S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/30/2017 - 06:10

హైదరాబాద్, జూలై 29: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను శనివారం కలుసుకుని వివిధ అంశాలపై చర్చించారు. ఇక్కడ ఒక వివాహ కార్యక్రమానికి హాజరయ్యే నిమిత్తం ఆయన శుక్రవారం ఇక్కడకు వచ్చారు. గవర్నర్‌తో చంద్రబాబు రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ఏపి ప్రభుత్వ అమలు చేయనున్న ఈ-ప్రగతి గురించి ఆయన గవర్నర్‌కు వివరించారు.

07/30/2017 - 06:16

అనంతపురం అర్బన్, జూలై 29: రద్దయిన నోట్లు మార్చేందుకు యత్నిస్తున్న కడప, అనంతపురం జిల్లాలకు చెందిన ముఠా సభ్యులను అనంతపురం జిల్లా పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. 11 మంది సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరి నుంచి రద్దయిన రూ.కోటి నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం నగరంలో శనివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో అదనపు ఎస్పీ మల్యాద్రి ముఠా వివరాలు వెల్లడించారు.

07/30/2017 - 06:09

గాజువాక, జూలై 29: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ విశాఖపట్నం రిఫైనరీలోని 01బి క్రూడాయిల్ ట్యాంక్‌పై శనివారం రాత్రి పిడుగు పడింది. దీంతో క్రూడాయిల్ ట్యాంకులో ఒక్కసారిగా మంటలు లేచాయి. అయితే హెచ్‌పిసిఎల్ అధికారులు వెంటనే స్పందించి అత్యవసర అలారాన్ని మోగించడంతో అధికారులు, ఉద్యోగులు అప్రమత్తమయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు అగ్నిమాపక శకటాలకు సమాచారం అందించారు.

07/30/2017 - 02:27

హైదరాబాద్, జూలై 29: మత్తు పదార్థాల (డ్రగ్స్) విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహారిస్తుందని, ఎవరినీ ఉపేక్షించదని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో ‘్ఫక్కి’ నిర్వహించిన సదస్సులో మంత్రి నారా లోకేష్‌తో పాటు ఆయన సతీమణి నారా బ్రహ్మణి కూడా పాల్గొన్నారు. అనంతరం మంత్రి నారా లోకేష్ తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ డ్రగ్స్ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.

07/30/2017 - 02:20

తిరుపతి, జూలై 29: నంద్యాలలో ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలు ప్రజల ఆత్మగౌరవానికి, టిడిపి అహంకారానికి మధ్య జరుగుతున్న పోరని వైకాపా ఎమ్మెల్యే రోజా అన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ టిడిపి మంత్రులపైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎత్తు పెరిగిన మంత్రి అచ్చన్నాయుడికి కొంచెం కూడా బుద్ధి పెరిగినట్లు కనిపించడంలేదని రోజా అన్నారు.

07/30/2017 - 02:20

విజయవాడ, జూలై 29: తెలుగు నేల కళలకు కాణాచి. కళాకారులకు పుట్టినిల్లు. నేటి అమరావతి ప్రాంతం నుండి ఎందరో కళాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. అనితర సాధ్యమైన వారి ప్రతిభకు ఇక్కడి కళాక్షేత్రాలు పులకించాయి. ఈ క్రమంలోనే విజయవాడ ఘంటశాల వెంకటేశ్వరరావు సంగీత నృత్య కళాశాల ఆవరణలో అత్యాధునిక కళాక్షేత్రం రూపుదిద్దుకోనుంది.

07/30/2017 - 02:17

హైదరాబాద్, జూలై 29: ‘మా అమ్మ, భార్య బ్రహ్మణీ బాగా కష్టపడుతుంటారు.. నేను, నాన్న (చంద్రబాబు) ఖర్చు పెడుతూ ఉంటాం..’ అని ‘్ఫక్కి’ సదస్సులో లోకేష్ అనగానే సభికులంతా ఒక్కసారిగా నవ్వేశారు. మహిళల సమస్యలపై చాలా మంది మాట్లాడారని, పాఠశాలల విద్యార్థులకు పాలు ఇవ్వాలని కొంతమంది మహిళలు తమ ప్రసంగాల్లో చేసిన వినతిని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళతానని ఆయన చెప్పారు.

07/30/2017 - 02:14

మదనపల్లె, జూలై 29: చిత్తూరు జిల్లా మదనపల్లె మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అందరూ నివ్వెరపోయే సంఘటన చోటుచేసుకుంది.

07/30/2017 - 02:14

రాజమహేంద్రవరం, జూలై 29: గోదావరి బేసిన్‌లో వరి నాట్లు మందకొడిగా సాగుతున్నాయి..పట్టిసీమ నేపధ్యంలో కృష్ణా బేసిన్‌లో మాత్రం జోరుగా ఖరీఫ్ సాగింది. గోదావరి బేసిన్‌లో ఈ నెలాఖరుకు నాట్లు పూర్తి చేయాలని అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఉభయ గోదావరి జిల్లాల డెల్టాల కింద 9.80 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు మొదలెట్టారు. కౌలురైతులకు సకాలంలో రుణాల అందని స్థితిలో నాట్లు ఆలస్యానికి ఒక కారణంగా తెలుస్తోంది.

07/30/2017 - 02:11

ఒంగోలు,జూలై 29: ఒంగోలు నగరాన్ని స్మార్ట్ సిటిగా మార్చే ప్రక్రియ జరుగుతోందని రాష్టమ్రునిసిపల్ శాఖమంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పి నారాయణ వెల్లడించారు. శనివారం ఆయన జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్‌తో సమావేశమయ్యారు. ఈసమావేశంలో వారిద్దరి మధ్య బూత్‌కమిటిలు, పార్టీ సంస్ధాగత నిర్మాణం, నగర అభివృద్ధితోపాటు పలు అంశాలపై చర్చ జరిగింది.

Pages