S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/01/2017 - 02:38

అమరావతి, జనవరి 31: ప్రభు త్వం చేకూర్చే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేందుకు జిల్లాస్థాయిలో ప్రచార సమన్వయ కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. స్థానిక రాష్ట్ర ప్రభుత్వ అతిథిగృహంలో రాష్టస్థ్రాయి సమాచార, పౌర సంబంధాల శాఖ క్షేత్రస్థాయి అధికారుల సమావేశం, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ మంగళవారం సంయుక్తంగా నిర్వహించారు.

02/01/2017 - 02:37

అమరావతి, జనవరి 31: ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వైసీపీ అధినేత జగన్‌ను జనసేన అధిపతి పవన్ కల్యాణ్ రాజకీయంగా ఇరుకున పెట్టారు. ప్రత్యేక హోదా అంశంపై భిన్నమార్గంలో పోరాడుతున్న ఇద్దరు నేతలు కలసి పోరాడటం భ్రమ అనే అంచనాల నేపథ్యంలో, హోదాపై తాను వైసీపీతో కలసి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని పవన్ చేసిన బహిరంగ ప్రకటన వైసీపీని రాజకీయంగా ఆత్మరక్షణలోకి నెట్టింది.

02/01/2017 - 02:36

విజయవాడ, జనవరి 31: వందలు, వేల కోట్లతో అమలవుతున్న వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో నిబంధనల మేర గ్రామసభలు జరగాల్సి వుండగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పూర్తిగా ఇందుకు భిన్నంగా జరుగుతోందని భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు నిప్పులు చెరిగారు.

02/01/2017 - 02:35

విజయవాడ, జనవరి 31: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి మంత్రులు తమ శాఖల అధికారులతో సమీక్షలు చేయడంతో మంగళవారం వెలగపూడి సచివాలయంలో సందడి కనిపించింది. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వివిధ శాఖల మంత్రులతో ఒకవైపు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుండగా, మరోవైపు మంత్రులు అధికార్లతో సమావేశమై సమీక్షలు నిర్వహించారు.

02/01/2017 - 02:33

విజయవాడ, జనవరి 31: గిరిజన సహకార సంస్థ (జిసిసి ) 1000 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ గిరిజన ఉత్పత్తులను విస్తృతంగా మార్కెట్ చేయడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. జిసిసి ఏర్పాటై 60 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు.

02/01/2017 - 02:33

విజయవాడ (క్రైం), జనవరి 31: జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సు నిర్వహణకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర శాసనసభా స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు.

02/01/2017 - 01:15

విశాఖపట్నం, జనవరి 31: ప్రజల్లో పుస్తక పఠనం పట్ల ఆసక్తిని పెంపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ, ఎన్టీఆర్ ట్రస్టు సంయుక్తంగా విశాఖ ఎయు ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ఈ నెల 28 నుంచి నవ్యాంధ్ర పుస్తక సంబరాలు పేరిట పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా విశాఖలో మంగళవారం పుస్తక ప్రియుల పాదయాత్రను నిర్వహించారు.

02/01/2017 - 01:13

విజయవాడ, జనవరి 31: బకాయిపడ్డ కరవు భత్యం చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎపి ఎన్జీవో సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం ఎన్జీవో నేతలు ఆశోక్‌బాబు, తదితరులు ఆయనను కలిశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

02/01/2017 - 01:13

న్యూఢిల్లీ, జనవరి 31: బడ్జెట్‌లో అమరావతి రైతులకు శుభవార్త ఉంటుందని ఆశిస్తున్నట్లు కేంద్రమంత్రి సుజనా చౌదరి తెలిపారు. అమరావతి ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ చేసిన రైతులకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

02/01/2017 - 01:11

హైదరాబాద్, జనవరి 31: ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నేను కనీసం ట్విట్టర్‌లోనైనా స్పందిస్తున్నా, మన ఎంపీలు పార్లమెంటులో మాట్లాడడం లేదు..’ అని జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ విమర్శించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే ప్రజలు తిరగబడతారని ప్రభుత్వంలో ఉన్న వారు తెలుసుకోవాలని ఆయన హెచ్చరించారు.

Pages