S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/05/2016 - 01:34

విశాఖపట్నం, నవంబర్ 4: పశ్చిమ బంగాళాఖాతంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనుంది. ప్రస్తుతం ఈ వాయుగుండం విశాఖకు ఆగ్నేయంగా 210 కిలో మీటర్ల దూరంలో, అలాగే విశాఖకు దక్షిణ నైరుతి దిశగా 490 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలియచేసింది. ఇది నెమ్మదిగా బంగ్లాదేశ్ వైపు కదులుతోంది.

11/05/2016 - 01:33

విశాఖపట్నం, నవంబర్ 4: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని పట్టుపడుతున్న ప్రతిపక్ష నాయకుడు జగన్ ఇదే అంశంపై రాష్ట్ర నలుమూలలా యువభేరి పేరుతో సభలు నిర్వహించారు. జగన్ డిమాండ్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదు. హోదాకు దీటుగా ప్యాకేజీ ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకొంది. ఇచ్చినంత తీసుకోపోతే నష్టపోతామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిందాంతో సరిపెట్టుకున్నారు.

11/04/2016 - 03:46

శ్రీకాకుళం/విజయనగరం , నవంబర్ 3: ఎఒబి సరిహద్దులో మావోయిస్టులు గురువారం నిర్వహించిన బంద్ ప్రభావం స్పష్టంగా కనబడింది. మల్కన్‌గిరిలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ మావోయిస్టులు ఐదు రాష్ట్రాల బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

11/04/2016 - 03:41

విజయనగరం, నవంబర్ 3: జిల్లాలోని పార్వతీపురం మండలం బడిదేవరకొండకు సమీపంలో ఉన్న ఎంఎస్‌పి గ్రానైట్స్‌కు అటవీశాఖ అనుమతుల కోసం డిఎఫ్‌ఒ ఎ.రమణమూర్తి, క్వారీ యజమాని పలనివేలు నుంచి రూ.5లక్షలు లంచం తీసుకుంటుండగా ఎసిబికి పట్టుబడ్డాడు.

11/04/2016 - 03:38

విజయవాడ, నవంబర్ 3: కార్తీక వన సమారాధన కార్యక్రమాలు భారీగా నిర్వహించాలని, ప్రకృతితో మనిషి అనుసంధానమయ్యే సమయం ఇదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో గురువారం ఆయన అటవీ శాఖ కార్యక్రమాలను సమీక్షించారు. రాజమహేంద్రవరంలో ఈ నెల 19న జరిగే కార్తీక వన సమారాధనలో తాను పాల్గొంటానని తెలిపారు.

11/04/2016 - 03:34

విశాఖపట్నం, నవంబర్ 3: దళారీ వ్యవస్థ నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఘాటుగా విమర్శించారు. విశాఖ బిజెపి కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుకు గిట్టుబాటు ధర లభించట్లేదని, అలాగే వినియోగదారులు అధిక ధరలకు సరకులు కొనుగోలు చేసుకునే దుస్థితికి ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు.

11/04/2016 - 03:32

పాడేరు/ జి.మాడుగుల, నవంబర్ 3: విశాఖ మన్యంలో బుధవారం రాత్రి మరో ఎన్‌కౌంటర్ త్రుటిలో తప్పింది. ఎఒబిలో గత నెల 24న జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ మావోయిస్టులు గురువారం ఐదు రాష్ట్రాల బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో మన్యంలో బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ మావోయిస్టులు ఏజెన్సీలోని పలుచోట్ల కరపత్రాలు వెదజల్లుతూ వాల్‌పోస్టర్లను అతికిస్తున్నారు.

11/04/2016 - 03:32

అమరావతి, నవంబర్ 3: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి రాజధాని నగరంలో పార్టీ ఆఫీసు, ఇంటికి భూమి దొరక్కుండా పోయింది. ఆ పార్టీ నేతలు కొద్దికాలం నుంచి పార్టీ ఆఫీసు, జగన్ ఇంటి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. అధికార పార్టీకి భయపడి వైసీపీకి స్థలం ఇవ్వాలంటేనే భయపడుతున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం..

11/04/2016 - 03:31

గుంటూరు, నవంబర్ 3: నవ్యాంధ్ర రాజధానిలో మూడు గ్రామాలను దత్తత తీసుకునేందుకు వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్) సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది.

11/04/2016 - 03:30

గుంటూరు, నవంబర్ 3: ఎఒబి ఎన్‌కౌంటర్.. బంద్‌కు మావోల పిలుపు.. హిట్‌లిస్టులో బాబు.. లోకేష్.. ఈ పరిస్థితుల్లో కాన్వాయ్ లేకుండానే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణించటం అధికార వర్గాలను విస్మయానికి గురిచేసింది.

Pages