S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/28/2016 - 23:59

ఎల్లారెడ్డిపేట, జూలై 28: గత అరవై ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో చెరువులు నిరధారణకు గురయ్యాయి.. గ్రామీణ ప్రాంత ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. ప్రతి వర్షం చుక్కను ఒడిసి పట్టి చెరువులకు జలకళ తీసుకురావడానికి తమ ప్రభుత్వం మిషన్‌కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టింది.. అందుకు 20 వేల కోట్లు వెచ్చించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది..

07/28/2016 - 23:58

కరీంనగర్, జూలై 28: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలోని రహదారులు, ఇతరత్రా సౌకర్యాలు ఎలా ఉన్నాయో అదే తరహాలో కరీంనగర్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. గురువారం నగరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల తాము ఇండోర్‌లో పర్యటించి ఆధ్యయనం చేశామన్నారు.

07/28/2016 - 23:56

ఇల్లంతకుంట, జూలై 28: జిల్లాలోని సిరిసిల్ల మధ్యమానేరు పనులను 2017 లోపు పూర్తి చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని కందికట్కూరు శివారు పల్లె అయిన గుర్రంవానిపల్లెలో నిర్మిస్తున్న మధ్యమానేరు ప్రాజెక్టు స్పిల్‌వేను ఆయన పరిశీలించారు. మధ్యమానేరు లోకి నీరు రావడంపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. 2017లోపు పూర్తి చేయాలని ఆదేశించారు.

07/28/2016 - 23:56

బోయినపల్లి, జూలై 28: మధ్యమానేరు జలాశయ నిర్మాణాన్ని పూర్తి చేసి ఇందులో నీటితో మల్లన్న సాగర్ ప్రాజెక్టు నింపుతామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. గురువారం మండలంలోని మానువాడ వద్ద నిర్మిస్తున్న మధ్యమానేరు జలాశయం స్పిల్‌వే నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.

07/28/2016 - 23:55

సుల్తానాబాద్, జూలై 28: మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని జిల్లా జడ్జి నాగమారుతి శర్మ అన్నారు. గురువారం మండలంలోని కొదురుపాక గ్రామ పంచాయతీ పరిధిలోని దేవునిపల్లిలో గల లక్ష్మినంబులాద్రి స్వామి దేవాలయం ఆవరణలో ఆయన మొక్కలను నాటారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం ఒక్కటే మార్గమన్నారు. నాటిన మొక్కలను బాధ్యతగా సంరక్షించాలన్నారు.

07/28/2016 - 23:55

ఇల్లంతకుంట, జూలై 28: జిల్లాలోని సిరిసిల్ల మధ్యమానేరు పనులను 2017 లోపు పూర్తి చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని కందికట్కూరు శివారు పల్లె అయిన గుర్రంవానిపల్లెలో నిర్మిస్తున్న మధ్యమానేరు ప్రాజెక్టు స్పిల్‌వేను ఆయన పరిశీలించారు. మధ్యమానేరు లోకి నీరు రావడంపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. 2017లోపు పూర్తి చేయాలని ఆదేశించారు.

07/28/2016 - 23:54

ఎల్లారెడ్డిపేట, జూలై 28: మారుమూల పల్లెను తాను దత్తత తీసుకుంటే కొందరు సాధ్యమవుతుందా.. అని ప్రశ్నించారు. మధ్యలోనే వదిలి వెళ్లిపోతారని హేళనగా మాట్లాడుకున్నారు. అందరి సహకారంతో అభివృద్ధి పరిచి దేశంలో వీర్నపల్లికి గుర్తింపు తీసుకు వచ్చామని కరీంనగర్ ఎంపి బోయనపల్లి వినోద్‌కుమార్ అన్నారు. గురువారం ఆయన మంత్రి కెటిఆర్, సాగీ డైరెక్టర్ కుశాల్ పథక్‌లతో కలిసి పర్యటించారు.

07/28/2016 - 23:53

గోడ దూకడం తోడేలునకు నిరంతర కృత్యం..చైనా మళ్లీ గోడ దూకింది! ఈసారి ఉత్తరఖండ్‌లోకి చొరబడింది! ఒకచోట దూకుతున్న తోడేలును కాపరులు కనిపెట్టనంతవరకు ఆ వికృత మృగం దూకుతూనే ఉంటుంది! కనిపెట్టిన కాపరులు తోలడానికి తరమడానికి బద్ధకించినట్టయితే ఆ కోరల వృకానికి మరింత ధైర్యం వస్తుంది. తరమడానికి వెళ్లినట్టయితే ఆ హింసమృగం తమను కూడ కరిచి గాయపరస్తుందన్న భయం కాపరులకు కలిగితే మరీ ప్రమాదం.

07/28/2016 - 23:51

హైకోర్టు తమ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలన్న రాయలసీమ నేతల డిమాండ్ సహేతుకమైంది. నిజానికి ఇది 1937లో కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగు నేతలు, రాయలసీమ వారికి ఇచ్చిన హామీ కూడ. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం..ఆంధ్రలో రాజధాని ఉన్నట్లయతే, హైకోర్టును మాత్రం రాయలసీమలో ఏర్పాటు చేయాలి. విశాఖపట్టణంలో విశ్వవిద్యాలయం ఎట్లాగూ ఉన్నది.

07/28/2016 - 23:50

ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో పారదర్శకత, స్పష్టత లోపిస్తున్నది. ఉద్యోగ నియామక ప్రక్రియలలో ప్రభుత్వ విధానం రానురాను మోసపూరితంగా మారుతోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో ప్రభుత్వం అసలు ఎటువంటి నిబంధనలు, నియమాలు పాటించడం లేదు. ఉద్యోగ నియామక ప్రక్రియలలో చివరకు నోటిఫికేషన్ ప్రక్రియ కనుమరుగవుతున్నదంటే మన ప్రభుత్వాల పనితీరు, చేతగానితనం ఇట్టే అర్ధమవుతుంది.

Pages