S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/02/2017 - 00:19

రాజమహేంద్రవరం, ఆగస్టు 1: గోదావరి ఆధారిత సాగునీటి ప్రాజెక్టుల ద్వారా కొత్త ఆయకట్టు ఎండమావిగానే కన్పిస్తోంది. గోదావరి నది ఆధారంగా ఒకే ఆయకట్టుకు అనేక ప్రాజెక్టులు రూపాంతరం చెందాయి. దీనికి తోడు వివిధ సాగునీటి ప్రాజెక్టుల కాల్వలు తవ్వకంతో ఇప్పటికే సాగులోవున్న భూములు కనుమరుగైన చిత్రమైన పరిస్థితి గోదావరి జిల్లాల్లో చోటుచేసుకుంది.

08/02/2017 - 00:18

విశాఖపట్నం, ఆగస్టు 1: విశాఖ భూ కుంభకోణాలపై విచారణ చేపట్టడానికి సాక్షాత్తూ ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఇనె్వస్టిగేషన్ టీం (సిట్)పై అధికార పక్ష నాయకులు దుమారం లేపుతున్నారు. విశాఖ భూ కుంభకోణాలపై సిబిఐతో విచారణ జరిపించాలని విపక్షాలన్నీ ఏకమై డిమాండ్ చేసినా, ప్రభుత్వం సిట్‌ను నియమించింది. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసే వ్యవస్థ కాబట్టి సిట్‌పై ముందు చాలా మందికి అనుమానాలు ఉండేవి.

08/02/2017 - 00:18

విజయవాడ (ఇంద్రకీలాద్రి) ఆగస్టు 1: చంద్రగ్రహణం సందర్భంగా ఈనెల 7వ తేదీన విజయవాడ దుర్గగుడిని మూసివేస్తున్నట్లు శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఇవో ఎ సూర్యకుమారి తెలిపారు. 7వ తేదీ రాత్రి 10-56 గంటల నుండి 12-52గంటల వరకు గ్రహణ కాలం ఉంటుందని మంగళవారం ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. గ్రహణం సందర్భంగా ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ ద్వారాలను మూసేస్తారన్నారు.

08/02/2017 - 00:17

నంద్యాల, ఆగస్టు 1: కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఈనెలలో జరుగనున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అబ్దుల్ ఖాదర్ పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఖాదర్ 1994 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ క్రియశీలక పదవులు చేపట్టారు. ఐఎన్‌టియుసిలో కొంతకాలం పనిచేశారు. హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. గతంలో నంద్యాల అసెంబ్లీ టికెట్ కోసం ఆయన ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు.

08/01/2017 - 02:49

నంద్యాల, జూలై 31: నంద్యాల ఉప ఎన్నిక నేపధ్యంలో రాజకీయం సోమవారం ఒక్కసారిగా వేడెక్కింది. వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా తన తమ్ముడు చక్రపాణిరెడ్డి ఇంటికి వెళ్లి మంతనాలు జరిపారు. దీంతో చక్రపాణి పార్టీ మారడం ఖాయమన్న ప్రచారం జరిగింది. ఇదే క్రమంలో వైకాపా నేతలు విడతల వారిగా చక్రపాణిరెడ్డికి ఇంటికి వెళ్లి చర్చించారు.

08/01/2017 - 02:46

శ్రీకాకుళం, జూలై 31: దక్షిణకాశీ అయిన శైవక్షేత్రం, శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో శ్రీముఖలింగం గ్రామంలో శ్రీముఖలింగేశ్వర స్వామి క్షేత్రంలో సోమవారం అష్టతీర్థ మహారాజ యాగం ప్రారంభమైంది. ఆగస్టు ఏడో తేదీ వరకూ జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటిగా పులిబండ ఘాట్‌వద్ద దేవాదాయశాఖ, అర్చక సంఘం సంయుక్తంగా పర్లాఖిమిడి మహారాజావారి పేరున ప్రత్యేక పూజలు నిర్వహించారు.

08/01/2017 - 02:44

జి.మాడుగుల, జూలై 31: కాల సర్పం రూపంలో మృత్యువు ఇద్దరు చిన్నారుల ప్రాణాలను హరించింది. తల్లిదండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం భీరం పంచాయతీ సరియా గ్రామానికి చెందిన మాదుల బొంజుబాబు, పుస్పాలమ్మ దంపతుల పిల్లలు నాగరాజు (12), కల్యాణిబాబు (10) అన్నదమ్ములు.

08/01/2017 - 02:44

హైదరాబాద్, జూలై 31: ప్రభుత్వ ఉద్యోగుల పని తీరు ఆధారంగా బలవంతంగా పదవీ విరమణ చేయిస్తే తాము చూస్తూ ఊరుకోమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్‌కె రోజా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

08/01/2017 - 02:43

హైదరాబాద్, జూలై 31: నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎపి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘అన్న వస్తున్నాడు..’ పేరిట పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ అంతా కలియ తిరిగి ప్రజల సమస్యలను, కష్టాలను తెలుసుకోనున్నారు.

08/01/2017 - 02:43

విశాఖపట్నం, జూలై 31: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా ఏర్పాటై, తదనంతర కాలంలో ప్రైవేటు చేతుల్లోకి వెళ్లి మూతపడిన ప్రతిష్టాత్మక హిందుస్థాన్ జింక్ కర్మాగారం చివరకు ప్లాట్‌లుగా మారనుంది. గత నాలుగేళ్లుగా మూతపడిన ఈ కార్మాగారాన్ని ప్లాట్లగా విభజించి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని వేదాంత కంపెనీ నిర్ణయించింది. ఈ మేరకు వేదాంత కంపెనీ అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్టు తెలిసింది.

Pages