S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/23/2017 - 02:56

విశాఖపట్నం/రాజమహేంద్రవరం, జూలై 22: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్రపై కాపు ప్రజాప్రతినిధులు విమర్శలు కురిపించారు. విశాఖలో, రాజమహేంద్రవరంలో శనివారం విలేఖరుల సమావేశంపెట్టి మరీ ముద్రగడపై తీవ్రంగా ధ్వజమెత్తారు.

07/23/2017 - 02:56

రాజమహేంద్రవరం, జూలై 22: కాఫర్ డ్యామ్‌తోనే పోలవరం ప్రాజెక్టును సరిపెట్టే పరిస్థితి కనిపిస్తోంది. కాపర్ డ్యామ్ అంటే ప్రధాన డ్యామ్ పనులకు ఆటంకం లేకుండా అడ్డుగా నిర్మించే మట్టికట్ట. దీనినే ప్రభుత్వం ప్రధాన డ్యామ్‌గా వినియోగించి గ్రావిటీ ద్వారా పోలవరం నీటిని అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

07/23/2017 - 02:54

చిత్తూరు, జూలై 22: రాయలసీమ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చిత్తశుద్ధి లేదని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఆరోపించారు. శనివారం చిత్తూరులో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతం నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు అయినా ఈ ప్రాంత అభివృద్ధికి ఎవరూ పాటుపడలేదన్నారు.

07/23/2017 - 02:54

తిరుపతి, జూలై 22: మాదక ద్రవ్యాల మత్తు వదిలించేందుకు ఎక్సైజ్, పోలీస్ శాఖలతో ఒక ప్రత్యేక టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఏపి డిజిపి సాంబశివరావు తెలిపారు. శనివారం ఆయన కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.

07/23/2017 - 02:53

విజయవాడ, జూలై 22: ప్రకాశం జిల్లా దేవరపల్లిలో ప్రశాంతమైన వాతావరణానికి భంగం కలిగించేలా వైకాపా నాయకులు వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ ఆరోపించారు. దళితులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకోవడం సమాజానికి మంచిది కాదని శనివారం ఇక్కడ ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

07/23/2017 - 02:53

కాకినాడ, జూలై 22: తూర్పు గోదావరి జిల్లా యు కొత్తపల్లి మండలం సుబ్బంపేట గ్రామానికి చెందిన గల్లంతైన జాలర్లు క్షేమంగా ఆంధ్రా-ఒరిస్సా తీరానికి చేరుకున్నట్టు ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారం అందింది. ఈనెల 10వ తేదీన సుబ్బంపేట నుండి వేట నిమిత్తం సముద్రంలోకి వెళ్ళిన ఐదుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు.

07/23/2017 - 02:52

పలమనేరు, జూలై 22: చేతికొచ్చిన పంటను కాపాడాలన్న తపనతో పొలం వద్ద కాపలా ఉన్న రైతును ఏనుగుల గుంపు తొక్కి చంపాయి. ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో శనివారం జరిగింది. పంటలకు నష్టం కలుగచేస్తున్న ఏనుగులను తరిమివేసే ప్రయత్నంలో రైతు ప్రాణాలు కోల్పోయాడు. పలమనేరు మండలంలోని పి. వడ్డూరు గ్రామంలో రైతు చిన్నప్ప(58) పంట పొలాలను ఏనుగుల గుంపును తన పొలంలోకి రాకుండా తరిమే ప్రయత్నం చేశాడు.

07/23/2017 - 01:23

నెల్లూరు, జూలై 23: నెల్లూరుకు చెందిన ప్రధాన క్రికెట్ బుకీ కృష్ణసింగ్‌ను ఎట్టకేలకు నెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకోగలిగారు. ఈ సంఘటనపై జిల్లా పోలీస్ శాఖ స్పష్టత ఇవ్వనప్పటికి విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం రాత్రి బెంగళూరులో కృష్ణసింగ్‌ను నెల్లూరు 2వ నగర సి ఐ కె.రామకృష్ణారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ పోలీసుల బృందం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

07/23/2017 - 01:22

విజయవాడ, జూలై 22: మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధంగా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా పిజి పట్ట్భద్రులు విధిగా ఏడాది పాటు నిర్బంధ ప్రభుత్వ సర్వీస్ చేయాలనే వేధింపులు నానాటికీ శృతిమించుతున్నాయని మెడికల్ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్ష, ప్రధా న కార్యదర్శులు డాక్టర్ ఉప్పలపాటి రఘురాం, డాక్టర్ చైతన్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

07/23/2017 - 01:21

విజయనగరం, జూలై 22: ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వౌలిక వసతులను కల్పించడంతోపాటు వాటి పర్యవేక్షణ బాధ్యతలను ప్రైవేటు సంస్థకు అప్పగించనున్నట్టు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు తెలిపారు. ఈ మేరకు ఇటీవల కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని, త్వరలో వీటికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేసే విషయమై కసరత్తు జరుగుతుందన్నారు.

Pages