S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/01/2017 - 01:10

హైదరాబాద్, జనవరి31:హంద్రీనది నుంచి ఆక్రమంగా ఇసుక తవ్వకాలు, దీనిపై తీసుకున్న చర్యలతో వచ్చే వారం వివరాలు ఇవ్వాలని కర్నూలు జిల్లా కలెక్టర్, ఎస్‌పిని హైదరాబాద్ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రజస్టీస్ రమేష్ రంగనాథన్, జస్టీస్ షమీమ్ అఖ్తర్‌లతో కూడిన డివిజన్ బెంచ్‌లు ఈ కేసును విచారిస్తోంది.

02/01/2017 - 01:10

హైదరాబాద్, జనవరి 31: విశాఖపట్నంలో భూ ఆక్రమణలకు పాల్పడని మంత్రులు గంటా శ్రీనివాస రావు, నారాయణను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు జి. అమర్‌నాథ్ డిమాండ్ చేశారు. అసైన్డ్ భూముల్లో ఉన్న పేదలను బెదిరించి భూములు లాక్కుంటున్నారని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు.

01/31/2017 - 06:05

విజయవాడ, జనవరి 30: ప్రతిష్టాత్మక అమరావతి-అనంతపురం రహదారి ప్రాజెక్ట్ అలైన్‌మెంట్ వారం రోజుల్లో ఖరారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో ఎన్‌హెచ్‌ఏఐ నిర్మిస్తున్న రహదారులు నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తిచేయాలన్నారు. విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి ఫ్లైఓవర్‌ను ఈ ఆగస్ట్ 15న ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు.

01/31/2017 - 06:04

విజయవాడ, జనవరి 30: ముందస్తు జాగ్రత్తలేవీ లేకపోగా ఆపై కూడా నిర్లిప్త వైఖరితో ప్రజాధనం కాపాడటంలో రాష్ట్ర ట్రెజరీశాఖ ఘోరంగా విఫలమవుతున్నది. సిఎం వంటి వివిఐపిల కాన్వాయ్‌లో ముందస్తు జాగ్రత్తగా అంబులెన్స్‌తో పాటు చివరకు ఫైరింజన్ కూడా ఉంటుంది.. అలాంటిది కోట్లాది రూపాయల లావాదేవీలు నిర్వర్తించే ట్రెజరీ శాఖలో ఇలాంటి ముందస్తు జాగ్రత్తలేవీ కన్పించడం లేదు.

01/31/2017 - 06:03

గుంటూరు, జనవరి 30: పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టుల సాధనకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్ణయించింది.

01/31/2017 - 06:03

విజయవాడ, జనవరి 30: మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం నివాళులు అర్పించారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాల సేపు వౌనం పాటించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉదయం 11 గంటలకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు వౌనం పాటించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే.

01/31/2017 - 05:59

హైదరాబాద్, జనవరి 30: పెద్దనోట్ల రద్దు తర్వాత అక్రమంగా బిల్లులను తయారుచేసిన కేసులో ముసద్దీలాల్ జువలరీ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్లకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు రాష్ట్ర హైకోర్టు సోమవారం తిరస్కరించింది.

01/31/2017 - 03:03

హైదరాబాద్, జనవరి 30: ఆంధ్రప్రదేశ్ సన్ రైజ్ కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు ‘సన్’ రైజ్ అవుతున్నారని వైకాపా ఎమ్మెల్యే, పిఎసి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. పెట్టుబడులపై చంద్రబాబు చెప్పేవన్నీ దొంగ లెక్కలేనని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో ఆరోపించారు. రెండేళ్ళలో రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్న చంద్రబాబు అవి ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

01/31/2017 - 03:03

న్యూఢిల్లీ, జనవరి 30: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా, రైల్వేజోన్ కోసం బడ్జెట్ సమావేశాలల్లో పోరాటం కొనసాగిస్తామని వైకాపా ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, విజయసాయి రెడ్డి ప్రకటించారు. సోమవారం నాడు పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైకాపా ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి పాల్గొన్నారు.

01/31/2017 - 03:02

న్యూఢిల్లీ, జనవరి 30: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఇటీవల ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని అఖిలపక్ష సమావేశంలో కేంద్రాన్ని కోరినట్టు టిడిపి లోక్‌సభ నేత తోట నరసింహం తెలిపారు. సోమవారం నాడు ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి టిడిపి తరపున తోట నరసింహం పాల్గొన్నారు.

Pages