S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

09/02/2018 - 00:04

సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపేందుకు, వివిధ కులాల మధ్య హెచ్చు తగ్గులు లేకుండా చూసేందుకు, మానవ సేవయే మాధవసేవగా పరిగణిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను, సామాజిక సేవా కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగిస్తున్న శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. భగవత్ రామానుజాచార్యులు చిన జీయర్‌కు ఆదర్శమూర్తి.

09/02/2018 - 00:02

సమాజాన్ని సక్రమమార్గంలో నడపాలంటే ఎవరో మహానుభావులు జన్మించాల్సిందే. సమాజంలో సమానత్వం సాధించేందుకు, అంటరానితనాన్ని రూపుమాపేందుకు, దేవాలయాల్లో అందరికీ ప్రవేశం కల్పించేందుకు వేయి సంవత్సరాల క్రితమే ‘విప్లవం’ సృష్టించిన మహానుభావుడు భగవత్ రామానుజాచార్యులు. అట్టడుగు వర్గాలు ఆలయాల్లోకి వచ్చేందుకు వీలులేని వాతావరణం కొనసాగుతున్న సమయంలో, అంటరానితనం అడుగడుగునా కనిపిస్తున్న సమయంలో రామానుజులు జన్మించారు.

09/01/2018 - 20:48

టైప్ మిషీన్‌తో ఎవరైనా ఏం చేస్తారు? ఇదేం పిచ్చి ప్రశ్న. టైపు మిషీన్‌తో ఎవరైనా టైపే కదా చేస్తారు అని విసుక్కుంటున్నారా!? టైప్ రైటర్ మెషీన్‌తో పేపరుపై అక్షరాలు టైపు చేయడం అందరికీ తెలిసిన విషయమే.. కానీ టైప్ మిషీన్‌తో ఎవరైనా చిత్రాలను టైపు చేయగలరా? ఇది చాలా అసాధ్యమైన విషయం. కానీ ముంబయికి చెందిన చంద్రకాంత్ భిడే మాత్రం చిత్రాలను చకచకా టైపు చేస్తారు.

08/25/2018 - 20:28

భారతదేశానికి స్వాతంత్య్రం రావటానికి మూడేళ్ల ముందే అంటే 1944లోనే ముగ్గురు గిరిజన వైతాళికులు గిరిజనోద్ధరణ కొరకు నడుం కట్టారు. వారివారి నివాసిత గ్రామాలను విడిచి తంబూర, రెండు డక్కీలు తీసుకొని కాలినడకన ఊరూరా తిరిగారు. ఊరికి దూరంగానో, కాల్వగట్లపై, చెరువు గట్లపై, తాటాకు గుడిసెల్లోనో, బొంతల నీడల్లోనో నివాసముండే తమ జాతి జనుల దగ్గరికి వెళ్లేవారు. దయనీయమైన, దారుణమైన వారి జీవిత వెతల గూర్చి చెప్పేవారు.

08/25/2018 - 19:23

హిందూ సంప్రదాయ పండుగల్లో బంధాలను, బంధుత్వాలను.. అన్నాచెల్లెళ్ల.. అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలను చాటిచెప్పే పండుగ రాఖీ పౌర్ణమి. అంతటి పవిత్రమైన, ప్రాధాన్యత కలిగిన రాఖీ పౌర్ణమిని ఏటా శ్రావణమాసంలో పౌర్ణమి రోజున జరుపుకోవడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడు.. ఇలా చిన్నా పెద్ద అనే తారతమ్యం లేకుండా ఆప్యాయతలను పంచేది రాఖీ పండుగే..

08/25/2018 - 17:53

ఆ ఇంట్లో కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువులే కాదు.. పులి, హైనా, ఎలుగుబంటి, హైనా, పాములు.. వంటి క్రూర జంతువులు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఆ ఇంట్లో పెంపుడు జంతువులే.. ఇవి ఆ ఇంట్లోని మనుషులకు ఎటువంటి హాని చేయకుండా ఎంతో విశ్వాసంగా, ప్రేమగా మెలుగుతాయి. పెంపుడు జంతువుల్లా ఇంట్లో వారితో ఆడుకుంటాయి. పిల్లలకు ఎటువంటి హాని చేయకుండా వారిని ముద్దు చేస్తాయి. అదే ‘యానిమల్ ఆర్క్’.

08/23/2018 - 22:26

ఈ ప్రపంచంలో ఒకటి మాత్రం సత్యం.
ఎవరు ఎంతకాలం బతుకుతారో తెలియదు కానీ, ఎన్నడో ఒకరోజు చనిపోతారన్నది పరమ సత్యం.
కృష్ణుడు గీతలో చెప్పిన విషయం ఇదే. పుట్టినవాడు గతించక తప్పదు.
మరణం గురించి మాట్లాడటం ఎవరికీ ఇష్టం ఉండదు. కానీ అది వాస్తవం.

08/18/2018 - 19:58

కేంద్రియ ఉత్పాదన మరియు సీమా పన్నుల (సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్) వారి కార్యాలయం అది. రాధ, కృష్ణ, గోపాలం ముగ్గురూ ఒకే భాగంలో పని చేస్తారు. ముగ్గురికీ పెళ్లిళ్లు కాలేదు. ఇంచుమించు ఒకటే వయసు వారు.

08/17/2018 - 20:21

కరిగేకాలంలో చెదరని జ్ఞాపకాలకు ప్రతిబింబాలు ఫొటోలు. ఇప్పుడంటే కెమెరా, సెల్‌ఫోన్ రూపంలో చేతిలోనే ఉండటం వల్ల ప్రతి సందర్భాన్నీ జ్ఞాపకాలుగా మలచుకుంటున్నాం.. కానీ దశాబ్దం క్రితం వరకు ఫొటోల సంస్కృతి తక్కువే.. తీసుకున్న ఫొటోలు కొనే్న అయినా.. సమయం దొరికినప్పుడు వాటిని ముందేసుకుని ప్రతి ఫొటో వెనుక ఉన్న ఆ సందర్భాన్నీ.. కథనీ.. అనుభూతిని.. తలచుకుంటే భలే గమ్మత్తుగా ఉండేది.

08/11/2018 - 23:48

చాలా మందిని చూస్తున్నప్పుడు చిన్నప్పటి అద్దాల ప్రదర్శన గుర్తొస్తుంది.
మా వేములవాడలో శివరాత్రి చాలా పెద్ద పండుగ. నెల రోజుల ముందు నుంచే జాతరకు మా వూరు సిద్ధమయ్యేది. జాతర గ్రౌండ్‌లో కొత్తకొత్త షాపులు వెలిసేవి. సర్కస్ వచ్చేది. లైట్లను వెలిగించే అమ్మాయి. మోటారుసైకిలుతో విన్యాసాలు చేసే గ్లోబు ఇలా ఎన్నో వచ్చి చేరేవి.

Pages