సందేశాత్మకం ‘లైఫ్‌కి ప్లాట్‌ఫాం టీనేజ్’
Published Friday, 29 July 2016జై చిరంజీవ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కొండపల్లి పర్వతాలు సమర్పణలో తన్నీరు చిరంజీవి దర్శకత్వంలో సకినాన భూలక్ష్మి నిర్మించిన చిత్రం ‘లైఫ్‌కి ప్లాట్‌ఫాం టీనేజ్’. ఉమ,రాఘవ, ప్రకాష్, శశాంక్, రాహుల్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని వచ్చే నెల 13న విడుదల చేయడానికి సిద్ధమైన నేపథ్యంలో దర్శకులు తన్నీరు చిరంజీవి మాట్లాడారు.
సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించామని, యూత్‌కు బాగా నచ్చే చిత్రమని, టీనేజ్‌లో తెలిసీ తెలియక చేసే పనులవల్ల అనర్థాలు జరుగుతాయని, సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఆ టీనేజ్ జీవితానికి సరైన ప్లాట్‌ఫాం అవుతుందనే కానె్సప్టుతో రూపొందించామని ఆయన తెలిపారు. నిర్మాత భూలక్ష్మి మాట్లాడుతూ, ఈ చిత్రంలో యువతరానికి కావలసిన అన్ని అంశాలు ఉన్నాయని, తప్పకుండా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.