S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/05/2019 - 22:22

హాంకాంగ్, జూన్ 5: వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు అమెరికా ఫెడరల్ రిజర్వు పరోక్ష సంకేతాలు ఇవ్వడంతో బుధవారం ఆసియా స్టాక్ మార్కెట్ కోలుకోవవడమే కాకుండా లాభాల్లో నిలిచాయి. ఫెడరల్ రిజర్వు చేపడుతున్న పలు చర్యలు ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్‌లో ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వడ్డీ రేట్ల తగ్గింపుపై త్వరలోనే ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

06/05/2019 - 22:10

వాషింగ్టన్, జూన్ 5: భారత్‌లో వృద్ధి రేటు 2019-20 ఆర్థిక సంవత్సరానికి 7.5 శాతంగా ఉండబోతోందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.2గా నమోదైనట్టు తన తాజా నివేదికలో ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. ప్రభుత్వపరంగా నిధుల వినియోగం కొంత తగ్గినప్పటికీ పెట్టుబడులు విస్తారంగా రావడం భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిందని ఈ నివేదిక స్పష్టం చేసింది.

06/05/2019 - 04:45

ముంబయి: మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లోకి జారాయి. సెనె్సక్స్ 184.08 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 66.90 పాయింట్లు నష్టపోయింది. సెనె్సక్స్ ప్యాక్‌లో హీరోమోటోకార్ప్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఏసియన్ పెయింట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్ అత్యధికంగా 3.08 శాతం నష్టాలను సంతరించుకున్నాయి.

06/05/2019 - 03:49

దుబాయ్, జూన్ 4: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏ ఈ)లోని ఒక భారతీయుడికి 2.7 మిలియన్ డాలర్ల లాటరీ రూపంలో అదృష్టలక్ష్మి తలుపు తట్టింది. యూఏఈ మీడియా కథనం ప్రకారం...అక్కడ నివసిస్తున్న సంజయ్ నాథ్ ఆర్ అనే భారతీయుడి అబుదాబీలో కొంతకాలం కిందట ‘బిగ్ టికెట్’ పేరిట ఒక లాటరీ టికెట్ కొన్నాడు. ఇపుడు అదే టికెట్‌కు అదృష్టలక్ష్మి వరించింది.

06/05/2019 - 03:25

న్యూఢిల్లీ, జూన్ 4: భారత్‌కు చెందిన ప్రముఖ చమురు, సహజవాయుల ఉత్పత్తి సంస్థ (ఓఎన్‌జీసీ) రానున్న కొనే్నళ్లలో ఉత్పత్తిని, లాభాలను గణనీయంగా పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నా పరిస్థితులు అందుకు అనుకూలించేలా లేవని అంతర్జాతీయ సంస్థ ‘మూడీ’ అధ్యయన నివేదిక వెల్లడించింది.

06/05/2019 - 02:18

విజయవాడ (సిటీ), జూన్ 4: ఒకవైపు ఎండలు మండుతుంటే, మరోవైపు పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. ఇదే సమయంలో వంటగ్యాస్ ధరలు సైతం పెరుగుతున్నాయి. నిన్నమొన్నటి వరకు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో స్తబ్దుగా ఉన్న పెట్రో ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. రోజువారీ ధరల నిర్ణయాన్ని పెట్రోల్ ఉత్పత్తి సంస్థలకే కేంద్ర ప్రభుత్వం అప్పగించిన నేపథ్యంలో ఎన్నికల తరువాత రోజూ ధరలు పెరుగుతున్నాయి.

06/04/2019 - 05:24

హైదరాబాద్ : శ్రీగంథం, వెదురు, టేకు, సరుగుడు తదితర చెట్లను పెంచడం వల్ల రైతులకు మంచిలాభాలు వస్తాయని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. శ్రీగంథం తదితర మొక్కలు, చెట్లు పెంచడంపై రైతులకు అవగాహన కల్పించేందుకు సోమవారం ఇక్కడి ఉద్యాన శిక్షణా సంస్థలో ఒకరోజు అవగాహనా సదస్సు నిర్వహించారు.

06/04/2019 - 05:22

హైదరాబాద్, జూన్ 3: సింగరేణి ఏరియాలో కొత్త గనుల కోసం సేకరించిన భూములకు నష్టపరిహరం చెల్లించే విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని సంస్థ సీఎండీ శ్రీ్ధర్ జనరల్ మేనేజర్లను ఆదేశించారు. సోమవారం సింగరేణి భవన్‌లో ఏరియా మేనేజర్లతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న వర్షాకాలంలో బొగ్గు ఉత్పిత్తికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందస్తు జాగ్రతలు చేపట్టాలని ఆయన సూచించారు.

06/04/2019 - 04:56

ముంబయి: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ‘విదేశాలకు పారిపోయిన మోసగాడ’ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం ముంబయి హైకోర్టుకు తెలియజేశారు. చోక్సీ దాఖలు చేసిన రెండు పిటిషన్లను రద్దు చేయాల్సిందిగా ఆ అధికారులు సమున్నత న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్‌లో అభ్యర్థించారు.

06/04/2019 - 04:55

ముంబయి, జూన్ 3: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం మళ్లీ జీవితకాల గరిష్టాలను తాకాయి. బీఎస్‌ఈలో సెనె్సక్స్ 553 పాయింట్లు లాభపడగా, ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సైతం 166 పాయింట్లు ఎగబాకింది. ఓ వైపు బలహీన జీడీపీ గణాంకాలు ఉన్నా తదుపరి రిజర్వుబ్యాంకు రెపో రేట్ల కోత విధిస్తుందన్న అంచనాల క్రమంలో మదుపర్లు పెద్దయెత్తున వాటాలు కొనుగోళ్లు చేశారు.

Pages