S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/31/2017 - 03:12

దర్శి,జూలై 30: నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన ఆదివారం ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని తూర్పువెంకటాపురం గ్రామంలో చోటుచేసుకుంది. వీరపనేని చంద్రశేఖర్ (13), వేగినేటి నారాయణస్వామి (14) ఆదివారం కావటంతో మరో బాలుడితో కలిసి తమపొలాల్లోని నీటికుంటలో గొర్రెలను కడిగేందుకు వెళ్లారు. గొర్రెలను కడుక్కున్న తర్వాత ఈతకొట్టాలని సరదాగా నీటి కుంటలో దిగారు.

07/31/2017 - 03:11

భీమవరం, జూలై 30: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గృహనిర్బంధాన్ని నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా కాపునాడు అధ్యక్షుడు చినమిల్లి వెంకట్రాయుడు చేస్తున్న అమరణ నిరాహార దీక్షను ఆదివారం ఉదయం పోలీసులు భగ్నం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని రాయలం గ్రామంలోని తన స్వగృహంలో చినమిల్లి ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సంగతి విదితమే.

07/31/2017 - 03:09

కాకినాడ, జూలై 30: మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం గృహ నిర్బంధం ఆదివారం ఐదవ రోజుకు చేరింది. ఆగస్టు 2వ తేదీ వరకు ముద్రగడకు గృహ నిర్బంధాన్ని విధిస్తూ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. ముద్రగడ ఇంటి బయట నిషేధాజ్ఞలు అమలులో ఉండగా, మరోవైపు ఆదివారం ఉదయం వివిధ ప్రాంతాలకు చెందిన కాపు నేతలు ఆయన నివాసానికి చేరుకున్నారు.

07/31/2017 - 03:07

విశాఖపట్నం, జూలై 30: శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధి విజృంభించింది. దీని నివారణకు ఇప్పటికైనా చర్యలు తీసుకోకుంటే, మరింతమంది ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని ఈ సమస్యపై అధ్యయనం చేసిన నిపుణుల బృందం స్పష్టం చేసింది. రెండు దశాబ్దాలుగా కిడ్నీ వ్యాధి ఉద్దానాన్ని వణికిస్తోంది. వందల సంఖ్యలో ప్రాణాలను బలిగొంది.

07/31/2017 - 02:17

విశాఖపట్నం, జూలై 30: రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ఏపి సెట్ పరీక్షకు 75.17 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్టు ఏపి సెట్ మెంబర్ సెక్రటరీ కె.శ్రీనివాసరావు తెలిపారు. 67 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని చెప్పారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నా పత్రాన్ని ఎయు విసి నాగేశ్వరరావు ఆదివారం ఉదయం విడుదల చేశారు. 31 సబ్జెక్ట్‌ల్లో ఈ పరీక్ష నిర్వహించినట్టు శ్రీనివాసరావు పేర్కొన్నారు.

07/31/2017 - 02:15

తుని, జూలై 30: రాష్ట్రంలో అన్ని వర్గాలవారిని అయోమయానికి గురిచేసే విధంగా వైసిపి అనుకూల మీడియా ప్రయత్నిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా ఆదివారం తునిలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల వయోఃపరిమితిపై తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు.

07/31/2017 - 02:15

తిరుపతి, జూలై 30: ఏడాది వయసు కలిగిన ఓ చిన్నారిని తిరుమలలోని డిఎన్‌బి షెడ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. ఆ చిన్నారి ఏడుపులు విని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో టూటౌన్ ఇన్స్‌పెక్టర్ కె.వెంకటరవి తన సిబ్బందితో అక్కడికి చేరుకుని బాబు చెంత తిరుమల బాలాజి అనే పసుపురంగు బ్యాగు ఉండటాన్ని గుర్తించారు.

07/31/2017 - 02:13

న్యూఢిల్లీ, జూలై 30: కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభానికి మద్దతుగా ఢిల్లీలోని ఆంధ్రాభవన్ వద్ద ఢిల్లీ కాపు సంక్షేమ సంఘం నిరసన చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తున్న కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడను గృహనిర్భంధం చేయడం పట్ల సంఘం మండిపడింది.

07/31/2017 - 02:12

రాజమహేంద్రవరం, జూలై 30: నిర్దేశిత లక్ష్యం మేరకు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పూర్తి చేయడానికి మల్లగుల్లాలు పడుతున్న అధికార యంత్రాంగం, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారానైనా నీరివ్వడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. ఆగస్టు 15 నుంచి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించడంతో అందుకు అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటున్నారు.

07/31/2017 - 02:11

విశాఖపట్నం (క్రైం), జూలై 30: గంజాయి, డ్రగ్స్, గుట్కా, మత్తు పదార్థాల నివారణకు ఎక్సైజ్, పోలీసులతో కలిసి ప్రత్యేక టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టర్ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. విశాఖలోని మురళీనగర్‌లో గల ఎక్సైజ్ డిసి కార్యాలయంలో ఆదివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

Pages