S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/16/2019 - 04:33

ముంబయి: అంతర్జాతీయంగా నెలకొన్న మిశ్రమ పరిస్థితుల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మళ్లీ నష్టాల్లోకి దిగజారాయి. బీఎస్‌ఈలో సెనె్సక్స్ 203.65 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ సైతం 11.200 పాయింట్ల దిగువకు చేరింది. మార్కెట్ల అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని విదేశీ మదుపర్లు వాటాల విక్రయాలకు పాల్పడ్డారు.

05/15/2019 - 23:10

న్యూఢిల్లీ, మే 15: ఆన్‌లైన్‌లో కిరాణా వస్తువుల రీటెయిల్ వ్యాపారం సాగించే ‘గ్రాఫర్స్’ దాదాపు రూ. 1400 కోట్లు (200 మిలియన్ డాలర్లు) సమీకరించినట్టు బుధవారం ఇక్కడ ప్రకటించింది. సాఫ్ట్‌బ్యాంకు విజన్ ఫండ్ నేతృత్వంలో ఈ నిధుల సమీకరణ చేసినట్టు ఆ కంపెనీ తెలిపింది.

05/15/2019 - 23:05

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,160.00
8 గ్రాములు: రూ. 25,280.00
10 గ్రాములు: రూ. 31,600.00
100 గ్రాములు: రూ. 3,16,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,379.679
8 గ్రాములు: రూ. 27,037.432
10 గ్రాములు: రూ. 33,796.79
100 గ్రాములు: రూ. 3,37,967.9
వెండి
8 గ్రాములు: రూ. 322.00

05/15/2019 - 23:05

న్యూఢిల్లీ, మే 15: టెలికాం వౌలిక వసతుల కల్పన విభాగం రైల్‌టెల్ కార్పొరేషన్‌ను ‘ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్’ (ఐపీఓ) పరిధిలోకి తీసుకువచ్చి దాదాపు రూ. 300 కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి 2018-19 ఆర్థిక సంవత్సర అకౌంట్ పుస్తకాలను శీఘ్రగతిన తుదిరూపానికి తీసుకురావాల్సిందిగా రైల్‌టెల్ కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

05/15/2019 - 23:09

ప్యారిస్, మే 15: అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేయడం, ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించడం వంటి సంక్షోభాల నేపథ్యంలో ఇరాన్‌కు ముడి చమురు సరఫరా నిలిపి వేసినట్లు అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ) ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు డిమాండ్ కోసం ఉత్పత్తిని ఒపీఇసీ (ఒపెక్) తగ్గించింది.

05/15/2019 - 03:17

న్యూఢిల్లీ: బహుళార్థ సంబంధ వాణిజ్య విధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు 23 డబ్ల్యుటీవో సభ్య దేశాల రెండు రోజుల సమావేశం దోహదం చేస్తుందని భారత్ వ్యాఖ్యానించింది. ఈ అంతర్జాతీయ స్థాయి సమావేశం మంగళవారంతో ఇక్కడ ముగిసింది. కాగా డబ్ల్యుటీవోలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాల సూచనలు సైతం తోడ్పడతాయన్న ఆశాభావాన్ని భారత్ ఈ సందర్భంగా వ్యక్తం చేసింది.

05/14/2019 - 22:42

ముంబయి, మే 14: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఎట్టకేలకు తొమ్మిది రోజుల నష్టాల బాటనుంచి గట్టెక్కాయి. బీఎస్‌ఈలో సెనె్సక్స్ 227 పాయింట్లు లాభపడగా, ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ 74 పాయింట్లు ఎగబాకింది. ప్రధానంగా పార్మా, బ్యాంకింగ్, విద్యుత్ రంగాలు లాభాలను సంతరించుకున్నాయి. సెనె్సక్స్ ప్యాక్‌లో రిలయన్స్ హెవీవెయిట్స్ పరిశ్రమలు, ఐటీసీ, ఎస్‌బీఐ ప్రధానంగా స్టాక్ మార్కెట్లు కోలుకోవడానికి దోహదం చేశాయి.

05/14/2019 - 22:42

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,040.00
8 గ్రాములు: రూ. 24,320.00
10 గ్రాములు: రూ. 30,400.00
100 గ్రాములు: రూ. 3,04,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,218.00
8 గ్రాములు: రూ. 25,744.00
10 గ్రాములు: రూ. 32,180.00
100 గ్రాములు: రూ. 32,1800.00
వెండి
8 గ్రాములు: రూ. 323.20

05/14/2019 - 22:41

న్యూఢిల్లీ, మే 14: తక్కువ ధరల ఇంధనం, తయారీ వస్తువులపై గడచిన ఏప్రిల్ నెలలో టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం 3.07 శాతానికి తగ్గింది. ఓ వైపు ఆహార వస్తువుల ధరలు అధికంగా ఉన్నప్పటికీ ఇలాద్రవ్యోల్బణం సరళతరం కావడం విశేషం. టోకు ధరల గణాంకాల ప్రాతిపదికపై ద్రవ్యోల్బణం మార్చి నెలలో 3.18 శాతంగా ఉంది. అంతకు ముందు ఫిబ్రవరిలో 2.93 శాతంగా ఉంది. కాగా 2018 ఏప్రిల్ నెలలో ఈ ద్రవ్యోల్బణం 3.62 శాతంగా నమోదైంది.

05/14/2019 - 22:41

న్యూఢిల్లీ, మే 14: ప్రభుత్వ రంగంలోని ఇండియన్ బ్యాంక్ గడచిన ఆర్థిక సంవత్సర నాల్గవ త్రైమాసిక ఫలితాలను మంగళవారం వెలువరించింది. ఈఏడాది మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికి ఈ బ్యాంకు రూ. 189.77 కోట్ల నష్టాలను నమోదు చేసింది. ప్రధానంగా మొండి రుణాల కారణంగా బ్యాంకు ఈ పరిస్థితికి చేరగా ఆర్థికంగా బలోపేతం కావడానికి కొంత ప్రభుత్వ సాయాన్ని ఈ బ్యాంకు ఆశిస్తోంది.

Pages