S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/01/2017 - 02:40

కాకినాడ, జూలై 31: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం గృహ నిర్బంధం సోమవారం ఆరవ రోజుకు చేరింది. ముద్రగడకు విధించిన గృహనిర్బంధం గడువు ఆగస్టు 2వ తేదీతో ముగియనుంది. అయితే నిర్బంధాన్ని పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలను కిర్లంపూడిలో మరికొన్ని రోజుల పాటు కొనసాగించేందుకు నిర్ణయించినట్టు సమాచారం!

08/01/2017 - 02:38

విశాఖపట్నం, జూలై 31: ‘ఒక ఎమ్మెల్యేగా ఉన్న నాపై ఎటువంటి విచారణ జరపకుండా, కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా, భూ కబ్జా, రికార్డుల టాంపరింగ్ ఆరోపణలపై సిట్ కేసు నమోదు చేసిందంటే, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి?’ అని అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ ప్రశ్నించారు.

08/01/2017 - 02:36

విజయవాడ, జూలై 31: రాష్టవ్య్రాప్తంగా మొత్తం 299 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మంగళవారం నుంచి పెరిగిన బుక్ వాల్యూతో పాటు, పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా అమల్లోకి రాబోతున్నాయి. మొత్తంపై ప్రస్తుతం ఉన్న విలువలపై 10 శాతం పెరగ్గా, మార్కెట్ విలువ కంటే బాగా తక్కువ ఉన్న కొన్ని ప్రాంతాల్లో 25 శాతం వరకు పెరిగింది.

08/01/2017 - 01:47

తిరుపతి, జూలై 31: స్వచ్చ్భారత్‌లో భాగంగా తిరుమలలో చేపడుతున్న కార్యక్రమాలకు సహకారం అందించేందుకు ఓఎన్‌జిసి తమ సామాజిక బాధ్యతగా సోమవారం రూ.6.78 కోట్ల చెక్కును టిటిడి ఇఓ అనిల్‌కుమార్ సింఘాల్‌కు అందించింది.

08/01/2017 - 01:45

గుంటూరు, జూలై 31: కాషారుూకరణ ముసుగులో ఆర్థిక, భూ, డ్రగ్స్ మాఫియా తయారైందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మాఫియాకు గుజరాత్ కేంద్రంగా మారిందని ఆరోపించారు. విద్య, వైద్యం, ఉపాధి హక్కుల సాధనకై ఎఐఎస్‌ఎఫ్, ఎఐవైఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో కన్యాకుమారి నుండి చేపట్టిన లాంగ్‌మార్చ్ బస్సుయాత్ర సోమవారం గుంటూరు నగరానికి చేరుకుంది.

08/01/2017 - 01:43

తిరుపతి, జూలై 31: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 3 నుంచి పవిత్రోత్సవాలను టిటిడి వైభవంగా నిర్వహించనుంది. బుధవారం అంకురార్పణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో భక్తుల వల్లగానీ, సిబ్బంది వల్లగాని తెలిసి, తెలియక జరిగే దోషాలవల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు.

08/01/2017 - 01:43

న్యూఢిల్లీ, జూలై 31: పశ్చిమ గోదావరి జిల్లాలోని తుందుర్రులో మెగా ఆక్వాఫుడ్ పార్క్ ఎర్పాటుకు సంబంధించిన పర్యావరణ అనుమతులు కేంద్ర పరిధిలో లేవని కేంద్ర అడవులు, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్థన్ తెలిపారు.

08/01/2017 - 01:42

అమరావతి, జూలై 31: పోలవరం ప్రాజెక్టు పనులపై ఇకనుంచి అధికారుల సమీక్షలు నిర్వహించి, పురోగతిని ప్రతి వారం తనకు వివరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సమీక్షలు మీరు నిర్వహిస్తే అవసరమయ్యే పరిష్కారాలను తాను సూచిస్తూ మార్గదర్శకత్వం చేస్తానని అన్నారు. ఫలితాలు సాధించేలా సమీక్షలు జరగాలనేది తన ఉద్దేశమని చెప్పారు.

07/31/2017 - 03:31

కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తదితర కులాల మనుగడ కోసం, తన జాతిలో ఉన్న అణగారిన ప్రజల కోసం రాజీలేని రీతిలో పోరాటాన్ని సాగిస్తానని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసే తత్వం కలిగిన తాను జీవితమంతా బడుగు, బలహీన వర్గాలు, దళిత, గిరిజనుల అభ్యున్నతి కోసమే పాటుపడ్డానన్నారు.

07/31/2017 - 03:29

సింహాచలం, జూలై 30: నంద్యాలలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో విజయం సాధించి 2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపునకు నాంది పలకాలని రాష్ట్ర సహకార, మత్స్య శాఖామంత్రి ఆదినారాయణరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సింహాచలంలో ఆదివారం జరిగిన అడివివరం సహకార పరపతి సంఘం నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Pages