S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 17:38

వరంగల్‌: మామ్నూరులో పశువైద్య కళాశాల ఏర్పాటుకు, 87 మంది బోధనా సిబ్బంది, 205 మంది బోధనేతర సిబ్బందిని మంజూరుకు ప్రభుత్వం శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

07/23/2016 - 17:27

ముజఫర్‌నగర్‌ (ఉత్తరప్రదేశ్‌ ) : ముజఫర్‌నగర్‌లో చందెలమల్‌ గ్రామంలో టీనేజి బాలిక ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉండటం చూసి ఆగ్రహంతో కుటుంబ సభ్యులు ఆ ఇద్దరినీ గొంతునులిమి చంపేశారు. బాలిక తండ్రి ముఖేష్‌, సోదరుడు దీపక్‌లను పోలీసులు విచారించగా కుటుంబం పరువు తీసినందుకు తామే వారిని చంపినట్లు నిందితులు అంగీకరించారు.

07/23/2016 - 16:50

వరంగల్: వైద్యుడి అవతారంలో ఓ నర్సు గర్భిణికి కాన్పు చేయగా శిశువు మరణించిన ఘటన వరంగల్ జిల్లా పరకాల ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం జరిగింది. ఈ ఆస్పత్రిలో వైద్యుడు స్థానికంగా లేకపోవడంతో గర్భిణికి నర్సు కాన్పు చేయించింది. ప్రసవం అనంతరం శిశువు మరణించడంతో గర్భిణి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. డాక్టర్లు అందుబాటులో లేనందునే ఈ ఘటన జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

07/23/2016 - 16:49

అనంతపురం: ముదిగుబ్బ మండలం సంకేపల్లి వద్ద శుక్రవారం రాత్రి రెండు గంటల సమయంలో జీపును ఓ లారీ ఢీకొనడంతో అయిదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఆరుగురిని ఆస్పత్రిలో చేర్పించగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కర్నాటకలోని నళమంగళకు చెందిన 11 మంది తిరుమల వెళ్లేందుకు జీపులో బయలుదేరారు. ముంబయి-చెన్నై రహదారిపై వీరు ప్రయాణిస్తున్న జీపును టమాటాల లోడుతో వెళుతున్న లారీ ఢీకొంది.

07/23/2016 - 16:48

జబల్పూర్: మధ్యప్రదేశ్‌లోని కెహ్రి గ్రామంలో శుక్రవారం బోరుబావిలో పడిన రెండేళ్ల బాలుడు మరణించాడు. బాలుడిని రక్షించేందుకు బిఎస్‌ఎఫ్ సిబ్బంది బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వి సుమారు 15 గంటల సేపు శ్రమించారు. శనివారం మధ్యాహ్నం బాలుడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

07/23/2016 - 16:48

కరీంనగర్: కరీంనగర్ జిల్లా రాయపట్నం వద్ద శనివారం గోదావరి నదిలో నీటిమట్టం పెరిగింది. పాతవంతెనను తాకుతూ వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వంతెనపై రాకపోకలను అధికారులు పూర్తి స్థాయిలో తాత్కాలికంగా నిషేధం విధించారు.

07/23/2016 - 16:47

హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు అనుమానితులను శనివారం నాడు ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేసి పోలీసులకు అప్పగించారు. వీరు నగరంలోని టోలీచౌకీ ప్రాంతానికి చెందినవారని, పూర్తి వివరాలను ఆరా తీస్తున్నామని పోలీసులు చెప్పారు.

07/23/2016 - 16:45

దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 31న దిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద రియో పరుగును ప్రారంభిస్తారని కేంద్ర క్రీడలశాఖ మంత్రి విజయ్‌ గోయల్‌ తెలిపారు. బ్రెజిల్‌ రాజధాని రియో డి జెనీరోలో ఆగస్టు 5న ఆరంభం కానున్న ఒలింపిక్‌ గేమ్స్‌పై భారత్‌లో అవగాహన తీసుకురావడంలో భాగంగా ‘రియో పరుగు’ను నిర్వహించనున్నారు.

07/23/2016 - 16:41

దిల్లీ: బులియన్‌ మార్కెట్లో శనివారం పది గ్రాముల పసిడి రూ.20 తగ్గి రూ.30,750కి చేరింది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కేజీ వెండి ధర రూ.75 తగ్గి రూ.46,125కు చేరింది. న్యూయార్క్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,322.10 అమెరికా డాలర్లు ఉండగా ఔన్సు వెండి ధర 19.59 డాలర్లు ఉంది.

07/23/2016 - 16:39

దిల్లీ: అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన చిత్రకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత హైదర్‌ రజా (94) దిల్లీలో మృతి చెందారు. వృద్ధాప్య సమస్యలతో రెండు నెలలుగా ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం కన్నుమూసినట్లు, మధ్యప్రదేశ్‌లోని మండాలాలో అంత్యక్రియలు జరిపించనున్నట్లు ఆయన ఆప్తమిత్రడైన అశోక్‌ చెప్పారు.

Pages