి వారిని తమ ప్రతినిధులుగా చట్టసభలకు పంపిస్తున్న ప్రజలు కూడా దీనికి కారణం. చట్టసభలలో ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరుతెన్నూలను లోతుగా విశే్లషించకుంటే ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్న చందం గుర్తుకు వస్తుంది.

09/15/2016 - 06:55

ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా చట్టసభలు పనిచేయాలి. సభ్యులంతా నీతి, నిజాయితీ, విలువలతో ఉంటూ తమ నియోజకవర్గాలే కాకుండా తమ ప్రాంతాలు, రాష్ట్రం అభివృద్ధికోసం అంకితమైన భావంతో పని చేయాలి. రాజ్యాంగం యొక్క స్పూర్తికి విఘాతం కలగకుండా చూసుకోవాలి. లోగడ వివిధ రాష్ట్రాల అసెంబ్లీలుగానీ, పార్లమెంటులోగానీ ఉన్న మంచి సంప్రదాయాలను పాటించాలి.

09/15/2016 - 06:54

శాసససభపై గురుతర బాధ్యత ఉంది. శాసనసభ్యులను ప్రజలు ఓట్లువేసి ఎన్నుకుంటారు. ఎమ్మెల్యేలంతా కలిసి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. ఆయన పరిపాలనా సౌలభ్యంకోసం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారు. ముఖ్యమంత్రి, మంత్రులు అసెంబ్లీకి జవాబుదారీగా ఉండాలి. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఏవైనా సమస్యలుంటే శాసనసభలో ప్రస్తావించి, వాటిని పరిష్కరించుకోవాలి. ఇప్పుడు ఏం జరుగుతోంది?

Pages