S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/24/2016 - 04:53

విజయవాడ, డిసెంబర్ 23: రాష్ట్రంలోని సామాజిక మంచినీటి పథకాలు (సిడబ్ల్యుఎస్)ల నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. రక్షిత మంచినీటి పథకాల నిర్వహణ బాధ్యతలను డ్వాక్రా సంఘాలకు అప్పగించనున్నారు. ఈమేరకు ప్రతిపాదనలను త్వరలో జరగనున్న రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో చర్చకు పెట్టనున్నారు.

12/24/2016 - 04:52

తిరుపతి, డిసెంబర్ 23: తిరుపతి-కడప మార్గమధ్యంలోని వెలుగుదోన వద్ద ఉన్న జ్యోతి కాలనీ సమీప అటవీప్రాంతంలో గురువారం టాస్క్ఫోర్స్, అటవీశాఖ అధికారులపై ఎర్రకూలీలు రాళ్ళ దాడి చేశారు. దాదాపు 150 మంది కూలీలు తమకు ఎదురుపడ్డ టాస్క్ఫోర్స్ సిబ్బందిపై ఒక్కసారిగా రాళ్ళవర్షం కురిపించి పోలీసులు తేరుకునేలోగా సంఘటనా స్థలం నుంచి పారిపోయారన్నారు.

12/24/2016 - 04:52

తిరుపతి, డిసెంబర్ 23: రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ శ్రీవారి దర్శనార్థం ఈనెల 28న ఒక్క రోజు పర్యటనకు తిరుమలకు రానున్నారు. రాష్టప్రతి 28వ తేదీ ఉదయం 9.50 గంటలకు ప్రత్యేక విమానంలో హకీంపేట్ విమానాశ్రయం నుంచి బయలుదేరి ఉదయం 11 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి కారులో బయలుదేరి తిరుచానూరుకు చేరుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు.

12/24/2016 - 04:51

జంగారెడ్డిగూడెం, డిసెంబర్ 23: జనవరి 2నుండి నిర్వహించబోయే జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో రాష్ట్రంలో దరఖాస్తు చేసుకున్న 4.8 లక్షల మందికి రేషన్ కార్డులు మంజూరు చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో శుక్రవారం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో మంత్రి పరిటాల సునీత పాల్గొన్నారు.

12/24/2016 - 04:51

సీతంపేట, డిసెంబర్ 23: శ్రీకాకుళం జిల్లా, ఏజెన్సీ ప్రాంతమైన సీతంపేట భారతీయ స్టేట్ బ్యాంక్‌లో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది.

12/24/2016 - 04:50

గుంతకల్లు, డిసెంబర్ 23: కదులుతున్న రైలులో ఓ టిటిఇ పబ్లిక్‌గా రాసలీలలు సాగించాడు. తాగిన మత్తులో ఓ మహిళతో బెర్త్‌పై రాసలీలలు సాగిస్తుండగా గమనించిన ప్రయాణికులు నిలదీయడంతో రైలు నుంచి దిగిపోయిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. టిటిఇ రాసలీలలను వీడియో, ఫొటోల్లో బంధించిన కొంతమంది ప్రయాణికులు వాటిని రైల్వే బోర్డుకు పంపి ఫిర్యాదు చేశారు.

12/24/2016 - 04:49

విజయవాడ, డిసెంబర్ 23: ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాల అమలుతీరును పర్యవేక్షించేందుకు జన్మభూమి కమిటీలు ఏర్పాటుచేస్తే తమిటి? అంటూ ప్రతిపక్షాలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన శుక్రవారం విలేఖర్లతో మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీల తరహాలో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేశామన్నారు.

12/24/2016 - 05:06

తిరుపతి, డిసెంబర్ 23: కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న స్వామీజికి ఆలయ అర్చకులు ఇస్తికపాల్ స్వాగతం పలికారు. జె ఇ ఓ శ్రీనివాసరాజు సాధరంగా ఆయన్ను ఆలయంలోకి ఆహ్వానించి స్వామి సన్నిధిలోకి తీసుకువెళ్ళారు. ఈసందర్భంగా స్వామీజి తన శిష్య బృందంతో కొన్ని నిమిషాల పాటు మూల విరాట్టును దర్శించుకున్నారు.

12/24/2016 - 05:05

విశాఖపట్నం, డిసెంబర్ 23: దక్షిణాఫ్రికా దేశానికి చెందిన రాయల్ కేప్ యాచ్ క్లబ్ నిర్వహిస్తున్న ‘కేప్ టు రియో 2017’లో పాల్గొనేందుకు భారత నౌకాదళానికి చెందిన సెయిలింగ్ బోట్ మదేయ్ కేప్‌టౌన్ హార్బర్‌కు శుక్రవారం చేరుకుంది.

12/24/2016 - 04:39

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: తెలుగు రాష్ట్రాలకు చెందిన స్వయంసహాయక బృందాలకు కేంద్ర అవార్డులును అందజేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం హుస్సేనాపురంలోని మీరా, తూర్పు గోదావరి జిల్లా ఐ పోలవరం మండలం భైరవపాలెంలోని శ్రీనివాస, అనంతవురం జిల్లా బికె సముద్రం మండలం సిద్దరాంపురంలోని మాధవరాజులు అవార్డులు అందుకొన్నారు.

Pages