S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/22/2019 - 22:29

న్యూఢిల్లీ, మే 22: బులియన్ మార్కెట్ బుధవారం నష్టాల బాట పడకుండా బయటపడి ఊపిరి పీల్చుకుంది. బంగారం ధర స్వల్పంగా పెరిగింది కానీ, వెండి ధర మాత్రం పతనమైంది. బుధవారం ఉదయం స్వల్ప లాభాలను ఆర్జించింది. 10 గ్రాముల బంగారం ధర కేవలం 10 రూపాయ లు పెరిగి 32,680 రూపాయలకు చేరింది. ఆ తర్వాత అదే ధర స్థిరంగా కొనసాగింది. కాగా, కిలో వెండి ధర మొదటి నుంచే స్వల్పంగా దిగజారింది.

05/22/2019 - 22:28

టోక్యో, మే 22: చైనాకు చెందిన ‘హవాయ్’ కంపెనీ ద్వారా తయారవుతున్న కొత్త సెల్‌ఫోన్లను తమ మార్కెట్‌లో ప్రవేశపెట్టడాన్ని ఆలస్యం చేయనున్నట్టు జపాన్‌కు చెందిన రెండు అగ్ర మొబైల్ ఫోన్ మార్కెటింగ్ సంస్థలు బుధవారం నాడిక్కడ ప్రకటించాయి. చైనాకు చెందిన టెలికాం టెక్ దిగ్గజం హవాయ్‌పై అమెరికా అంక్షల నేపథ్యంలో జపాన్ కంపెనీల ప్రకటన ప్రాథాన్యతను సంతరించుకుంది.

05/22/2019 - 04:39

మరో 24 గంటల్లో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. విజేతలకు ఇది ఉత్సవ సమయం. ఆ ఆనందాన్ని పంచుకోవాలంటే మిఠాయిలను పంచడాన్ని మించిన మార్గం లేదు. ఈ బిగ్ డే కోసం భారీగా లడ్డూల తయారీలో తలమునకలైన భటిండా వర్తకులు

05/22/2019 - 01:29

విజయవాడ (సిటీ), మే 21: మధురమైన మామిడి పండ్లు ధరల విషయానికొస్తే పులుపునే రుచి చూపిస్తున్నాయి. మండు వేసవిలోనూ తియ్యని రుచులు అందించే మామిడి దిగుబడి తగ్గడం, గిరాకీ పెరగడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు అందనంత దూరమైంది. మామిడి పండించే రైతులకు మాత్రం గిట్టుబాటు ధరలు లభించడం లేదు గానీ వ్యాపారులకు మాత్రం కాసుల పంట పండిస్తోంది.

05/22/2019 - 00:57

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై అప్పు్భరం మొత్తం రూ.1,80,000 కోట్లకు చే రిందని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కే. రామకృష్ణారావు తెలిపారు. సచివాలయంలో మంగళవా రం జరిగిన సమావేశంలో, మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ, నియమావళికి లోబడే అప్పు చేస్తున్నామన్నారు. ఐదేళ్లలో చేసిన అప్పు రూ.లక్ష కోట్లని వివరించారు.

05/21/2019 - 22:54

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,100.00
8 గ్రాములు: రూ.24,800.00
10 గ్రాములు: రూ. 31,000.00
100 గ్రాములు: రూ.3,10,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,315.508
8 గ్రాములు: రూ. 26,524.064
10 గ్రాములు: రూ. 33,155.08
100 గ్రాములు: రూ. 3,31,550.8
వెండి
8 గ్రాములు: రూ. 321.92

05/21/2019 - 22:54

ముంబయి, మే 21: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల రికార్డు స్థాయి పరుగుకు మంగళవారం బ్రేక్ పడింది. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే పూర్తి విరుద్ధమైన ఫలితాలొచ్చాయి. మదుపర్లు భారీగా లాభాల స్వీకరణకు, వాటాల విక్రయాలకు పాల్పడడంతో రెండు సూచీలూ భారీ నష్టాల పాలయ్యాయి. బీఎస్‌ఈలో సెనె్సక్స్ 383 పాయింట్లు కోల్పోగా, ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ 119 పాయింట్లు నష్టపోయింది.

05/21/2019 - 03:49

రెండోసారి కూడా మోదీ సర్కారు కేంద్రంలో అధికారంలోకి రాబోతుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో సోమవారం సెనె్సక్స్ రికార్డు స్థాయిలో పరుగులు పెట్టింది. ఒక్కసారిగా 1422 పాయింట్లు పెరిగి 39,352,67కు చేరుకుంది. నిఫ్టీ కూడా 427 పాయింట్లు పెరగడం గత పదేళ్ళలో ఇదే మొదటిసారి. బీఎస్‌ఈ సెనె్సక్స్ ఇంత భారీగా పెరగడం అనేది గత ఆరేళ్ళలో ఇదే మొదటిసారి.

05/20/2019 - 23:25

హైదరాబాద్, మే 20: ఈనెల 23వ తేదీన లోక్‌సభ ఓట్ల లెక్కింపు సందర్భంగా జంటనరాల్లో మద్యం అమ్మకాలు ఉండవు. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సోమవారం వెల్లడించారు. 23న ఎక్కకడైనా పార్టీల కేడర్ గుంపులుగా చేరి హంగామా చేయడానికి ప్రయత్నిస్తే అదుపులోకి తీసుకుంటామన్నారు. 23న ఉదయం నుంచి 24 ఉదయం 6 గంటల వరకు ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తారు.

05/20/2019 - 22:56

ముంబయి, మే 20: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రాటిక్ అలయెన్స్ (ఎన్‌డీఏ) కేంద్రంలో మళ్లీ తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్‌పోల్ అంచనాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీ లు సోమవారం దూకుడును ప్రదర్శించి రికార్డు స్థాయి ఆధిక్యతను నమోదు చేశాయి. సెనె్సక్స్ ఏకంగా 1,422 పాయింట్లు ఎగబాకగా, ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ 421 పాయింట్ల ఆధిక్యతకు చేరింది.

Pages