S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/17/2017 - 04:05

విజయవాడ, డిసెంబర్ 16: డీజీపీ నియామకాన్ని రాష్ట్ర పరిధిలోకి తీసుకొచ్చేందుకు వీలుగా పోలీస్ యాక్టు-2014కు సవరణ చేస్తూ ఆర్డినెన్స్ జారీచేసేందుకు రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. శాసనసభ నిర్మాణానికి సంబంధించి టవర్ ఆకృతి (స్పైక్ మోడల్)కు మొగ్గుచూపింది. ఈనెల 27న రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌చే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది.

12/16/2017 - 03:34

నరసాపురం, డిసెంబర్ 15: హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రఖ్యాత దర్శకుడు, కళాతపస్వి కె విశ్వనాథ్ వంటి మహనీయులను ఆహ్వానించకపోవడం తెలుగుజాతికే అగౌరవమని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన బాపు జయంతి వేడుకలు ముగింపు సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

12/16/2017 - 03:32

మంగళగిరి, డిసెంబర్ 15: రాష్ట్రంలో దళితులకు టీడీపీ హయాంలోనే జరిగిందని, దళితుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముందడుగు కార్యక్రమాన్ని ప్రారంభించామని, వచ్చే జనవరి 26 నుంచి అంబేద్కర్ స్పూర్తితో పల్లెబాట పేరుతో గ్రామాల్లో పర్యటిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు.

12/16/2017 - 03:31

విశాఖపట్నం, డిసెంబర్ 15: విద్యా బోధనలో అంతర్జాతీయ ప్రమాణాలే లక్ష్యంగా యునెస్కో, మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ పీస్ అండ్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ (ఎంజీఐఈపీ) సంయుక్తంగా విశాఖలో శనివారం నుంచి మూడు రోజుల పాటు టెక్ సదస్సు నిర్వహిస్తున్నారు.

12/16/2017 - 03:29

విశాఖపట్నం, డిసెంబర్ 15: పర్యావరణ హిత ప్రజా రవాణను మెరుగు పరచాలన్న లక్ష్యంతో అందుబాటులోకి తీసుకురావాలని భావించిన ఈ- రిక్షా, ఈ-కార్ట్‌లు నేడు ఎక్కడా కన్పించని పరిస్థితి. దీనికి సంబంధించి ఈ ఏడాది మార్చిలోనే జీఓ విడుదల చేసినప్పటికీ విధివిధానాలు ఖరారు కాకపోవడంతో పర్యావరణ హిత రవాణా వాహనాలు రోడ్డెక్కలేని దుస్థితి నెలకొంది.

12/16/2017 - 03:28

సీలేరు, డిసెంబర్ 15: ఏవోబీలో బీఎస్‌ఎఫ్ జవాన్లకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. మృతి చెందిన మావోయిస్టు వద్ద లభించిన ఆయుధాలు, కిట్ బ్యాగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు మృతదేహాన్ని గుర్తించేందుకు మల్కన్‌గిరి జిల్లా పోలీసులు తమ కార్యాలయానికి తరలించారు.

12/16/2017 - 03:28

శ్రీకాకుళం, డిసెంబర్ 15: సమాజంలో ఆర్థిక నేరాలు, సామాజిక రుగ్మతలపై అవగాహన కల్పించేందుకు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ సైకిల్ ర్యాలీని నిర్వహించడానికి రాష్ట్ర స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఏపిఎస్‌పిఎఫ్) సన్నాహాలు చేస్తోందని ఏపిఎస్పీఎఫ్ విశాఖపట్నం యూనిట్ ఇన్‌ఛార్జి, డీఎస్పీ జి.లక్ష్మీనారాయణ తెలిపారు. శుక్రవారం జిల్లా ఉన్నతాధికారులను ఆయన కలిసి తమ ప్రణాళికలను వివరించారు.

12/16/2017 - 03:27

విజయవాడ, డిసెంబర్ 15: బాధ్యతాయుతమైన ప్రతిపక్షనేత స్థానంలో ఉండి కూడా వైఎస్ జగన్ మతిలేని మాటలు మాట్లాడుతున్నారంటూ రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి జవహర్ ధ్వజమెత్తారు. శుక్రవారం విజయవాడలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను చేసిన దుర్మార్గాలను నేడు అనునిత్యం కోర్టు మెట్లు ఎక్కుతూ కూడా ఎటూ వాస్తవాలు చెప్పడం లేదు.. కనీసం తన మీడియాలో కూడా వాస్తవాలు రాయడం కాని, ప్రసారం కాని చేయడం లేదన్నారు.

12/16/2017 - 03:27

గిద్దలూరు, డిసెంబర్ 15: ఐపిఎస్‌ను అంటూ నకిలీ గుర్తింపు కార్డులతో ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో చెలామణి అవుతున్న యువకుడిని గిద్దలూరు సిఐ శ్రీరాం, ఎస్సై మల్లికార్జున్ అరెస్టు చేశారు. శుక్రవారం పాత్రికేయుల సమావేశంలో నకిలీ ఐపిఎస్‌ను చూపించారు.

12/16/2017 - 03:08

కర్నూలు, డిసెంబర్ 15: గుప్తనిధుల వేటకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లిలోని పురాతన కోటలో పెద్ద మొత్తంలో గుప్తనిధులు ఉన్నట్లు కొంతమంది ఇచ్చిన నివేదిక మేరకు తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా గత మూడు రోజులుగా కోటలో అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు.

Pages