పెళ్లి ఆలోచన!
Published Saturday, 22 July 2017అందాలభామ కాజల్ అగర్వాల్ కెరీర్ ఇక ముగిసినట్టే అంటున్నారంతా. అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. చాలా కాలంగా ఇక పెళ్లి చేసుకుని సెటిలవుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ దశలో మళ్లీ కొన్ని అవకాశాలు వస్తుండడంతో కెరీర్ మళ్లీ పుంజుకుంటుందనే భావన ఆమెలో కలుగుతోందిట. ఇప్పుడు తనకు పెళ్లి ఆలోచనే లేనేలేదంటోందిట. ఈ విషయం గురించి కాజల్‌ని కదిలిస్తే- ‘‘ఎక్కడికెళ్లినా పెళ్లి.. పెళ్లి అంటూ తెగ ఇబ్బంది పెట్టేస్తోంది మీడియా. ప్రస్తుతం నాకు ఆలోచనే లేదు. కెరీర్లో ఇంకా సాధించాల్సింది చాలానే వుంది. అయినా పెళ్లి చేసుకోవాలనుకుంటే ముందు మీకే చెబుతాను. ఇంకా అలాంటి వాడు తారస పడలేదు’’అంటూ చెప్పుకొచ్చింది. దటీజ్..కాజల్!