S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/25/2016 - 04:50

రాజమహేంద్రవరం, డిసెంబర్ 24: ప్రైవేటు టిటిసిల ద్వారా ప్రత్యేక క్రాష్‌కోర్సు పూర్తి చేసిన అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఆదేశాలను కూడా ప్రాథమిక విద్యాశాఖ కమిషనరేట్ అధికారులు భేఖాతరు చేస్తున్నారు. న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేసినా ఎపిలోని విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో ఉపాధ్యాయ ఉద్యోగాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వారికి న్యాయం జరగలేదు.

12/25/2016 - 04:50

ఆదోని, డిసెంబర్ 24: తుంగభద్ర బోర్డు లెక్కలన్నీ తప్పులతడకలని ఆంధ్రా రైతులు ఆరోపిస్తున్నారు. దశాబ్దాలుగా ఆంధ్రా నీటివాటాలో కోత విధిస్తున్నారని, ఇదే మని ప్రశ్నోంచే నాథుడే లేకపోవడంతో వారు జల చౌర్యానికి అడ్డూఅదుపులేకుండా పోయిందని అంటున్నారు. జలాశయం నీటిని నిబంధనల మేరకు ఆంధ్రాకు విడుదల చేయకుండా కర్నాటకలోని పొలాలు, ఫ్యాక్టరీలకు మళ్లిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

12/25/2016 - 03:11

సింహాచలంలో కృతయుగ దైవం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామిని శనివారం గుంటూరు
విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ అధికారులు
విశ్వంజీకి స్వాగతం పలుకుతున్న దృశ్యం

12/25/2016 - 03:08

విశాఖపట్నం, డిసెంబర్ 24: తెలుగింటి ఆడపడచుల ఆత్మగౌరవం పేరుచెప్పుకుంటున్న టిడిపి పాలనలో సొంత పార్టీ మహిళా సభ్యులకే రక్షణ కరువైందని వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజా ధ్వజమెత్తారు.

12/25/2016 - 03:06

కాకినాడ, డిసెంబరు 24: ఆర్‌ఎస్‌ఎస్ ఆంధ్రప్రాంత కార్యవాహ (కార్యదర్శి) నముడూరి రవి శనివారం తెల్లవారుజామున అకాల మరణం చెందారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో ఆయన గుండెపోటుతో మరణించారు. నముడూరి రవి ఆకస్మిక మృతితో ఆర్‌ఎస్‌ఎస్ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. రవి బాల స్వయం సేవక్‌గా ఆర్‌ఎస్‌ఎస్‌లోకి వచ్చి, తర్వాత అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

12/25/2016 - 03:04

కర్నూలు, డిసెంబర్ 24: భూ సేకరణ నష్టపరిహారం కేసులకు సంబంధించి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసే విషయంపై మరోమారు సీఎం చంద్రబాబుతో చర్చిస్తానని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రి కెయి కృష్ణమూర్తి అన్నారు. కర్నూలులో శనివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి న్యాయవాద సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులు కెయి కృష్ణమూర్తికి వినతిపత్రం సమర్పించారు.

12/25/2016 - 03:03

చిత్తూరు, డిసెంబర్ 24: పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించే విధంగా న్యాయమూర్తులు చొరవ చూపాలని, చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని హైకోర్టు జడ్జి ప్రవీణ్‌కుమార్ సూచించారు. శనివారం చిత్తూరు జిల్లాకోర్టులో న్యాయమూర్తులతో ఆయన సమావేశమయ్యారు.

12/25/2016 - 03:02

తిరుపతి, డిసెంబర్ 24: తిరుపతి కొర్లగుంట జంక్షన్ వద్ద శనివారం ఉదయం అదుపుతప్పిన మినీ వ్యాన్ ప్రజలపైకి దూసుకెళ్లింది. రోడ్డుపక్కన నడుస్తున్న వారిని ఢీకొనడమేకాకుండా ఓ ఆటోను, ద్విచక్రవాహనాన్ని ఢీకొని విద్యుత్ స్థంబాన్ని ఢీకొని ఆగింది. ఊహించని ఈ సంఘటనతో ఆ ప్రాంతం ఒక్కసారిగా అరుపులు, కేకలతో దద్దరిల్లిపోయింది.

12/25/2016 - 03:02

కర్నూలు, డిసెంబర్ 24: భూ సేకరణ, ఐపి పిటిషన్లు, చిట్‌ఫండ్ వివాదాలు, వక్ఫ్‌ఆస్తుల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయదలిచిన ప్రత్యేక కోర్టులు ఆయా కక్షిదారులను ఇబ్బందులకు గురి చేసేవిగా ఉన్నాయని రాష్ట్రంలోని పలువురు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ సహాయం పొందాలన్న ప్రజల ప్రాథమిక హక్కుకు ఇది భంగకరమని వారు అభిప్రాయపడ్డారు.

12/24/2016 - 04:55

విజయవాడ, డిసెంబర్ 23: ఫిన్‌టెక్ (ఫైనాన్షియల్ టెక్నాలజీ)తో ఆర్థిక రంగంలో సంస్కరణలు చోటుచేసుకుంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన 197వ రాష్టస్థ్రాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖలో ఫిన్‌టెక్ టవర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. నగదు రహిత లావాదేవీల సమయంలో హ్యాకింగ్ సమస్యను అధిగమించేందుకు ఫిన్‌టెక్ సేవలను వినియోగించుకుంటున్నామన్నారు.

Pages