S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/20/2017 - 03:07

అమలాపురం, జూన్ 19: పాఠశాల ఫీజులు చెల్లించలేదన్న నెపంతో విద్యార్థులను నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేసిన పాఠశాల నిర్వాహకుల వైనమిది. తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తంచేసి విషయాన్ని ఆర్డీవో జి గణేష్‌కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆర్డీవో పాఠశాల నిర్వాకంపై విచారణకు ఆదేశించారు. వివరాలు ఇలా ఉన్నాయి.

06/20/2017 - 03:02

విశాఖపట్నం, జూన్ 19: సాధారణ సబ్ రిజిస్ట్రార్ రూ.కోట్ల ఆస్తులను కూడబెట్టాడు. గాజువాక సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న దొడ్డపనేని వెంకునాయుడు ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) సోమవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. విశాఖ నగరం పందిమెట్టలోని విలాసవంతమైన భవనంలో నివాసం ఉంటున్న వెంకునాయుడు ఆస్తుల చిట్టా పరిశీలించిన ఎసిబి అధికారులకే కళ్లు బైర్లు కమ్మాయి.

06/20/2017 - 03:01

న్యూఢిల్లీ, జూన్ 19: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సామాజిక భద్రత కార్యక్రామాల అమలు, ఉత్తమ పౌర సేవలకుగాను ఆంధ్రప్రదేశ్ మొత్తం 19 అవార్డులను అందుకొంది. సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ జరిగిన కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ అవార్డులను అందజేశారు.

06/20/2017 - 02:58

విశాఖపట్నం, జూన్ 19: విశాఖ భూ కుంభకోణం మూలాలు తేలాలంటే సిట్ విచారణ సరిపోదని, సిబిఐ దర్యాప్తు జరపాలని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి రాఘవులు డిమాండ్ చేశారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఉదయం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిబిఐ రాజ్యాంగ పరమైన దర్యాప్తు సంస్థని, సిట్ పరిధి నామమాత్రమేనన్నారు.

06/20/2017 - 01:59

విజయవాడ, జూన్ 19: సెలక్ట్ ఛానల్ బ్రాండ్‌తో మల్టీనేషనల్ కంపెనీలు తమ ఉత్పత్తులను బడా మాల్స్, సినిమా థియేటర్లు, పెట్రోల్ బంకుల్లో అధిక ధరలకు విక్రయించే విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. సోమవారం రాత్రి విజయవాడ బందరు రోడ్డులోని పివిపి మాల్‌లోని పలు షాపులను సంబంధిత అధికారులతో కలిసి మంత్రి తనిఖీ చేశారు.

06/20/2017 - 01:56

అరకులోయ, జూన్ 19: ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వాలు ఖూనీ చేస్తున్నాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ ఆరోపించారు. విశాఖ జిల్లా అరకులోయలో సోమవారం నిర్వహించిన గిరిజన గర్జన ర్యాలీని ఆమె ప్రారంభించారు.

06/20/2017 - 01:54

హైదరాబాద్, జూన్ 19: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్‌ను ‘మద్యాంధ్ర ప్రదేశ్’గా మార్చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి విమర్శించారు. టిడిపి అధికారం చేపట్టిన తర్వాత బెల్టు షాపులను రద్దు చేయలేదని, ఇంకా విస్తరించారని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు.

06/20/2017 - 01:54

హైదరాబాద్, జూన్ 19: విశాఖపట్నం భూ కుంభకోణంపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తి సమక్షంలో సిబిఐ విచారణ జరిపించాలని ఎపి కాంగ్రెస్ కమిటీ (ఎపిసిసి) అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

06/20/2017 - 01:53

హైదరాబాద్, జూన్ 19: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చే నెల 8, 9 తేదీల్లో ప్లీనరీ నిర్వహించనున్నది.

06/20/2017 - 01:53

మంగళగిరి, జూన్ 19: గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ శివారులో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (ఎయిమ్స్) నిర్మాణ పనులు జూలైలో ప్రారంభమవుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ వెల్లడించారు.

Pages