S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

05/30/2016 - 04:47

అలనాటి వేణుగానం
పక్షుల కిలకిలా రవాలలో ఇమిడిపోయనట్టు
ఇంతకు ముందెన్నడూ విననతి సమ్మోహన స్వరంతో
రాలిన ప్రతిసారీ ఈ భూమీద పుట్టే కొట్ట మల్లెపూవు ఆ రాచిలుక
ప్రతి నట్టింటా ఛంగుఛంగున దూకే మొలక నవ్వుల సిరి

05/30/2016 - 04:00

ముందు మాట అంటే కవులని, రచయితలని ప్రశంసిస్తూ రాసే వ్యాసం కాదు. అట్లని విశే్లషిస్తూ రాసే విమర్శా కాదు. గ్రంథ రచయిత (అతను/ఆమె) కృషిని అర్థం చేసుకుని, ప్రతిభని బలహీనతల్ని సమతూకం వేసి వ్యాఖ్యానించే వాస్తవం. పదమూడు పేజీల కవిత్వానికి యాభై ఆరు పేజీల ముందు మాట రాసిచ్చిన ప్రముఖుడు నాకు తెలుసు.

05/22/2016 - 21:25

అలిగిన ఇల్లాలు
పిల్లలతో పుట్టింటికెళ్లిపోయినట్టు
ఇల్లు ఇల్లులా లేదు
అమ్మ చిరునవ్వులా మెరిసిన ఇల్లు
చుట్టూ పచ్చరంగు చల్లుకుని
మొక్కల నడుమ మొలిచినట్టుండే ఇల్లు
ఇల్లులా లేదు
లాల పోసి లాలించి
తులసి ముఖాన తడిబొట్టు పెట్టి,
నిత్య వసంతంలా
బంతులూ, చేమంతుల అలికిడి పూయించి
కరివేపాకు చెట్టుకొమ్మల్లో

05/22/2016 - 20:58

ఉన్నట్టుండి టెలివిజన్ సెట్‌లో
రంగులు వెలిసిపోయినట్టనిపిస్తుంది

మోజుపడి కొనుక్కున్న కొత్త బైక్
ఇంటిముందు పార్క్ చేసినప్పుడు
దర్జా చూపుతుంది గానీ
చెల్లించాల్సిన ఇఎంఐలు
కళ్ళ ముందు కనిపించి భయపెడతాయి

వడదెబ్బకి వృద్ధ బంధువొకరు
ప్రాణం విడిచినప్పుడు
తప్పని వేసవి ప్రయాణానికి
చేసిన అప్పులు వొక్కచోట నిలువనీయవు

05/22/2016 - 20:54

భావాలు చిలుకలై నక్షత్రాకాశంలో
తేలియాడుతున్నాయి
అక్షరాలు పదాలై మాలూలాభరణాలై
భావాలు భాస్వరాలైతయ్
పూలమరిమళాలైతయ్
బ్రతుకు సుగంధాల తోటలో విరబూస్తాయ్
నిశీధి వేళ వెలుగే నక్షత్రకాంతల నవ్వులు కదా
అవెప్పుడూ పగలు అదృశ్య లోకంలో సేదదీరుతాయి
రాత్రిని వెలిగించే రేరాజు చుట్టూరా చేరి
ముచ్చట్ల సరదాలతో కాలాన్ని కరిగిస్తాయి

05/22/2016 - 20:50

‘‘ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్ (రమ్యమైనది ఏదైనా ఎప్పుడూ ఆనందాన్ని కలిగిస్తూనే ఉంటుంది)’’ అన్నాడు ఆంగ్ల కవి జాన్ కీట్స్. ఈ వాక్యంతో మొదలయ్యే తన కవితలో ప్రకృతిలోని ఎన్నో రమణీయ వస్తువులతో తాదాత్మ్యం చెంది, అనుభూతుల జడివానలో తడిసిపోయి ఆనంద డోలికలలో ఊగిపోయే కీట్స్ కనిపిస్తాడు. కీట్స్‌ది ఒక గొప్ప అనుభూతి ప్రపంచం.

05/22/2016 - 20:48

భాష బతికి బట్టకట్టాలనే కోరిక, ఆరాటం భాషని ప్రేమించే వాళ్ళకందరికీ వుంటుంది. తెలివిలేనివాడు కూడా ఒకోసారి మంచి సలహాలు ఇవ్వగలడట. భాషా జ్ఞానం అంతగా లేని నాకూ ఏదో ఉడతా భక్తిగా ఏదో చెప్పాలనే ఉబలాటం.
మనం తెల్గూస్. మనం మాట్లాడేది ‘టెల్గు’- ‘తెంగ్లిష్’- ‘తెలుగిష్’ అని స్వయం నిందారోపణలు చేసుకొంటూ బతికేస్తున్నాము, ప్రయత్న శూన్యంగా!

05/22/2016 - 20:47

సామాజిక పరిణామక్రమంలో మనిషి జీవితం గత రెండు దశాబ్దాల నుండి మరింత విధ్వంసానికి గురవుతోంది. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా అవే స్థితిగతులు, అవే సంక్షోభాలు, అవే గాయాలు భారతదేశం నిండా పర్చుకొని ఉన్నాయి. సకలాన్ని ధ్వంసం చేస్తోన్న వర్తమాన పరిస్థితితో చీకటి ఊడలు మనిషి మూలాల్లోకి దిగిపోతున్నాయి. అది తెలంగాణ అయినా, ఉత్తరాంధ్ర అయినా, రాయలసీమ అయినా ఇవే సంకీర్ణ దృశ్యాలు కనిపిస్తాయి.

05/16/2016 - 00:43

........................
ధ్వనికి తగిన లిపి సంకేతాలను సంస్కరించి ఏర్పరచుకొన్న భాష తెలుగు.
అనవసర లిపి సంకేతాలు లేవు. లిపి సంకేతాలను ఎన్నిసార్లు వాడగలమన్న దానికన్నా ఎంత స్పష్టంగా ఉచ్చరించగలుగుతున్నామన్న అంశానికే ప్రాధాన్యత.
.........................

05/16/2016 - 00:39

ప్రేమికుల భాష
చిరుగాలిలా ఉంటుంది
సంభాషణా సంద్రంపై సాగే అలల్లా...

కురుస్తున్న ప్రేమ వెనె్నల్లో
అస్తిత్వంలోనే దేహాలు
ఆత్మలు ముడిపడే ఉంటాయ
పూల పరిమళం
ఉంటుందేమో వారి మాటల్లో...
ఎవరికి తెలియని మార్దవం కూడా...

స్పందన ప్రతిస్పందన ఒకే శ్వాసలో...
ఉరుకుల పరుగుల బతుకుల్లో
ప్రేమ చోదక శక్తి...
మనిషిని బతికించేదీ...

Pages