S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/25/2017 - 19:27

అమరావతి: గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అప్రమత్తం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లాలోని 18 మండలాల్లో ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, సుమారు 20వేల ఎకరాల్లో పంటలకు సాగునీరు అత్యవసరమని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

07/25/2017 - 02:53

కాకినాడ, జూలై 24: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈనెల 26వ తేదీ నుంచి ‘చలో అమరావతి’ పేరుతో నిరవధిక పాదయాత్ర చేపట్టడానికి సన్నద్ధమవుతుండటంతో సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. ముద్రగడ స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కిర్లంపూడి గ్రామం ప్రస్తుతం పోలీసు బలగాల వలయంలో ఉంది.

07/25/2017 - 02:51

మహానంది, జూలై 24: జూలై నెలాఖరు వరకు రాష్ట్రంలో ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. కర్నూలు జిల్లా మహానందిలో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి బూత్ లెవెల్ ఆఫీసర్ల ద్వారా ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టామన్నారు. అదే విధంగా కళాశాలలకు వెళ్లి విద్యార్థుల ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టామన్నారు.

07/25/2017 - 02:51

గుంతకల్లు, జూలై 24: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని కరువు కబళిస్తుందని, టిడిపి, కరవు అవిభక్త కవలలని పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు.

07/25/2017 - 02:50

హైదరాబాద్, జూలై 24: కాపుకార్పొరేషన్‌లో భారీ స్కాం శీర్షికతో ఈనెల 21 ఆంధ్రభూమిలో వచ్చిన వార్తను జూమ్ టెక్నాలజిస్ సోమావరం నాడొక ప్రకటనలో ఖండించింది. దేశంలోనే కంప్యూటర్ నెట్‌వర్కింగ్, సైబర్ భద్రత శిక్షణలో తమ సంస్థకు ఎంతో పేరుందని ‘జూమ్’ వెల్లడించింది. గత రెండు దశాబ్దాలుగా దేశ, విదేశాల నుంచి విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని తెలిపారు.

07/25/2017 - 02:50

తిరుపతి, జూలై 24: తిరుమలకు నిషేధిత వస్తువులైన మద్యం, గంజాయి, ఎండు చేపలను తీసుకెళుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వాటిని స్వాధీనం చేసుకున్నట్లు టిటిడి సివిఎస్‌ఓ రవికృష్ణ తెలిపారు.

07/25/2017 - 02:49

తిరుపతి, జూలై 24: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఈనెల 28న గరుడ పంచమి పర్వదినాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీ మలయప్పస్వామి రాత్రి 7 నుంచి 9 గంటల వరకు తన ఇష్టవాహనమైన గరుడ వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు.
ఆగస్టు 3 నుంచి పవిత్రోత్సవాలు

07/25/2017 - 02:49

ఒంగోలు, జూలై 24: ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని అర్ధవీడు మండలం గనె్నపల్లి సమీపంలో మావోయిస్టులు దాచిన డంప్‌ను కూంబింగ్ పార్టీ పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం గనె్నపల్లి సమీపంలోని తూర్పుదిశగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఇటీవల కూంబింగ్ పార్టీ సిబ్బంది రెండు రోజులపాటు కూంబింగ్ నిర్వహిచారు. నల్లమల అటవీ ప్రాంతాన్ని అడుగడుగునా జల్లెడ పట్టారు.

07/25/2017 - 02:18

విజయవాడ, జూలై 24: డ్రగ్స్ కేసులో కేవలం సినిమా రంగానే్న టార్గెట్ చేయడం సరికాదని సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణ మూర్తి తెలిపారు. వెలగపూడి సచివాలయం వద్ద ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ దమ్ముంటే ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అందరినీ విచారణ చేయాలన్నారు. సినిమాలు తీసే తమకే సిట్ అధికారులు సినిమా చూపిస్తున్నారన్నారు. మాదక ద్రవ్యాలు మహమ్మారిగా మారి యువతను నిర్వీర్యం చేస్తున్నాయన్నారు.

07/25/2017 - 01:34

న్యూఢిల్లీ, జూలై 24: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి నిధుల రాకుండా కాంగ్రెస్, వైఎస్సార్సీపీలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని టీడీపీ ఎంపీలు ఆరోపించారు. సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి సుజనా చౌదరి, టీడీపీ ఎంపీలు సీఎం రమేష్, కోనకళ్ల నారాయణ, అవంతి శ్రీనివాస్, కిష్టప్ప తదితరులు విలేఖరులతో మాట్లాడారు.

Pages