S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 15:51

ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా కి చెందిన 8 కార్లను వేలం వేయడానికి సిద్ధమైంది. మాల్యా, ఆయన కంపెనీకి చెందిన కార్లను వేలం వేస్తున్నట్లు ఎస్‌బీఐ కాప్‌ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్‌ ప్రకటించింది. ఇటీవల మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్‌ హౌస్‌, ఇతర ఆస్తులు వేలం వేయగా కొనడానికి ఒక్కరు కూడా ముందుకు రాని సంగతి తెలిసిందే.

07/23/2016 - 15:18

మెదక్: గత ఏడాది నాటిన మొక్కలు ఎక్కడ ఉన్నాయంటూ మంత్రి హరీష్‌రావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుల్కల్ మండలం సింగూరు జలాశయం ఇన్‌టేక్ వెల్ పనులను ఆయన శనివారం పరిశీలించారు. పంప్‌హౌస్ వద్ద మొక్కలు నాటారు. గత ఏడాది ఇక్కడ నాటిన మొక్కలు ఏమై పోయాయని ఆయన ప్రశ్నించగా అధికారులు నీళ్లు నమిలారు. అధికారుల తీరు సరిగా లేదని మంత్రి ఆగ్రహం ప్రకటించారు.

07/23/2016 - 15:17

నల్గొండ: తరగతులకు గైర్హాజరై సినిమాకు వెళ్లిన ఓ విద్యార్థిపై ఉపాధ్యాయుడు విచక్షణారహితంగా చేయి చేసుకున్నాడు. ఈ ఘటన తుర్కపల్లి ఆదర్శ పాఠశాలలో శనివారం జరిగింది. ఉపాధ్యాయుడి దాడిలో గాయపడిన విద్యార్థి భానును ఆసుపత్రిలో చేర్పించారు. అమానుషంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఆ విద్యార్థి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

07/23/2016 - 15:17

శ్రీనగర్: శాంతి భద్రతల సమస్యతో సతమతమవుతున్న జమ్ము-కాశ్మీర్‌లో తాజా పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం ఉదయం ఇక్కడికి చేరుకున్నారు. భద్రతకు సంబంధించి ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన అధికారులతో మాట్లాడతారు. రెండు రోజుల పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, గవర్నర్ నరేంద్రనాథ్ ఒహ్రాలతో ఆయన భేటీ అవుతారు.

07/23/2016 - 15:16

రాయ్‌పూర్: భద్రతాదళాలకు, మావోయిస్టులకు మధ్య శనివారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోలు మరణించారు. చత్తీస్‌గఢ్‌లోని కుంట ఫారెస్టు ఏరియాలో ఈ ఘటన జరిగింది. సంఘటన ప్రాంతంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

07/23/2016 - 15:16

విశాఖ: నగరంలోని ఎండాడ వద్ద జాతీయ రహదారిపై శనివారం ఆర్టీసీ, బస్సు, జీపు ఢీకొన్న సంఘటన తల్లి, కుమార్తెలను బలితీసుకుంది. ఈ వాహనాల మధ్య తల్లీకూతుళ్లు వెళుతున్న బైక్ నుజ్జునుజ్జయ్యింది. దీంతో ఆ ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

07/23/2016 - 14:36

శ్రీనగర్‌: కశ్మీర్‌ లోయలో పరిస్థితి కాస్త కుదుటపడడంతో శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో, నాలుగు జిల్లాల్లో అధికారులు కర్ఫ్యూ తీసివేశారు. బందీపొరా, బారాముల్లా, బుద్గాం, గందేర్‌బల్‌ జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తేసినట్లు పోలీసులు తెలిపారు. ఎక్కువ మంది ఒక్కచోట గుమిగూడొద్దంటూ నిషేధాజ్ఞలు జారీ చేశారు. ముందుజాగ్రత్త చర్యగా

07/23/2016 - 14:24

హైదరాబాద్‌: ఐసిస్‌ కుట్రకేసులో నిందితుడు అతవుల్లా రెహమాన్‌ను శనివారం పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. కస్టడీ ముగియడంతో పోలీసులు అతన్ని నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఈ నెల 26 వరకు రిమాండ్‌కు తరలించాలని కోర్టు ఆదేశించింది.

07/23/2016 - 13:59

బీజింగ్‌: వర్షాల కారణంగా చైనాలో 78మంది మృతి చెందగా, 91మంది ఆచూకీ తెలియడం లేదు. దాదాపు నాలుగు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొండ చరియలు విరిగిపడి, ఇళ్లు ధ్వంసమవుతున్నాయి. అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేసి ఉంటే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేవారమని బాధితులు అంటున్నారు.

07/23/2016 - 13:54

విశాఖ: డిజిటల్‌ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా 100 మీసేవా కేంద్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ప్రారంభించారు. రూ.8.30కోట్ల వ్యయంతో వుడా అభివృద్ధి చేసిన బహుళ అంతస్థుల భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.

Pages