S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/22/2017 - 00:47

రాజమహేంద్రవరం, జూలై 21: పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసే కుట్రలో భాగమే పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలనే అనుమానం కలుగుతోందని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి పోలవరాన్ని పక్కబెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు అనుమానం కలుగుతోందన్నారు. పోలవరం కట్టకపోతే చంద్రబాబునాయుడు జాతి ద్రోహిగా మిగులుతారన్నారు.

07/22/2017 - 00:46

కర్నూలు, జూలై 21: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఒకటైన ఫైబర్‌నెట్, కేబుల్, టెలిఫోన్ సౌకర్యం నంద్యాల నియోజకవర్గ వాసులకు అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారికంగా ఫైబర్‌నెట్ సేవలు ప్రారంభించినా ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సేవలను ప్రారంభించిన తూర్పు గోదావరి జిల్లాలోని ఒక గ్రామంలో మాత్రమే సేవలు ప్రజలకు అందుతున్నాయి.

07/21/2017 - 03:28

భీమవరం, జూలై 20: తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మత్తు మందులు విక్రయించే ముఠాతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి లింకులు ఉన్నట్లు తేలడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పట్టణానికి చెందిన ప్రసాద్ సన్స్ అండ్ కో మెడికల్స్ ద్వారా మత్తు మందులను విక్రయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఆ దుకాణ యజమానిని అరెస్టు చేశారు.

07/21/2017 - 03:26

విశాఖపట్నం, జూలై 20: చదువుల తల్లి దగా పడింది. నలుగురికి విజ్ఞానాన్ని అందించాల్సిన జిల్లా గ్రంథాలయం పరాయి పంచకు చేరి, అక్కడ కూడా నిలువ నీడ లేకపోవడంతో వేరేచోటికి తరలిపోయే దుర్ఘతి పట్టింది. ఐదేళ్ల కిందటి వరకూ ఎంతో వైభవంగా నడిచిన జిల్లా గ్రంథాలయానికి నేడు ఎక్కడుందో వెతుక్కునే దుస్థితి ఏర్పడింది. విలువైన గ్రంథాలు, పుస్తకాలకు ఆయుష్షు చెల్లిపోతున్నా ప్రభువుల్లో చలనం లేదు.

07/21/2017 - 03:24

విజయనగరం, జూలై 20: వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో పది లక్షల గృహాలు నిర్మించడానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ కాంతిలాల్ దండే చెప్పారు. గురువారం సాయంత్రం ఆయన కలెక్టరేట్‌లో గృహ నిర్మాణ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఎన్‌టిఆర్ గృహ నిర్మాణ పథకం, గ్రామీణ, పట్టణ గృహనిర్మాణ పథకాలతోపాటు ఐఎవై పథకాలపై చర్చించారు.

07/21/2017 - 03:22

విజయవాడ, జూలై 20: యద్ధప్రాతిపదికన ఫైబర్ నెట్ పనులు చేపట్టాలని అధికారులను రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన ఎపి ఫైబర్ నెట్ సంస్థ అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ సంఖ్యలో సెట్ టాప్ బాక్స్‌లను సేకరించి, ప్రతి ఇంటికీ వెంటనే ఇచ్చే పనులు చేపట్టాలని ఆదేశించారు.

07/21/2017 - 03:18

మడకశిర, జూలై 20: అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన ఆస్తులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన సహచర మంత్రులు కనే్నశారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. గురువారం అనంతపురం జిల్లా మడకశిరలో విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది మంది లబ్ధిదారులు అగ్రిగోల్డ్ సంస్థకు డబ్బులు చెల్లించి నష్టపోయారన్నారు.

07/21/2017 - 03:18

నంద్యాల టౌన్, జూలై 20: రాష్ట్రంలోని వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు పద్దతిలో 324 మంది వైద్యులను నియమించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం మంత్రి తనిఖీ చేశారు.

07/21/2017 - 03:17

గుంటూరు, జూలై 20: ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వివిధ పిజి కోర్సులకు గత నెల 28న జరిగిన ప్రవేశ పరీక్షా ఫలితాలను విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ దామోదరనాయుడు, రిజిస్ట్రార్ డాక్టర్ టివి సత్యనారాయణ గురువారం విడుదల చేశారు. ప్రవేశ పరీక్షకు సుమారు 900 మంది విద్యార్థులు హాజరయ్యారు.

07/21/2017 - 03:17

పోలవరం, జూలై 20: పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో కేంద్ర సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన ఎనిమిది మంది సభ్యుల బృందం గురువారం పర్యటించి, పనులను పరిశీలించింది. ఈ బృందంలో శాస్తవ్రేత్త శివకుమార్, సి పరమేశ్వరన్, లలితకుమార్ శోలంకి తదితరులున్నారు. పర్యటన ముగిసిన తర్వాత జరుగుతున్న పనులు, జరిగిన పనులనుగూర్చి బృందం కేంద్రానికి నివేదిక సమర్పిస్తుంది.

Pages