S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

06/12/2016 - 22:11

గది నిండా వాన తడిముగ్గు గీసింది
అన్నం పాత్రలలో వాన నదిలా వొదిగింది -
నగర, ఆకాశంపై వానపక్షులు
నోరారా పిలిస్తే గొంతుపై వాలతాయి -
వానకు, తళతళ మెరుస్తున్న గోడపై
పడవ బొమ్మను చిత్రిస్తున్న చిన్నారి చేతులు
పడవ ఎక్కేందుకు నిరీక్షిస్తున్న వాన తడిపిన శరీరాలు -
కిటికీ రెక్క తెరిచి చూడు
వాన హరివిల్లులా వంగి లోపలికి వస్తుంది -

06/12/2016 - 22:09

కాలం వెనుక దాగున్న
రహస్యాన్ని ఎవరు
విప్పి చెప్పగలరు?
ప్రజల నానుడి
నొక్కిపెడుతున్న
పాలకులకు
బడికంటే ఈరోజు
గుడి మాత్రమే నడవడి సూత్రం!

06/12/2016 - 22:06

నేనొక జీవ నదిని
కనాలని కలగంటున్నాను...

నేల నలుచెరగులా కలియ తిరిగి
జీవితాన్ని ఎప్పుడూ
తడితడిగా వుంచే సెలయేరుని
కనాలని కలగంటున్నాను

ధర్మాన్ని బహిరంగ పరిచి
మానవ మతాన్ని నిర్మించే
ఒక ఏలికను,
నిష్కల్మషమైన మహావీరుల్ని
కనాలని కలగంటున్నాను

06/12/2016 - 22:04

కందాన్ని అందంగా రాస్తే
డెందం పులకిస్తుంది
ఉత్పలాలను చంపకాలతో కలిపి
స్రగ్విణులకిస్తే ఎంత బాగుంటుంది?
అప్పుడు తేటగీతులు అల్లుకోవచ్చు
మూసలో పోసే సీసాలతో పనిలేదు
అచ్చమైన సీసం
మోసుకొస్తుంది అమృతం
శార్దూలాలతో ఆడుకోవాలనుకుంటే
మత్త్భాలపై ఊరేగాలనుకుంటే
పంచచామరాల వీవనలతో
భవ్యమైన సేవలను పొందాలనుకుంటే
లయగ్రాహిత్వం అవసరం

06/12/2016 - 22:02

నేడు అన్ని రంగాలపై ప్రపంచీకరణ దుష్ప్రభావం ప్రసరిస్తోంది. చాపకింద నీరులా ప్రవహిస్తూ, కనిపించని శత్రువులా దాడిచేస్తూ అన్ని రంగాలను, నిర్వీర్యం చేస్తోంది. సాహిత్య రంగం అందుకు మినహాయింపేమీ కాదు. సాహితీ ఉద్యమాలు, సిద్ధాంతాలు, అస్తిత్వపు వేదనలు, మానవ హక్కులు, మానవ సంబంధాలు, అన్నింటిపై ప్రపంచీకరణ ప్రభావం ఊహించని విధంగా పెరిగింది.

06/12/2016 - 21:59

కథ అంటే యేమిటి? దానికి ఎన్ని ముఖాలున్నాయి? ఈ విషయం అందరికీ తెలిసిందే. కథంటే జరుగుతున్న ప్రపంచంలో నడుస్తున్న చరిత్ర. ఎందరు మనుషులున్నారో అన్ని ముఖాలూ ఉన్నాయి కథకు. ఒక్కో ముఖం ఒక్కో క్షణంలో బహురూపాలు ధరిస్తూ ఉంటుంది. వీటన్నిటినీ విరామంగా అక్షరబద్ధం చేయడమే కథ చేసే పని.

06/12/2016 - 21:55

ప్రశ్నించడం నేరం అయ్యేది నియంతృత్వంలో మాత్రమే. ప్రశ్నించడాన్ని స్వాగతించడం, సమాధాన పరచడం నిజ ప్రజాస్వామ్య ఆరోగ్య లక్షణం. పాలనా బుర్రకథలో ‘తందానా తందాన తానలు’ మరీ ఎక్కువైపోతున్నప్పుడు, ప్రజల భళాభళులు తక్కువై పోతున్నప్పుడు ప్రజాహృదయ పాళీ భాషలో కవుల కలాలు ప్రశ్నిస్తాయి, నిరసిస్తాయి. సంస్కరణలను నినదిస్తాయి అవసరమయిన సందర్భాలలో నిలదీస్తాయి. ఈ పనులే చేస్తున్నాయి ఈ కవితా సంకలనంలోని కవితలు.

06/06/2016 - 03:47

మనిషంటే మనిషికి
ప్రతిక్షణం భయం
మనిషికన్న మృగం
ప్రతి నిత్యం నయం
దొరతనం పైపైన
దోషగుణం లోలోన
ద్వేషభావం అనునిత్యం
పెత్తనమేనా మనతత్వం
మనిషికున్న బలం
మంచితనం కాదా
అది మరచిన వాడు
అరాచకానికి పెద్దన్నా
మనిషి మాటలు
తేనెల ఊటలవ్వాలి
మనసు తలపులు
బంగారు బాటలవ్వాలి
పరహితం కనిపించని చోట

06/06/2016 - 03:45

చాన్నాళ్ళుగా
నేను వాళ్ళనే గమనిస్తున్నాను
ఆ ఇంట్లో ఓ మగపిల్లాడు
ఓ ఆడపిల్ల...
వాడెప్పుడు బయటకెళ్ళినా
తిరిగి ఇంటికొచ్చేదెప్పుడో?!
ఆ పిల్లమాత్రం
ఎలా వెళ్తుందో అలా వచ్చేస్తుంది
ఒంచిన తల ఎత్తకుండా...
వాడికి తలబిరుసుకానీ-
ఆమెకి తనెలాగుండాలో తెలుసు
ఆ ఇంట్లో...
పదిహేనేళ్ళు రాకుండానే
ఆడపిల్ల పెద్దమనిషయ్యింది

06/06/2016 - 03:48

ఆరో అంతస్తు బాల్కనీ -
ఊగీ ఊగని ఊయల
పైన
బూడిద రంగులో ఆకాశం
కింద
గాడిద మేస్తున్న మైదానం.
గత కాల వర్తమానాల రజ్జువులకి
ఊగీ ఊగని ఊయల
పెంటుహౌస్ రేకుల మధ్యనుంచి
పావురాళ్ళ మూలుగుల మూర్ఛనలు
వాటి అందం మాటెలా వున్నా,
అవి పాడుచేసిన వైనమే ఎక్కువ
ఎక్కడో విమానం ఎగురుతోంది
చిన్న పక్షిలా -
మనసులో పిల్లలు మెదిలి

Pages