S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/06/2016 - 03:19

హైదరాబాద్, నవంబర్ 5: వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు వాతలు పెట్టేందుకు రాష్ట్ర డిస్కాంలు సమాయత్తమవుతున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపిఇఆర్‌సి)కి వార్షిక రెవెన్యూ నివేదికలను తయారు చేసేందుకు డిస్కాంలు, ఏపి ట్రాన్స్‌కో కసరత్తు ప్రారంభించాయి. రాష్ట్రంలో రెవెన్యూకు, ఖర్చుకు మధ్య లోటు దాదాపు రూ.7500 నుంచి రూ 8 వేల కోట్లు ఉంటుందని అంచనా.

11/06/2016 - 03:19

రాజమహేంద్రవరం, నవంబర్ 5: న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం వుందని, హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వమే స్పందిస్తుందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కారెం శివాజీ అన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా శివాజీ నియామకం చెల్లదని హైకోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆయన శనివారం రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

11/06/2016 - 03:17

విశాఖపట్నం, నవంబర్ 5: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమేపి బలహీనపడుతోంది. ఈ వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళా ఖాతం నుంచి వాయువ్య బంగాళాఖాతంలోకి శనివారం మారింది. ఇది కోల్‌కత్తాకు ఆగ్నేయంగా 410 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది మరింత బలహీనపడి ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తుంది. దీని ప్రభావం వలన కోస్తాలో ఒకటి, రెండు చోట్ల సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

11/06/2016 - 03:02

విశాఖపట్నం, నవంబర్ 5: పట్ట్భద్రుల నియోజకవర్గానికి సంబంధించి వచ్చే మార్చిలో జరగనున్న ఎన్నికలకు ఓట్ల నమోదు సమయం శనివారం సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది. అయితే, రాత్రి ఏడు గంటల సమయంలో ఒక కళాశాల యాజమాన్యం ఒకేసారి ఏడు వేల దరఖాస్తులను తీసుకువచ్చి విశాఖ ఆర్డీఓకు ఇవ్వడానికి ప్రయత్నించింది.

11/06/2016 - 03:00

విజయవాడ, నవంబర్ 5: ఒంగోలు, పుంగనూరు పశు జాతుల పరిరక్షణకు, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్‌శాఖల మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రాష్ట్రంలో ఈ జాతుల పశువులు అంతరించిపోకూడదనే ఉద్దేశంతో, రైతులకు ఈ పశువుల ద్వారా ఆదాయం ఇచ్చే వనరుగా చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు.

11/06/2016 - 02:45

సూళ్లూరుపేట, నవంబర్ 5: పార్శిల్ లారీల్లో విదేశీ మద్యాన్ని తరలిస్తుండగా చెక్‌పోస్టు అధికారులు అనుమానంతో తనిఖీచేసి దాన్ని స్వాధీనంచేసుకున్న సంఘటన ఆంధ్రా,తమిళనాడు సరిహద్దు తడ చెక్‌పోస్టులో శనివారం వెలుగుచూసింది. క్రాంతి పార్శిల్ లారీ మాటున విదేశీ మద్యాన్ని కూడా ట్రాన్స్‌పోర్టు లారీలు తరలిస్తున్నాయి. ప్రతిరోజు ఈ తంతు జరుగుతోంది.

11/06/2016 - 02:43

విజయవాడ, నవంబర్ 5: రహదారుల నిర్మాణంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. 2029 నాటికి అన్ని కాలాలకు అనువైన రోడ్ల సౌకర్యం కల్పించేందుకు రంగం సిద్ధమైంది. రాజధాని ప్రాంతం నుంచి అన్ని ప్రాంతాలకు వెళ్లే రోడ్లతో అనుసంధానం చేయాలని సంకల్పించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 22 వేల కిలోమీటర్ల సిసి రోడ్లు ఉన్నాయి.

11/06/2016 - 02:42

విజయవాడ, నవంబర్ 5: ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలి, కార్యాచరణ స్వచ్ఛంగా ఉండాలి, వాటిని స్వచ్ఛందంగా అమలు చేయాలి, అప్పుడే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్ సాకారం అవుతుందని’ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పారిశుద్ధ్యం, అంటువ్యాధుల నియంత్రణపై ఉండవల్లిలోని తన నివాసం నుంచి వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, పంచాయతీ రాజ్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

11/06/2016 - 02:41

విజయవాడ, నవంబర్ 5: పఠాన్ కోట్ బాంబు పేలుడు బాధితుడు, శ్రీకాకుళం జిల్లా బిడ్డ శ్రీరాములుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.10 లక్షల సహాయం అందజేశారు. శనివారం ఉదయం ఉండవల్లిలోని నివాసంలో తనను కలిసిన శ్రీరాములుకు రూ.10 లక్షల చెక్‌ను స్వయంగా అందజేశారు. అతడి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇళ్ల స్థలం మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి తగిన స్థలాన్ని గుర్తించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

11/06/2016 - 02:37

కర్నూలు, నవంబర్ 5 : తన ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాల తన పాలనపై ప్రజాభిప్రాయాన్ని సర్వేల ద్వారా సేకరించిన ఆయన ప్రజల్లో ఉన్న వ్యతిరేకతపై స్పష్టతకు వచ్చినట్లు అర్థమవుతోంది.

Pages