S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/24/2019 - 02:54

అమెరికా ఎన్నికల వౌలిక అంశాలపై జరిగిన జాతీయ భద్రతా సబ్ కమిటీ సమావేశానికి హాజరైన కామనె్వల్త్ మసాచెసెట్స్

05/24/2019 - 02:52

దుబాయ్, మే 23: అరబ్ ఎమిరేట్స్‌లో భారత సంతతికి చెందిన ఓ విద్యార్థి విరాళాలు సేకరించి తన ఇంట్లోనే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి అందరి ప్రశంసలందుకుంటున్నాడు. నిరంతరం వీడియోగేమ్‌ల వంటి ప్రాపకాలతో కాలం వెళ్లదీసే అక్కడి యువతలోగ్రంథ పఠనం మీద ఆసక్తిని పాదుకొల్పేందుకు షార్జాకు చెందిన ఈ తొమ్మిదేళ్ల విద్యార్థి కాశీనాథ్ ప్రాణేష్ కృషి చేస్తున్నాడు.

05/24/2019 - 02:51

న్యూఢిల్లీ, మే 23: లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి విజయదుందుభి మోగిస్తున్నట్టు గురువారం నాటి ఫలితాల్లో వెల్లడి కావడంతో సామాజిక మాధ్యమాలు దీన్నో ‘సింహాసన క్రీడ’గా అభివర్ణించాయి. ప్రధాని మోదీని దిగ్విజేతగా పేర్కొన్నాయి. ప్రధానంగా ఈక్రీడకు ఓట్ల లెక్కింపు రోజును ఫైనల్స్‌గా పేర్కొన్నాయి.

05/24/2019 - 02:50

జెరూసలేం, మే 23: ఐదువేల సంవత్సరా ల క్రితం ఈజిప్టులో జనాదరణ పొందిన బీరు కు శాస్తవ్రేత్తలు పునసృష్టి కల్పించారు. అప్పట్లో ఆ బీరును ప్రజలు రోజూ తీసుకునే వారు. ప్రార్ధనల సందర్భంలోనూ సరఫరా చేసేవారు. అలాగే ఆరోగ్యపరంగానూ మంచిదని జనం నమ్మేవారు. అందుకే రోజువారీ ఆహారపుటలవాట్లలో బీరుకూడా చేరిపోయింది.

05/24/2019 - 02:49

సింగపూర్, మే 23: అమెరికా, చైనా మధ్య తలెత్తిన టారిఫ్ పెంపువివాదం ప్రపంచ షేర్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. గురువారం షేర్లు చతికిలపడ్డాయి. అలాగే యురోపియన్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌పోల్ సర్వేలు ప్రతికూల ప్రభావం చూపాయని విశే్లషకులు పేర్కొన్నారు. మాన్యుఫాక్చరింగ్, సర్వీసుల ఇండెక్స్ మందగించింది. ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 1.6 శాతానికి పడిపోయి 5,294.51 వద్ద నిలిచింది.

05/24/2019 - 02:49

టోక్యో జిల్లా కోర్టుకు హాజరైన నిస్సాన్ కంపెనీ మాజీ చైర్మన్ కార్లొస్ ఘోన్. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న ఆయన తన పదవీ విరమణ తర్వాత పొందిన మొత్తాల వివరాలను గోప్యంగా ఉంచి, ప్రభుత్వాన్ని తప్పుతోవ పట్టించాడనే ఆరోపణలు
ఎదుర్కొంటున్నారు. తన వ్యక్తిగత నష్టాలను కంపెనీ ఖాతా పుస్తకాల్లో నష్టాలుగా చూపి, డబ్బు తీసుకున్నట్టు
కూడా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు విచారణ టోక్యో కోర్టులో కొనసాగుతున్నది.

05/23/2019 - 14:01

ముంబయి: దేశంలో సుస్థిరమైన ప్రభుత్వానిక సంకేతాలు వెలువడటంతో స్టాక్ మార్కెట్లు సైతం కనీవినీ ఎరుగని స్థాయిలో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే నిఫ్టీ 20 వేల మార్క్‌ను, సెనె్సక్స్ 40 వేల మార్కును దాటేసాయి. నిఫ్టీ 270 పాయింట్ల లాభంతో 12,008 వద్ద, సెన్సెక్స్‌ 909 పాయింట్ల లాభంతో సెన్సెక్స్‌ 40,020 వద్ద ట్రేడవుతోంది.

05/22/2019 - 23:05

దుబాయ్, మే 22: ఇద్దరు భారతీయ వ్యాపారవేత్తలకు తొలిసారిగా 10 సంవత్సరాల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీసా దక్కింది. గల్ఫ్ దేశాల సుదీర్ఘ నివాస పథకం కింద ఈ ప్రత్యేక వీసా జారీ అయింది. ఈపథకం గల్ఫ్ దేశాల్లో పెట్టుబడిదారులు, విద్యార్థుల ప్రోత్సాహానికి ఉద్దేశించింది.

05/22/2019 - 22:34

ముంబయి, మే 22: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో ట్రేడింగ్ బుధవారం ఆశాజనకంగా సాగలేదు. అయితే దేశీయ మదుపరులు సానుకూలంగా స్పందించడంతో కొద్దిగా కోలుకొని స్వల్ప లాభంతో ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. బీఎస్‌ఈలో 140.41 పాయింట్లు మెరుగుపడిన సెనె్సక్స్ 39, 110.21 పాయింట్లకు చేరింది.

05/22/2019 - 22:32

న్యూఢిల్లీ, మే 22: వచ్చే నెల నుంచి దేశ విదేశీ మార్గాల్లో పలు కొత్త విమానాలను నడుపనున్నట్టు ఎయిర్ ఇండియా బుధవారం నాడిక్కడ తెలిపింది. వేసవి సెలవుల్లో సీట్లకు విశేషంగా పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపడుతున్నట్టు తెలిపింది. జూన్ 1 నుంచి ముంబయి-దుబాయ్-ముంబయి మార్గంలో వారానికి 3,500 సీట్లు అధికంగా ఆఫర్ చేయనున్నట్టు వివరించింది.

Pages