S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

08/28/2016 - 21:57

మహాకవి డా.ఆవంత్స సోమసుందర్ స్మారక పురస్కారాలకు ఆహ్వానం
వజ్రాయుధ కవిగా ప్రసిద్ధుడైన మహాకవి డా.ఆవంత్స సోమసుందర్ స్మృత్యర్థం వారి పేర స్మారక పురస్కారాలను ఈ సంవత్సరంనుండి ఇవ్వదలచాము.
వివరాలు
ఉత్తమ కవితా సంపుటి
ఉత్తమ అనువాద కవితా సంపుటి/సంకలనం
ఉత్తమ కథా సంపుటి
ఉత్తమ అనువాద కథా సంపుటి/సంకలనం

08/28/2016 - 21:55

అభిరుచులకీ, అనుభవాలకీ, ఆలోచనల పదునుకూ, జ్ఞాన సంపదకీ, గవేషణకీ, అనే్వషణకీ, అన్నిటికీ చదువు అవసరం. ఏ ఒక్క చదువూ మనని పరిపూర్ణ మానవులుగా తయారుచెయ్యలేదు. చదువుల బడిలో చదువుకున్న చదువులో గేప్స్ (గ్యాప్స్) పూర్తిచేసే చదువు అవసరం. అలాంటి చదువులే పుస్తక సాహిత్యమూ, సాహిత్య పుస్తకాలూ, కథలు అందులో ఒక భాగం.

08/28/2016 - 21:54

వాళ్లు ఆంగ్లం అనర్గళంగా మాట్లాడతారు
వారి తెలుగు తెలుగులా ఉండదు
మా తెలుగు వారికి అర్థం కాదు
మా పిల్లలు కూడా
వారితో ఆంగ్లంలోనే మాట్లాడతారు
ఆంగ్లం నేర్చుకున్నా నేర్పుతున్నా
తెలుగులో మాట్లాడమంటాం మేం
వాళ్లు నవ్వేసి ఊరుకుంటారు

ఒక్కోమారు
ఆ పిల్లలు
అలా పోట్లాడుకోవద్దని
మేము వారితో
తెలుగులో నచ్చచెబుతాం

08/28/2016 - 21:52

కవిత్వం 2015
సంపాదకులు:
దర్భశయనం శ్రీనివాసాచార్య
ప్రచురణ: కవన కుటీరం
వరంగల్- తెలంగాణ
వెల:రూ.80/-
ప్రతులకు:
నవోదయ, విశాలాంధ్ర,
నవ చేతన బుక్‌హౌస్
***

08/28/2016 - 21:50

‘కథ’ అనేది ఎప్పుడు పుట్టింది. ఎలా పెరిగింది, ఏమేం ప్రయోజనాలు సాధించింది అనే విషయాలను గురించి పరిశోధనలు జరుగుతూనే వున్నాయి. కొత్త కొత్త విషయాలు బయలుపడుతున్నాయి. కథ అనేది ఆధునిక యుగంలో పత్రికల కోసం పుట్టిందనీ, అమెరికా బాగా ప్రాచుర్యం సంపాదించిందనీ ఎరుక. పుట్టటం మటుకు ఇంగ్లాండ్‌లోనే. అంతమాత్రంచేత వెనకటి రోజులలో- ప్రాచీన యుగాలలో కథ వేరు అని కొట్టిపారేయాలేము.

08/21/2016 - 21:11

కథలో మాధుర్యం ఎక్కడ వున్నదంటే- చదువరి కథ చదవటానికి ముందు అతని వైఖరి, కథ చదివేసిన తరువాత అతని వైఖరిని బేరీజు వేయడంలో వుంది. మధురమయిన కథ చదువరి మనస్సును ఆలోచనలను మార్చివేయాలి. అతని మనఃస్థితి కొత్త రూపు కట్టుకోవాలి. కథలో చదివిన సన్నివేశ ధోరణికి యిచ్చిన సమాధానం అతన్ని అక్కర పరిచేదిగా, అంతకుముందు ఊహించనిదిగా వుండాలి. కథ చివర మెలిక యివ్వడం కాదు యిది. కథను కొత్తగా అర్థం చేసుకోవటానికి దోహదపడడం.

08/21/2016 - 21:07

తెలుగు సాహిత్యంలో సంవాదాలు ఇప్పుడు పత్రికల నుంచి సామాజిక మాధ్యమంలో విస్తృతంగా సాగుతున్నాయి.
వర్ధమాన రచయితల దగ్గరి నుంచి మహామహుల దాకా అందరికీ సామాజిక మాధ్యమం వేదికగా మారింది. సాహిత్య సృజన అనేక పుంతలు
తొక్కుతోంది. అలాంటి సృజనల్లో ఒక తురుపుముక్క ఇది. ప్రపంచ భాషలన్నింటిలోనూ తెలుగులో పదప్రయోగం ఎంత అద్భుతంగా ఉంటుందో..
ఎన్ని విధాలుగా ప్రయోగాలు చేయవచ్చనటానికి ఈ సంవాదం ఓ నిదర్శనం.

08/21/2016 - 21:05

ఒక్కొక్క చెట్టు
ఒక్కో వనం అయ్యే కాలం
ఒక్కొక్క చెట్టు
ఒక్కో అరణ్యం అయ్యే కాలం
ఒక్కొక్క చెట్టు
ఒక్కో ఋతువు పూయించే కాలం
కాలాలు ఎన్ని మారినా
యుగాలు ఎన్ని గడిచినా
చెట్టు ఒక ఇతిహాసం!
ప్రకృతి నేర్పే పాఠాల్లో
చెట్టు చరిత్ర మొదటి అధ్యాయం
మనిషి జీవనానికి, జీవితానికి
జీవం నింపిన చెట్టుకు ప్రణామం!

08/21/2016 - 21:03

ప్రశాంత సాగర సంకేతం
జ్వలిత కాసార సందేశం
జలధార హృది ప్రయాణం
రుధిర సమ్మోహన ప్రళయం
ఆకాశం భూమి రెండూ చీలిన క్షణం
విజృంభించిన దృశ్య స్వప్నం
ఆటుపోటులెత్తిన అలకు
సమాన కేతనం
నవరస నిర్మాణ సౌధం

సింధూర మందర కేదారం
మధుకలశం వర పాషాణం
శృంగార మకరంద సమ్మేళనం
నిర్మల చంద్రకాంతి దరహాసం

08/21/2016 - 21:31

లలిత కళలలో కవిత్వానిది అగ్రపీఠం. ఏ కళ అయినా కవితామయం అయినప్పుడే రాణిస్తుంది. కవిత్వాంశ లేని కళ వాసన లేని పువ్వులా ఆకర్షించదు. అందుకే కవిత్వంకోసం ప్రపంచం అంతా తపించింది. నేడూ తపిస్తోంది. భవిష్యత్తులోనూ తపిస్తుంది. ఇదీ కవిత్వ ప్రత్యేకత. అసలు సృష్టి అనేదే ఒక రమణీయ కవిత్వమనీ, దానిని సృజించిన మహాకవి సృష్టికర్త అయిన భగవంతుడే అనీ వేదాలు వర్ణిస్తున్నాయి. ఇలాంటి కవిత్వం సకల సాహిత్యాలకూ శిఖరం వంటిది.

Pages