S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 13:51

దిల్లీ: జర్మనీలోని మ్యూనిక్‌ నగరం మాల్‌లో కాల్పుల ఘటన మృతుల్లో భారతీయులెవరూ లేరని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ ట్వీట్‌ చేశారు. ఓ మాల్‌లోని రెస్టారెంట్‌లో దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 9 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాల్పులకు పాల్పడిన 18ఏళ్ల దుండగుడు కూడా తర్వాత తనను తాను కాల్చుకుని మృతిచెందాడు.

07/23/2016 - 12:35

చిత్తూరు: ప్రేమ వ్యవహారం తెలిసి తల్లి మందలించిందని తీవ్ర మనస్తాపానికి లోనైన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం జరిగింది. వెదురుకుప్పం మండలం గొడుగుచింతలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని గాయత్రి కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. ఈ విషయం తెలియడంతో ఆమెను తల్లి మందలించింది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గాయత్రి తన వొంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది.

07/23/2016 - 12:34

హైదరాబాద్: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంజూరు చేయిస్తామని నగరంలో పలువురిని మోసగించిన నలుగురు మాయగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరు దాదాపు 30 లక్షల రూపాయలను వసూలు చేసి కొంతమందిని వంచించారు.

07/23/2016 - 12:34

విశాఖ: తమిళనాడులో అదృశ్యమైన వైమానికదళ విమానంలో ప్రయాణిస్తూ ఆచూకీ లేకుండా పోయిన విశాఖ వాసుల కుటుంబాలను ఎపి సిఎం చంద్రబాబు శనివారం ఇక్కడ పరామర్శించారు. అదృశ్యమైన విమానంలో విశాఖ ప్రాంతానికి చెందినవారు 8 మంది ఉన్నారు. బాజీ జంక్షన్‌, బుచ్చిరాజుపాలెంలోని ఎన్‌ఏడీ ఉద్యోగుల కుటుంబాలను పరామర్శించి బాధితులకు ధైర్యం చెప్పారు. చిన్నారావు, నాగేందర్‌రావు కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించారు.

07/23/2016 - 12:08

హైదరబాద్: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శనివారం ఉదయం ఇక్కడి ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో తెలంగాణ ప్రాంత నాయకులతో భేటీ అయ్యారు. వివిధ అంశాలపై ఏర్పాటైన పది కమిటీల పనితీరు, సంస్థాగత వ్యవహారాలను ఆయన సమీక్షిస్తున్నారు.

07/23/2016 - 12:07

విజయవాడ: ఆధునిక టెక్నాలజీ సాయంతో నేరాలను నియంత్రించి శాంతి భద్రతలను కాపాడతామని ఎపి డిజిపిగా బాధ్యతలు చేపట్టిన నండూరి సాంబశివరావు శనివారం తెలిపారు. పదవీ విరమణ చేస్తున్న డిజిపి జెవి రాముడు నుంచి ఆయన బాధ్యతలు చేపట్టారు. తనను డిజిపిగా ఎంపిక చేసినందుకు సిఎం చంద్రబాబుకు నండూరి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు శాఖలో నిత్యం ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ రాష్ట్రానికి సేవలందిస్తానని ఆయన చెప్పారు.

07/23/2016 - 12:07

చెన్నై: చెన్నై నగరంలోని తాంబరం నుంచి శుక్రవారం ఉదయం బయలుదేరి కొద్దిసేపటికే అదృశ్యమైన వైమానిక దళానికి చెందిన విమానం కోసం రెండోరోజు శనివారం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నిన్న ఉదయం 8:30 గంటలకు తమిళనాడులోని తాంబరం నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన 16 నిమిషాలకే కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే.

07/23/2016 - 12:04

విజయవాడ: ఎపి డిజిపి జెవి రాముడు శుక్రవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఇక్కడి పరేడ్ గ్రౌండ్స్‌లో పోలీసులు ఘనంగా వీడ్కోలు పలికారు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రకు తొలి డిజిపిగా గత రెండున్నరేళ్ల కాలంలో రాముడు విశేష సేవలందించారని పలువురు పోలీసు అధికారులు గుర్తు చేశారు. నూతన డిజిపిగా ఆర్టీసీ ఎండి నండూరి సాంబశివరావు బాధ్యతలు చేపట్టారు.

07/23/2016 - 11:52

శ్రీశైలం: జూరాల నుంచి శుక్రవారం ఏడు గేట్లు ఎత్తి 69,540 క్యూసెక్కుల నీటిని దిగువ శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి ఈ ఏడాది ఆలస్యంగానైనా ఇన్‌ఫ్లో మొదలయింది. ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల ఆనకట్టల వద్ద నీటిమట్టం గరిష్ఠస్థాయి చేయడంతో ఆయా జలాశయాలకున్న ప్రవాహాలను బట్టి దిగువకు వరదనీటిని వదులుతున్నారు.

07/23/2016 - 11:37

హైదరాబాద్‌: నగరంలోని పంజాగుట్ట వద్ద శనివారం ఉదయం ద్విచక్ర వాహనాన్ని ఢీకొని టిప్పర్‌ లారీ ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడింది. వంతెన కింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Pages