S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/31/2017 - 02:11

గుంటూరు, జూలై 30: వ్యవసాయ, సీడ్ టెక్నాలజీలో డిప్లమో కోర్సులను అభ్యసించి బిఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన అగ్రిసెట్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. బాపట్ల, తిరుపతి, శ్రీకాకుళం జిల్లా వైరాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

07/31/2017 - 02:10

ఒంగోలు, జూలై 30: ఒంగోలు-గొట్లగట్టు మధ్య నాలుగులేన్ల రహదారి మంజూరైందని ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. సుబ్బారెడ్డిని నేషనల్ హైవేస్ ప్రాజెక్టు డైరక్టర్ ఎ వెంకటేశ్వరరావు, వాక్స్ కన్సల్‌టెన్సీ టీమ్ హెడ్ త్యాగరాజన్, నేషనల్ హైవేస్ ఎఇ శ్రీనివాసులు ఆదివారం ఆయనను కలిశారు.

07/31/2017 - 02:08

విశాఖపట్నం, జూలై 30: నాకెంతో ప్రియమైన బిజెపి సీనియర్ నేత అద్వానీని కాదని గుజరాత్ ముఖ్యమంత్రిగా సంస్కరణలకు శ్రీకారం చుట్టిన నరేంద్ర మోదీకి ప్రధాని అభ్యర్థిగా మద్దతిచ్చానని బిజెపి తరపున ఉప రాష్టప్రతి అభ్యర్థి ఎం.వెంకయ్యనాయుడు తన మనసులో మాటను బయటపెట్టారు.

07/31/2017 - 00:51

అమరావతి, జూలై 30: మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పడుతున్న కష్టం అధికారుల అత్యుత్సాహంతో వృథా అవుతోందా? బాబు చేస్తున్న సమీక్షలతో ఫలితాలు రావడం లేదా? పొలిటికల్ మేనేజ్‌మెంట్ లేకపోవడమే సమస్యలకు కారణమా? అధికారులను అందలమెక్కిస్తున్న సీఎం విధానాలే పార్టీ, ప్రభుత్వాన్ని ప్రజలకు దూరం చేస్తున్నాయా?

07/31/2017 - 00:50

గుంటూరు, జూలై 30: రాష్ట్రంలో అశాంతి రేపేందుకు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఒక్కో వర్గాన్ని రెచ్చగొడుతోందని ఎమ్మెల్సీ, టిడిపి అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు. ఆదివారం ఇక్కడ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా నిలిచి పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచిందని గుర్తుచేశారు.

07/31/2017 - 00:50

విజయవాడ, జూలై 30: ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఫండమెంటల్, సర్వీసు నిబంధనల సవరణ ముసాయిదా వ్యవహారం గందరగోళంగా మారింది. సర్వీసు రూల్స్‌ను సవరిస్తూ ముసాయిదా ఉత్తర్వులు సిద్ధం చేశారని జరుగుతున్న ప్రచారంపై స్పష్టత కొరవడింది. ఇలాంటి ఉత్తర్వులే జారీ చేయలేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేయడం గమనార్హం.

07/31/2017 - 00:49

విజయవాడ, జూలై 30: భారత వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలు అత్యవసర పరిస్థితుల్లో ల్యాండింగ్‌కు వీలుగా కొన్ని జాతీయ రహదారులను అభివృద్ధి చేయనున్నారు. విమానం దిగేందుకు వీలుగా రహదారిలో కొంతభాగాన్ని ఎయిర్ స్ట్రిప్‌గా అభివృద్ధి చేస్తారు. సహాయక చర్యలు, తదితర అత్యవసర పరిస్థితుల్లో యుద్ధ విమానాలు దిగేందుకు వీలుగా 24 జాతీయ రహదారులను భారత వాయుసేన ఎంపిక చేసింది.

07/30/2017 - 06:13

కాకినాడ, జూలై 29: మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం గృహ నిర్బంధం శనివారంతో నాలుగో రోజుకు చేరింది. ఆగస్టు 2వ తేదీ వరకు ముద్రగడకు గృహ నిర్బంధాన్ని విధిస్తూ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం విధితమే! దీంతో భారీ ఎత్తున కిర్లంపూడిలో సాయుధ బలగాలను మోహరించడంతో ముద్రగడ ఇంటికే పరిమితమయ్యారు. అయితే బందోబస్తును సడలించిన వెంటనే పాదయాత్ర చేపట్టే యోచనలో ముద్రగడ ఉన్నారు.

07/30/2017 - 06:11

టంగుటూరు,జూలై 29:ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని ఎం నిడమనూరు గ్రామంలో శుక్రవారం రాత్రి పిడుగుపడటంతో ముగ్గురు గొర్రెల కాపరులు మృతిచెందారు.

07/30/2017 - 06:11

కాకినాడ, జూలై 29: యాభై సంవత్సరాలు నిండిన ప్రభుత్వ ఉద్యోగులు పనితీరులో వెనుకబడితే విధుల తొలగిస్తామని జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఉద్యోగులు నమ్మవద్దని, ఇది కేవలం ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ కుట్రలో భాగమేనని రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో తమ ప్రభుత్వం తొలి నుండి చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పారు.

Pages