S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/16/2016 - 07:42

హైదరాబాద్, మే 15: ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివసించే శేరిలింగంపల్లిలోని మదీనాగూడలోఉన్న ఇంటికి రెసిడెన్స్ క్యాంప్ ఆఫీస్ హోదాను ఇస్తూ రాష్ట్రప్రభుత్వం జీవో 114ను జారీ చేసింది. రాష్టవ్రిభజన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్‌లో గత రెండేళ్లలో మూడో ఇంటికి ఈ హోదా లభించింది. తొలుత జూబ్లీహిల్స్‌లోని సొంత గృహంలో చంద్రబాబు ఉండేవారు.

05/16/2016 - 07:40

కాకినాడ, మే 15: నైపుణ్యాలతో కూడిన నాణ్యమైన విద్యతో యువతకు సరైన దిశా నిర్దేశం కల్పిస్తే భారతదేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుందని మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం కాకినాడ నగరంలోని ఒక కళాశాలలో ప్రసంగించారు. రానున్న నాలుగేళ్లలో దేశ జనాభాలో అత్యధిక శాతం యువతే ఉండబోతోందన్నారు.

05/16/2016 - 01:45

విజయవాడ, మే 15: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 17న ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ప్రత్యేక హోదా అంశంపై విపక్షాలతోపాటు మిత్రపక్షమైన బిజెపి సైతం ఇరకాటంలో పెడుతుండటంతో వాస్తవ పరిస్థితిని వివరించి, ఆదుకోవాలని కోరేందుకు నిర్ణయించుకున్నారు. అయితే కరవు సహాయం అడిగే మిషతో ఆయన మోదీని కలవనుండటం విశేషం.

05/16/2016 - 01:43

విజయవాడ, మే 15:మెడిసిన్ చదవాలనుకున్న విద్యార్థుల పాలిట నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) శరాఘాతంగా మారింది. ఇప్పటికే ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఈ ఏడాది ఎంసెట్‌లో మంచి ర్యాంక్ సాధించి వైద్య విద్యను చదవాలనుకున్న విద్యార్థుల్లో చాలామంది ఆ ఆశలను వదులుకునే పరిస్థితి ఏర్పడింది.

05/16/2016 - 01:42

పెద్దాపురం, మే 15: తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షుడు గోపు సతీష్‌రాజా (38) దారు ణ హత్యకు గురయ్యారు. ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను కత్తులతో నరికి చంపారు. మండలంలోని తాటిపర్తికి చెందిన సతీష్‌రాజా ఆదివారం రాత్రి సమీపంలోని దివిలి సెంటర్‌లోని ఒక షాపువద్ద ఉన్న సమయంలో, ఆయనపై ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు కత్తులతో దాడిచేశారు.

05/16/2016 - 01:40

కర్నూలు, మే 15: కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోమవారం నుంచి మూడు రోజుల పాటు జలదీక్ష చేపట్టనున్నారు. అందుకోసం కర్నూలు నగర శివారులోని నంద్యాల రహదారిలో వేదిక, తదితర ఏర్పాట్లు సిద్ధం చేశారు.

05/16/2016 - 01:37

హైదరాబాద్, మే 15: కుల ఉద్యమాలతో ఇప్పటికే వేడెక్కిన నవ్యాంధ్రలో మరో కుల ఉద్యమం ఊపిరిపోసుకోనుంది. 20 శాతం రిజర్వేషన్ల డిమాండుతో బ్రాహ్మణ, వైశ్య, రెడ్డి, కమ్మ, క్షత్రియ, వెలమ కులాలన్నీ ఒకే వేదికపైకి రానున్నాయి. ఉద్యమ స్వరూప స్వభావం, కార్యాచరణ ఖరారు కోసం, ఆయా కుల సంఘాల ప్రతినిధులు ఈనెల 19న శ్రీశైలంలోని అఖిల భారత రెడ్డి సంఘాల సమాఖ్య కల్యాణమండపంలో భేటీ కానున్నాయి.

05/16/2016 - 01:35

హైదరాబాద్, మే 15: ప్రైవేటు సంస్థలు జీతాలు జాప్యం చేస్తే ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తారు. కానీ ప్రభుత్వమే నిర్లక్ష్యం చేస్తే ఆ చిరుద్యోగులు ఎవరితో గోడు వెళ్లబోసుకోవాలి? జీతాలందక, కడుపులు నిండక చివరకు ఆత్మహత్యలే శరణ్యమంటున్న ఆ చిరుద్యోగుల కష్టాలు కడతేర్చేది ఎవరు? ఈ దయనీయ గాథ ఏ ఏజెన్సీ ప్రాంతాల్లోనో అనుకుంటే తప్పులో కాలేసినట్లే.

05/15/2016 - 16:40

గుంటూరు:పట్టణంలోని లక్ష్మీనగర్‌లో మట్టిపెళ్లలు విరిగిపడిన సంఘటవలో మరణించిన ఏడుగురి కుటుంబాలకు రూ. 20 లక్షల రూపాయలు చొప్పున పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ బాధితులకు హామీ ఇచ్చారు. అలాగే బాధిత కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకుకూడా సుముఖత వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు.

05/15/2016 - 04:27

హైదరాబాద్, మే 14: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ అడగలేదని, కనీసం లేఖ కూడా రాయలేదని బిజెపి కేంద్ర నాయకత్వం కుండబద్దలు కొట్టినట్లు చెప్పినా టిడిపిలో చలనం లేదని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, దీనికోసం ఉద్యమాన్ని ఉద్ధృతం చేయనున్నట్లు చెప్పారు.

Pages