S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఓ చిన్నమాట!
గ త నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ కాలమ్ రాస్తూ వున్నాను. ఎంతో మందిని ఆకర్షించింది ఈ శీర్షిక. ఇప్పటికి రెండు పుస్తకాలు వచ్చాయి. మూడవ పుస్తకం రాబోతోంది. ఈ కాలమ్ లేకపోతే ఇన్ని కథనాలు రాసి ఉండకపోయేవాణ్ణి. ఇంత మంది అభిమానులని సంపాదించుకోలేక పోయేవాణ్ణి.
రాజుల కథలు, మాయలూ, మంత్రాల కథలు చదవని పిల్లలు అరుదుగా ఉంటారు. వినని పిల్లలు లేరనే చెప్పవచ్చు. ఆ కథలు చాలావరకు సుఖాంతం అయ్యేవి. మంచి విజయం సాధించేది. చెడు నశించేది. దాదాపు అన్ని కథల్లో ఇదే జరిగేది.
కొన్ని కథల్లో రాక్షసుడు వుండేవాడు. అతను రాకుమారుడి చేతిలో హతం అయ్యేవాడు. సూక్ష్మంగా చెప్పాలంటే చెడు నాశనం అయ్యేది. మంచి విజయం సాధించేది.
జీ వితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఎన్నో కథలు కన్పిస్తూంటాయి. చాలా రోజుల క్రితం అలాంటిదే ఓ కథని చదివాను. ఆ కథను మళ్లీ ఈ మధ్య కాలంలో చదివాను. ఒక గొప్ప ఉత్సాహం కలిగే విధంగా ఆ కథ ఉంది. ఆ కథ నాకు బాగా నచ్చింది. అందుకని మీకు కూడా చెబుదాం అన్పించింది. ఆ కథ మీ కోసం.
ఈ సృష్టి విచిత్రమైనది. ఒక చిన్న విత్తనం నుంచి ఒక మహా వృక్షం పెరుగుతుంది. ఈ విషయాన్ని చాలామంది విస్మరిస్తున్నారు.
విత్తనం నుంచి పెద్ద మర్రిచెట్టు రావడం ఒక్క రోజులో జరిగే పని కాదు. దానికి దాని పెరుగుదల కోసం అవసరమైన నీరు, గాలి, వెలుతురు ఇట్లా ఎన్నో కావాల్సి వస్తుంది. ఎన్నో సంవత్సరాలకు గానీ అది మహావృక్షంగా పరిణమించదు.
క్యారం బోర్డుతో ఇంట్లో నీడ పట్టున ఆడే ఆటలు మా చిన్నప్పుడు చాలా ఉండేవి. అందులో ముఖ్యమైనవి - అష్టా చెమ్మా, కైలాసం, పచ్చీసు.
కైలాసం పేరు తరువాతి కాలంలో స్నేక్ అండ్ ల్యాడర్‌గా మారిపోయింది. ఈ ఆట సరదాగా ఉండేది. ఇతరుల ప్రమేయం ఇందులో తక్కువగా ఉండేది. మన విజయం మన మీదే ఆధారపడి ఉండేది. మిగతా ఆటల్లో మన విజయం ఇతరుల ఆట మీద కూడా ఆధారపడి వుండేది.
కాలం పరుగెడుతూనే ఉంది.
ఈ ప్రపంచంలో అందరిని సమానంగా చూసేది, దాచుకోవడానికి వీల్లేనిది కాలమే!
సరిగ్గా 28 రోజుల తరువాత కొత్త సంవత్సరం వస్తుంది.
నిన్న గాక మొన్న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నట్లుగా ఉంది.
నిన్న గాక మొన్న కొత్త తీర్మానాలు చేసుకున్నట్టుగా ఉంది.
విచిత్రం.
అప్పుడే కొత్త సంవత్సరం పరుగెత్తుకొస్తోంది.
కాలం ఎగిరిపోతుంది.
జీవితంలో చాలామంది సంతోషంగా ఉండకపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యమైంది వాళ్లు జీవించకపోవడం.
జీవించడం అంటే యాంత్రికంగా జీవించడం కాదు. మనసు పెట్టి జీవించడం. ఈ పనిని చాలా మంది చేయరు. ఈ పనిని ప్రయత్నపూర్వకంగా చేయాలి. అప్పుడే సంతోషంగా ఉండటం మొదలవుతుంది.
విజయం సాధించాలనే మన ప్రయత్నం మనం చేయాలి. మొదటి ప్రయత్నంలోనే విజయం లభించకపోవచ్చు. కానీ ప్రయత్నం కొనసాగాలి. అది నిరంతరం కొనసాగాలి.
రోజూ వాకింగ్ చేయడం నా అలవాటు. పనుల ఒత్తిడి వల్ల మా ఆవిడ వాకింగ్‌కు రావడం కుదరలేదు. అందుకని ఓ సైకిల్ కొన్నాను. ఇది ఓ ఇరవై సంవత్సరాల క్రితం మాట. అవకాశం వున్నప్పుడు, అవకాశం చిక్కించుకొని సైక్లింగ్ చేస్తుందని నేను భావించాను.
ఓ రెండు నెలలు దాన్ని అప్పుడప్పుడూ ఉపయోగించి ఆ తరువాత దాన్ని ఉపయోగించడం మానేసింది. ఇంట్లో ఎవరూ ఆ సైకిల్ ఉపయోగించలేదు.