S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/27/2016 - 04:53

కంచిలి, జూలై 26: మండలంలో మకరాంపురం గ్రామానికి చెందిన ప్రేమికులు వి.రమేష్, స్రవంతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో రమేష్(30) మృతి చెందాడు. స్రవంతి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, బాధితురాలు స్రవంతి చెప్పిన వివరాలివి. రమేష్, స్రవంతిలు 16 ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. అయితే, పదేళ్ళ కిందట స్రవంతి కుటుంబీకులు ప్రేమ వ్యవహరాన్ని అంగీకరించలేదు. తర్వాత తన మేనమామకు ఇచ్చి పెళ్లి చేశారు.

07/27/2016 - 04:53

శ్రీకాకుళం, జూలై 26: జిల్లాలోని శ్రీకాకుళం, పలాస వంటి ప్రధాన రైల్వేస్టేషన్‌లలో ముఖ్య రైళ్లు అన్నీ నిలుపుదల చేసేలా చర్యలు తీసుకొని ఇక్కడి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు రామ్మోహన్‌నాయుడు రైల్వే శాఖామంత్రి సురేష్‌ప్రభును కోరారు. మంగళవారం రైల్వేమంత్రిని ఎంపి కలిసి జిల్లాలోని రైల్వే ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

07/27/2016 - 04:53

శ్రీకాకుళం(కల్చరల్), జూలై 26: జిల్లాలో గ్రంథాలయ సెస్సుగా కోటి రూపాయలను వసూలు చేయాలనే లక్ష్యంగా నిర్ణయించామని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు పీరుకట్ల విఠల్‌రావు తెలిపారు. మంగళవారం ఆయన అధ్యక్షతన జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ 2016 ఏప్రిల్ 1నాటికి రూ.40లక్షల సెస్సునువసూలు చేశామన్నారు.

07/27/2016 - 04:52

సారవకోట, జూలై 26: ఈనెల 29న నిర్వహించనున్న వనమహోత్సవం కార్యక్రమం విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమాయత్వం కావాలని స్థానిక మండల ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తున్న, జిల్లా పంచాయతీ అధికారి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.

07/27/2016 - 04:51

శ్రీకాకుళం, జూలై 26: కృష్ణా పుష్కరాలు నిర్వహించే సమయంలో విజయవాడలో 12 అంశాలపై సదస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్టమ్రుఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా, మండల స్థాయి వరకు వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పుష్కరాలకు ఏర్పాట్లు పక్కాగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

07/27/2016 - 04:51

నరసన్నపేట, జూలై 26: మండలంలోని చోడవరం గ్రామంలో స్వయంశక్తి మహిళా సంఘాలకు సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు భారీ మొత్తంలో ఉన్నాయని వాటిని వసూలు చేసేందుకు గ్రామంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని డిపి ఎం రామ్మోహనరావు తెలిపారు. మంగళవారం ఈసందర్భంగా గ్రామంలో ఉన్న మహిళాసంఘాల వద్ద నుండి వసూళ్లకు చర్యలు చేపట్టారు.

07/27/2016 - 04:50

ఆమదాలవలస, జూలై 26: మండలంలోగల పొన్నాం, రామచంద్రాపురం, చిట్టివలస, సైలాడ, జొన్నవలస పంచాయతీలకు సుమారు రూ.26కోట్లతో వంశధార సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు విప్ రవికుమార్ తెలిపారు.

07/27/2016 - 04:50

ఎచ్చెర్ల, జూలై 26: వర్షాకాలం కావడం వలన గ్రామాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొనే పరిస్థితులు అధిగమించి సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఎంపిడివో పంచాది రాధ స్పష్టంచేశారు. ఇప్పటికే ఈ సమాచారాన్ని సర్పంచ్‌లు, గ్రామకార్యదర్శులకు తెలియజేశామన్నారు. ఈ మేరకు ఆమె మంగళవారం విలేఖర్లతో మాట్లాడారు.

07/27/2016 - 04:48

అనకాపల్లి, జూలై 26: జిల్లాలోని తుమ్మపాల, గోవాడ, ఏటికొప్పాక, తాండవ ఈ నాలుగు షుగర్ ఫ్యాక్టరీల చెరకు రైతులకు బకాయిలు పడిన 43కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించి వారిని ఆదుకోవాలని మాజీమంత్రి దాడి వీరభద్రరావు డిమాండ్ చేసారు. మంగళవారం స్థానిక వ్యవసాయదారుల సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు ఇవ్వాల్సిన రవాణా సబ్సిడీ, పర్చేజ్‌ట్యాక్స్ బకాయిలను సైతం చెల్లించాలన్నారు.

07/27/2016 - 04:48

కె.కోటపాడు, జూలై 26: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని దశలవారీగా చేపట్టి రాబోయే మూడు నాలుగేళ్లలో పూర్తి చేయాలని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. మంగళవారం సాయంత్రం ఆయన స్థానిక శివాలయంలో కె.కోటపాడు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలతో బహిరంగ సభను నిర్వహించారు. సమితి సభ్యులు పి.వి.జి. కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Pages