S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/03/2019 - 05:41

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సింగరేణి బొగ్గు అవసరాలు రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నందన రాబోవు రోజుల్లో ఉత్పత్తి, అమ్మకాలు రూ. 50 వేల కోట్లు లక్ష్యంగా ముందుకు సాగాలని సింగరేణి సీఎండీ శ్రీ్ధర్ సూచించారు. ఆదివారం హైదరాబాద్ సింగరేణి కేంద్ర కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.

06/02/2019 - 23:15

న్యూఢిల్లీ, జూన్ 2: భారత్‌లో తమ కంపెనీ వాణిజ్యం ప్రగతిపథంలో సాగుతోందని, వచ్చే పదేళ్ల కాలంలో తమ కంపెనీ మొత్తం అంతర్జాతీయ ఆదాయంలో భారత్ నుంచి 10 శాతంగా ఉండే అవకాశాలున్నాయన్న విశ్వాసాన్ని అమెరికన్ సాంకేతిక దిగ్గజం ‘సీస్కో’ వ్యక్తం చేస్తోంది. నెట్‌వర్క్ సమస్యల పరిష్కార సేవలందించే సిస్కో మన దేశంలోని పలు ప్రభుత్వ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది.

06/03/2019 - 04:57

న్యూఢిల్లీ: కేంద్రంలో వరుసగా రెండోమారు అధికారాన్ని చేజిక్కించుకున్న మోదీ సర్కార్ పలు భారీ సంస్కరణలను చేపట్టే అవకాశాలున్నాయని, వాటి ప్రభావం వచ్చే 25 ఏళ్ల వరకు ఉంటుందని అమెరికాకు చెందిన ‘ఇండియా-సెంట్రిక్ బిజినెస్ అడ్వొకసీ అండ్ స్ట్రేటజిక్ గ్రూప్’ అధికారి ఒకరు పేర్కొన్నారు.

05/31/2019 - 23:19

బీజింగ్: డిజిటల్ ఎకానమీలో 2025 నాటికి భారత్ ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశాలు బాగా ఉన్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఇక్కడ తెలియజేసింది. సేవల రంగంలో భారత్ ప్రాధాన్యాన్ని ఉటంకిస్తూ ఈ విధంగా పేర్కొంది. ఇండో-చైనా బిజినెస్ ఫోరంను ఉద్దేశించి భారత్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ సంగీత సక్సేనా ప్రసంగించారు.

05/31/2019 - 23:18

ముంబయి, మే 31: ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఆర్థికాభివృద్ధి మందగించే అవకాశాలు ఉండటంతో రిజర్వు బ్యాంకు రెపోరేట్లలో 25 బేసిస్ పాయింట్ల మేర కోత విధించే అవకాశాలున్నాయి. త్వరలో జరుగనున్న ద్రవ్య వినిమయ విధాన సమీక్షా సమావేశంలో ఈ రెపోరేట్ల కోత జరుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు.

05/31/2019 - 23:17

ముంబయి, మే 31: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మళ్లీ ఒడిదుడుకులకు లోనయ్యాయి. వాహన, ఆర్థిక రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. బీఎస్‌ఈలో సెనె్సక్స్ 118 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ సైతం 23 పాయింట్లు నష్టపోయి 12,000 మార్కు దిగువకు చేరింది. ఐతే వాణిజ్య వారం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే సెనె్సక్స్ 279.4 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 78.70 పాయింట్లు అదనంగా దక్కించుకుంది.

05/26/2019 - 22:47

గన్నవరం, మే 26: కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వాణిజ్యవేత్తల కలలు నేడు సాకారమయ్యాయని విజయవాడ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ మధుసూదనరావు అన్నారు. ఆదివారం ఉదయం విజయవాడ - ముంబై నూతన విమాన సర్వీసును ఆయన జ్యోతి వెలిగించి లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ దేశ వాణిజ్య రాజధాని ముంబైకి నేరుగా విమాన సర్వీసు నడపాలని ఈప్రాంత వాణిజ్యవేత్తలు కోరుతున్నారన్నారు.

05/26/2019 - 22:31

న్యూఢిల్లీ, మే 26: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రీఫండింగ్‌కు సంబంధించిన మంజూర్లు, ప్రాసెసింగ్ పనులు నిర్వహించేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది.

05/31/2019 - 16:05

ముంబయి, మే 24: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం మళ్లీ దూకుడును ప్రదర్శించాయి. సెన్సెక్స్ 623 పాయింట్లు అదనంగా లాభపడి 39,434.72 పాయింట్ల రికార్డు స్థాయి గరిష్టానికి చేరింది. సార్వత్రిక ఎన్నికల బరిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ దిగ్విజయం సాధించి అధికారాన్ని నిలుపుకోవడంతో హామీ మేరకు స్థిరమైన విధాన నిర్ణయాలు జరుగుతాయన్న నమ్మకం మదుపర్లలో పెరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

05/24/2019 - 02:56

ముంబయి: భారత స్టాక్ మార్కెట్లు గురువారం ఎన్నడూ లేని రీతిలో లాభాల బాటపట్టి, ఆతర్వాత అనూహ్యంకా పతనమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో, ఒకానొక దశలో వేయి పాయింట్లకు పైగా పెరిగిన సెనె్సక్స్ సూచీ 40 వేల పాయింట్ల మైలురాయిని అధిగమించింది. దీనితో బీఎస్‌ఈలో కొత్త రికార్డు నమోదైవుతుందనే అభిప్రాయం బలపడింది.

Pages