కృష్ణా పుష్కర వైభవం
Published Saturday, 6 August 2016బెజవాడ కనకదుర్గమ్మ చల్లని చూపులతో
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడగా
తెలుగింట కళకళలాడే కళావైభవంగా
కదలి వచ్చింది కృష్ణా పుష్కరం
అమరావతి రాజధాని శోభతో
అలరారే కృష్ణానదీ తరంగాల
తెలుగు తల్లికి మంగళ హారతులు అందిస్తూ
కదలి వచ్చింది కృష్ణా పుష్కరం
దశదిశలా తెలుగు కీర్తి వైభవం
తెలుగింట తెలుగునాట తెలుగు నోట
తీయని పలుకులా ప్రవహించే
పుణ్యనదీ ప్రవాహంలా
కదలి వచ్చింది కృష్ణా పుష్కరం
బౌద్ధమతం శాసనాలతో
అమరావతి అపురూప శిల్ప సంపదతో
కళకళలాడే కృష్ణాతీరంలా
కదలి వచ్చింది కృష్ణా పుష్కరం.