S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/25/2016 - 03:00

వెంకటాపురం, జూలై 24: ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్ వెంకటాపురం, చర్ల ప్రధాన రహదారిలో మావోయిస్టులు ఆదివారం తెల్లవారుజామున హల్‌చల్ చేశారు. అర్థరాత్రి రామచంద్రాపురం-మొర్రవానిగూడెం ఇసుక ర్యాంప్ సమీపంలో ప్లాస్టిక్‌బకెట్లలో రహదారికిరువైపులా బాంబులు అమర్చి రోడ్డుకు అడ్డుగా చెట్లకు తాళ్లను కట్టి రాకపోకలను అడ్డుకున్నారు.

07/25/2016 - 03:00

భద్రాచలం, జూలై 24: గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక గోదావరి అంత్యపుష్కరాలను కూడా వైభవంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబు వెల్లడించారు. జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో అంత్యపుష్కరాలను విజయవంతం చేసేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నట్లు ఆయన తన చాంబర్‌లో ఆదివారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ప్రకటించారు.

07/25/2016 - 02:57

తాడేపల్లి, జూలై 24: రాష్ట్ర ఇన్‌చార్జ్ డిజిపి నండూరి సాంబశివరావు ఆదివారం సాయంత్రం సీతానగరం పుష్కరఘాట్‌లు పరిశీలించారు. తొలుత ముఖ్యమంత్రి నివాస గృహంలో సిఎంను కలుసుకున్న ఆయన అనంతరం పుష్కరఘాట్లు పరిశీలించారు. ఆయన ప్రకాశం బ్యారేజ్ నుండి ఘాట్ వరకూ నడుస్తూ పరిసరాలు పరిశీలించారు.

07/25/2016 - 02:56

గుంటూరు (కొత్తపేట), జూలై 24: తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పునాధులని, నాయకులు, కార్యకర్తల మనోభావాలను గౌరవించి పనిచేయాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఆదివారం బృందావనగార్డెన్స్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలో రేపల్లె, వినుకొండ, పొన్నూరు, గుంటూరు ఈస్ట్ అండ్ వెస్ట్ నియోజకవర్గాల సమక్షా సమావేశాన్ని నిర్వహించారు.

07/25/2016 - 02:55

గుంటూరు, జూలై 24: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవానికి కసరత్తు ప్రారంభించింది. ప్రత్యేకహోదా, రైల్వేజోన్, ఇతర విభజన చట్టం అంశాల అమలుతో పాటు జిల్లాల వారీగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. గ్రామస్థాయిలో కమిటీల ఏర్పాటు, పార్టీ సమీక్షా సమావేశాలు తరచూ నిర్వహించడం ద్వారా తిరిగి కోలుకునేందుకు సన్నాహాలు చేస్తోంది.

07/25/2016 - 02:54

అమరావతి, జూలై 24: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతి అమరేశ్వర స్వామి దేవస్థానం కృష్ణా పుష్కరాలకు ముస్తాబవుతోంది.

07/25/2016 - 02:54

అమరావతి, జూలై 24: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం, చరిత్ర ప్రసిద్ధి గాంచిన అమరావతిలో పవిత్ర కృష్ణా నదికి ఆగస్టు 12 నుండి 23వ తేదీ వరకు జరిగే కృష్ణా పుష్కరాల సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్‌చార్జి డిజిపి నండూరి సాంబశివరావు తెలిపారు.

07/25/2016 - 02:53

పొన్నూరు, జూలై 24: నిడుబ్రోలు పిబిఎన్ కళాశాల సమీపాన ఆదివారం సాయంత్రం రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుఢీకొని ఓ మహిళాకూలీ మృతిచెందింది. మండల పరిధిలోని ఆలూరు గ్రామానికి చెందిన రావూరి నాగేంద్రం (45)గా స్థానికులు గుర్తించారు. మృతురాలికి భర్త, కుమారుడు ఉన్నారు. పొలం పని ముగించుకుని రైల్వేట్రాక్ మీదుగా ఆలూరుకు వెళ్తుండగా రైలు ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు.

07/25/2016 - 02:53

గుంటూరు (కొత్తపేట), జూలై 24: గుర్రం జాషువా సమాజంలోని అంటరానితనం మీద ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిన మహాకవి అని, నేటితరానికి ఆయన ఆదర్శప్రాయుడని తెలుగుదేశం పార్టీ నాయకులు కొనియాడారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో జాషువ వర్ధంతి కార్యక్రమం జివి ఆంజనేయులు అధ్యక్షతన జరిగింది.

07/25/2016 - 02:52

విజయపురిసౌత్, జూలై 24: మాచర్ల, గురజాల నియోజక వర్గాల్లో రూ.150 కోట్లతో పుష్కర పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని గురజాల ఎమ్మెల్యే యరపతనేని శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం నాగార్జునసాగర్‌లోని అంతర్భాగమైన విజయపురిసౌత్‌లోని కృష్ణా నది తీరాన ఏర్పాటు చేస్తున్న పుష్కరఘాట్లు, రహదారి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.

Pages