S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/09/2019 - 23:14

న్యూఢిల్లీ, జూన్ 9: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) స్థాపన, అభివృద్ధిని ప్రోత్సహించాలని, తద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉపాధి అవకాశాల విస్తృతికి అవకాశాలు ఏర్పడతాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.

06/07/2019 - 23:10

ముంబయి, జూన్ 7: భవిష్యత్తులో ద్రవ్య లభ్యతపై ఆందోళనకర పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయన్న అంచనాలు వెలువడుతున్నప్పటికీ శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు గణనీయంగా పుంజుకున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాక్స్ బాగా లాభపడ్డాయి. ఇంట్రాడేలో 400 పాయింట్లు ఎగబాకిన సెనె్సక్స్ చివరికి 86.18 పాయింట్లు ఆధిక్యతతో 39,615.90 పాయింట్ల వద్ద స్థిరపడింది.

06/07/2019 - 04:22

విశాఖపట్నం: అద్భుతమైన రుచి, ప్రత్యేక అనుభూతిని పొందే అరకు కాఫీ ఇక నుంచి ఇన్‌స్టంట్ కాఫీ తరహాలో అంతర్జాతీయ మార్కెట్‌లోకి వెళ్ళనుంది. ఇప్పటికే ప్రపంచంలో పలు దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. డెహ్రాడూన్, రాంచీ, హైదరాబాద్, జయపూర్ నుంచి దాదాపు రెండు కోట్ల మేర ఇన్‌స్టంట్ కాఫీని కోరుతూ ఆర్డర్లు వచ్చాయి. దీంతో వీటిని సరఫరా చేసేందుకు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఏర్పాట్లు చేస్తోంది.

06/07/2019 - 00:24

న్యూఢిల్లీ, జూన్ 6: దేశంలో డిజిటల్ లావాదేవీలను మరింత విస్తృతం చేసే దిశగా ఆర్బీఐ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. నెఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారా లావాదేవీలు నిర్వహించే వారికి ఊరట కలిగించింది. నగదు బదిలీలపై ఇప్పటివరకు బ్యాంకులు వసూలు చేస్తున్న చార్జీలను రద్దుచేసింది. తక్షణమే ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించాలని బ్యాంకులను ఆదేశించింది.

06/06/2019 - 21:55

ముంబయి, జూన్ 6: దేశ ఆర్థిక స్థితిని బలోపేతం చేసే దృక్పథంతో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం రెపోరేట్లలో మరోమారు కోత విధించడం ద్వారా రుణాలపై వడ్డీ రేట్ల శాతాన్ని తొమ్మిదేళ్ల కనిష్టం 5.75 శాతానికి తగ్గించివేసింది. తద్వారా ద్రవ్య వినిమయ విధానంలో మార్పులు చేసింది. ప్రత్యేకించి సర్ధుబాట్లకు, భవిష్యత్తులో రేట్ల కోతకు అవకాశం కల్పించింది.

06/06/2019 - 21:53

న్యూఢిల్లీ, జూన్ 6: బీమా చేసుకోవడానికి ముందే సదరు వ్యక్తి వ్యాధి కలిగి ఉన్నాడనే అనుమానంతో అతడి క్లెయిమ్‌ను బీమా కంపెనీ నిరాకరించజాలదని నేషనల్ కన్స్యూమర్ డిస్పూట్స్ రిడ్రెసల్ కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ) స్పష్టం చేసింది.

06/06/2019 - 21:52

ముంబయి, జూన్ 6: మొండి రుణ బకాయిలు, నిరర్ధక ఆస్తులకు సంబంధించి రిజర్వు బ్యాంకు సరికొత్త మార్గదర్శకాలను రూపొందించింది. మూడు లేదా నాలుగు రోజుల్లో వాటిని విడుదల చేయనుందని ఆ బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం నాడిక్కడ తెలిపారు. గత ఏడాది ఫిబ్రవరి 2న ఈ విషయమై ఆర్బీఐ జారీ చేసిన సర్క్యులర్‌ను ఏప్రిల్ 2న సుప్రీం కోర్టు రద్దు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

06/06/2019 - 21:51

ముంబయి, జూన్ 6: దేశ ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు రిజర్వుబ్యాంక్ రెపోరేట్ల కోత విధించినప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం తీవ్ర నషాలపాలయ్యాయి. బ్యాంకింగ్, విద్యుత్ రంగాలు, కేపిటల్ గూడ్స్‌కు సంబంధించిన స్టాక్స్ భారీగా నష్టపోయాయి. బీఎస్‌ఈలో సెనె్సక్స్ 553.82 పాయింట్ల భారీ నష్టాన్ని నమోదు చేసింది. అలాగే ఎన్‌ఎస్‌ఈ లో నిఫ్టీ సైతం 177.90 పాయింట్లు కోల్పోయింది.

06/05/2019 - 22:31

నాసిక్, జూన్ 5: న్యూఢిల్లీ-వారణాసి మధ్య ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ విజయవంతం కావడంతో అదే తరహాలో మరికొన్ని రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగానే ముంబయి నుంచి పుణే వరకు వందే భారత్ తరహా రైలును నడపనున్నది. నాసిక్-వడోదర మధ్య కూడా మరో రైలు నడిపేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నాలు సఫలమైతే వచ్చే వారంలోనే ఈ ప్రత్యేక రైలు సర్వీసులు మొదలవుతాయి.

06/05/2019 - 22:22

న్యూఢిల్లీ, జూన్ 5: గత ఏడాది రూ.8,334 కోట్ల రూపాయల నష్టాల్లో కూరుకుపోయిన అలహాబాద్ బ్యాంక్ ఈ ఏడాది వాటినుంచి చాలా వరకు బయటపడే అవకాశాలున్నాయి. ప్రధానంగా రుణాల రికవరీకి బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయడంతోబాటు, ఇదివరకు ఉన్న లోటుపాట్లను సవరించుకునేందు విశేష కృషి చేస్తున్నట్టు ఆ బ్యాంకు వార్షిక నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి.

Pages