S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/22/2017 - 02:52

విశాఖపట్నం, జూలై 21: విశాఖ భూ కుంభకోణంలో అధికార పార్టీ నేతల హస్తం ఉందని రుజువైంది. అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ భూ కబ్జాకు పాల్పడినట్టు ప్రాథమిక నిర్థారణకు రావడంతో భూ కుంభకోణాలపై దర్యాప్తు జరుపుతున్న సిట్ అధికారులు ఈ విషయాన్ని కలెక్టర్‌కు తెలియచేశారు. ఆయన వెంటనే తహశీల్దారును పరిశీలనకు పంపించారు.

07/22/2017 - 02:51

విజయవాడ, జూలై 21: వివిధ రంగాల్లో వృద్ధి రేటును కొనసాగించేందుకు వీలుగా విజయవాడలో స్ట్రాటజిక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఎపి (సిట్ ఎపి)ని ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణ కల్పన, ఆర్థికాభివృద్ధికి ఊతం ఇచ్చేలా ఇతర రాష్ట్రాలు, దేశాలతో వివిధ అంశాల్లో పోటీతత్వం పెంపొందిచడం వంటి చర్యలను ప్రభుత్వం చేపడుతోంది.

07/22/2017 - 02:45

అమరావతి, జూలై 21: ఈ ఏడాది నిర్మాణ రంగంలో భారీ వృద్ధిరేటు నమోదయ్యే అవకాశం ఉందని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. సచివాలయం 2వ బ్లాక్‌లోని తన చాంబర్‌లో పరిశ్రమలు, దాని అనుబంధ రంగాల్లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డిపి)ని శుక్రవారం ఉదయం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా రాజధాని అమరావతిలో ప్రభుత్వ రంగంతోపాటు ప్రైవేట్ రంగంలో కూడా అనేక నిర్మాణాలు జరుగుతాయని చెప్పారు.

07/22/2017 - 02:43

విశాఖపట్నం, జూలై 21: ప్రశాంత్ కిషోర్ (పికె)..ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఎవరి నోట విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. మోదీని ప్రధానిగా, నితీష్‌ను ముఖ్యమంత్రిగా చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ వచ్చే ఎన్నికల్లో వైకాపాను అధికారంలో తెచ్చే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ఇటీవల జరిగిన వైకాపా ప్లీనరీ సమావేశంలో ప్రశాంత్ కిషోర్‌ను పార్టీ క్యాడర్‌కు జగన్ పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

07/22/2017 - 02:41

శ్రీకాకుళం, జూలై 21: వంశధార ప్రాజెక్టు నిర్మాణానికి మోకాలడ్డే 40 రిట్ పిటీషన్లపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలను వెల్లడించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాసితులు కొత్త భూసేకరణ చట్టం వర్తింపజేయాలంటూ వేసిన రిట్ పిటిషన్లను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 850, 851 రిట్ పిటిషన్ల సంఖ్యతో హైకోర్టులో దాఖాలు చేసింది.

07/22/2017 - 02:39

విజయవాడ, జూలై 21: ఎన్టీఆర్ జలసిరి కింద వేసిన 17 వేల బోర్లను మూడు నెలల్లో వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. వ్యవసాయం, వ్యవసాయాధారిత రంగాలతో ఉపాధిహామీ పథకం అనుసంధానానికి చేపడుతున్న కార్యక్రమాలపై ఆయన వెలగపూడి సచివాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి 7 స్టార్ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు.

07/22/2017 - 02:36

విజయవాడ, జూలై 21: రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ చాంబర్ వద్ద ఒక మహిళ హంగామా సృష్టించింది. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో విజయవాడకు చెందిన గోవిందమ్మ తన ఇద్దరు కూతుళ్లతో మంత్రి చాంబర్ ప్రాంతానికి వచ్చి, కాసేపు అక్కడ విజిటర్లకు కేటాయించిన స్థలంలో కూర్చుని, ఆకస్మాత్తుగా పూనకం వచ్చినట్లుగా ఊగిపోతూ హడావుడి చేసింది.

07/22/2017 - 01:22

న్యూఢిల్లీ, జూలై 21: ఆంధ్రాకు కరవు సహాయక చర్యలకోసం జాతీయ విపత్తు నిధి నుంచి రూ.518 కోట్లు విడుదలకు ఆమోదం తెలిపినట్టు కేంద్ర వ్యవసాయ సహాయ మంత్రి ఎస్.ఆహ్లువాలియా తెలిపారు. ఆంధ్రాలో నెలకొన్న కరువు సహాయ చర్యలకోసం రూ.3173 కోట్లు విడుదల చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరిన నేపథ్యంలో వైఎస్సాఆర్‌సిపి ఎంపి విజయ సాయిరెడ్డి రాజ్యసభలో ఆంధ్రాకు కేంద్రం కరవు సహాయంపై అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.

07/22/2017 - 01:21

విజయవాడ, జూలై 21: విజయనగరం జిల్లా భోగాపురంలో తలపెట్టిన ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి ఇక మార్గం సుగమమైనట్లే. విమానాశ్రయ పరిధిలో భూమి కోల్పోతున్న రైతులకు నష్టపరిహారాన్ని ఖరారు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది.

07/22/2017 - 01:21

విజయవాడ (క్రైం), జూలై 21: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌తో చర్చల సారాంశాన్ని గవర్నర్ వెల్లడించాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

Pages