S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/29/2016 - 00:05

విజయనగరం (్ఫర్టు), జూలై 28: మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే సమ్మె చేయడం తప్పదని ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు వి.కృష్ణంరాజు హెచ్చరించారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మొండివైఖరి అవలంభిస్తుందని ఆరోపించారు. అదేవిధంగా మున్సిపల్ యంత్రాంగం కూడా తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తుందని విమర్శించారు.

07/29/2016 - 00:04

మక్కువ, జూలై 28: మావోయిస్టుల వారోత్సవాల మధ్య గ్రామ సందర్శన గురువారం నిర్వహించారు. మండలంలోని నంద గ్రామంలో పోలీసు, సిఆర్‌పిఎఫ్ బలగాల బందోబస్తు మధ్య మండల ప్రత్యేకాధికారి ఆర్.మురళీధర్ గ్రామ సందర్శన నిర్వహించారు. మావోయిస్టులు ఈ నెల 28 నుంచి వచ్చేనెల 3వతేదీ వరకు వారోత్సవాలను జరుపుతుండడంతో కొన్ని ఏజెన్సీ మండలాల్లో అధికారులు గ్రామసభలు రద్దుచేశారు.

07/29/2016 - 00:04

విజయనగరం (్ఫర్టు), జూలై 28: ఢిల్లీలో ఆమ్‌ఆద్మీపార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని పార్టీ జిల్లా కన్వీనర్ కె.దయానంద్ ఆరోపించారు. బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షసాధింపు చర్యలకు నిరసనగా కలెక్టరేట్‌లో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద గురువారం ధర్నా చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.

07/29/2016 - 00:04

బొబ్బిలి (రూరల్), జూలై 28: వనం-మనం కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరూ విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ తూముల అచ్యుతవల్లి కోరారు. మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఆమె విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ శుక్రవారం 22వేల మొక్కలు పట్టణంలో నాటేందుకు చర్యలు చేపట్టామన్నారు.

07/29/2016 - 00:03

బొబ్బిలి (రూరల్), జూలై 28: అధికార పార్టీలో నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఈ మేరకు శాసనసభ్యులు సుజయ్‌కృష్ణరంగారావు వర్గం, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జ్ తెంటు లక్ష్ముంనాయుడు వర్గాల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. గత కొంతకాలంగా ఇరువర్గాల నాయకుల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ చాపకింద నీరులా వ్యవహరించినా గురువారం మాత్రం బయటపడ్డాయి.

07/29/2016 - 00:01

ఎల్లారెడ్డిపేట, జూలై 28: గ్రామంలోని ప్రజల అవసరాలను గుర్తించి సమకూర్చడంతో పాటు మార్పు చెందేలా చూడడమే సంసద్ ఆదర్శ గ్రామ్ యోజన ‘సాగీ’ లక్ష్యమని సాగీ డైరెక్టర్ డాక్టర్ కుశాల్ పథక్ అన్నారు. కరీంనగర్ ఎంపి బోయనపల్లి వినోద్‌కుమార్ దత్తత గ్రామమైన ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపల్లిలో మంత్రి కెటిఆర్, ఎంపి వినోద్‌కుమార్, కలెక్టర్ నీతూప్రసాద్‌లతో కలిసి ఆయన గురువారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

07/29/2016 - 00:00

జగిత్యాల, జూలై 28: సిఎం కెసిఆర్ వైఫల్యం వల్లే ఎమ్సెట్-2 లీకేజీ అయ్యిందని, దీనికి పూర్తి నైతిక బాధ్యత సిఎం కెసిఆర్‌దేనని సిఎల్‌పి ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం జగిత్యాల పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది వరకే ఎమ్సెట్-1, ఎమ్సెట్-2 నిర్వహించుకున్నామన్నారు.

07/29/2016 - 00:00

గోదావరిఖని, జూలై 28: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లోకి రోజు రోజుకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో నీటి మట్టం విపరీతంగా పెరిగిపోతూ ముంపు గ్రామాల నిర్వాసిత కుటుంబాలు బిక్కుబిక్కుమంటున్నాయ.

07/28/2016 - 23:59

గంభీరావుపేట, జూలై 28: రాజకీయాలకు అతీతంగా ప్రాధాన్యత క్రమంలో గ్రామాలను అభివృద్ధి పరుస్తున్నట్లు రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. గురువారం మండలంలోని గజసింగవరంలో సహకార సంఘ ఆధ్వర్యంలో రూ. 40 లక్షలతో నిర్మించతలపెట్టిన గోదాం నిర్మాణానికి ఆయన శంకుస్థాపనచేశారు. హరితహారంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.

07/28/2016 - 23:59

గోదావరిఖని, జులై 28: ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమంలో భాగంగా తలపెట్టిన సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికుల పాత్ర చారిత్రాత్మకం. 35 రోజుల పాటు 67,025 మంది సింగరేణి భూమి పుత్రులు విధులను బహిష్కరించి రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగస్వామ్యులు కావడంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రాష్ట్ర ప్రకటన చేసింది.

Pages