S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/14/2019 - 03:55

హైదరాబాద్ / రామగిరి: తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గడచిన ఐదేళ్ల కాలంలో అత్యద్భుత ప్రగతిని సాధించి రాష్ట్రంలోనే కాదు దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలకే తలమానికంగా నిలిచింది. ముఖ్యంగా అమ్మకాలు, లాభాలలో తన చరిత్రలోనే ఆల్‌టైం రికార్డుగా అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసి దేశంలోని 8 మహారత్న కంపెనీలు సాధించిన దాని కన్నా ఎంతో ఎక్కువ సాధించి తన సత్తాను చాటుకొంది.

05/13/2019 - 22:37

ముంబయి, మే 13: వరుసగా ఎనిమిది సెషన్స్ నష్టాలను ఎదుర్కొన్న భారత స్టాక్ మార్కెట్ ఈవారం మొదటి రోజున కూడా అదే దారిలో నడిచింది. అంతర్జాతీయ సూచీలు ప్రతికూలంగా మారడంతో, ఏ మాత్రం కోలుకోలేకపోయింది. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 372.17 పాయింట్లు పతనమై, 37,090 పాయింట్లకు చేరింది.

05/13/2019 - 22:35

న్యూఢిల్లీ, మే 13: విద్యుదుత్పాక ప్లాంట్లకు పెరిగిన ఇంధన అవసరాలకు దృష్టిలో ఉంచుకుని బొగ్గు గనుల ప్రాజెక్టులను మరింతగా విస్తరించాలని సింగరేణి కాలరీస్ కో లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) నిర్ణయించింది. తెలంగాణలోని కళ్యాణి ఖని-6 ఇన్‌క్లైన్ బ్లాక్‌తో సహా పలు గనుల్లో ముందస్తు తవ్వకం పనులు చేపట్టేందుకు ఆసక్తిగల (ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్) సంస్థలను ఆహ్వానించింది.

05/13/2019 - 22:34

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,120.00
8 గ్రాములు: రూ. 24,960.00
10 గ్రాములు: రూ. 31,200.00
100 గ్రాములు: రూ. 3,12,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,336.898
8 గ్రాములు: రూ. 26,695.184
10 గ్రాములు: రూ. 33,368.98
100 గ్రాములు: రూ. 3,33,689.8
వెండి
8 గ్రాములు: రూ. 322.80

05/13/2019 - 22:34

న్యూఢిల్లీ, మే 13: దేశంలో అత్యంత ఐశ్వర్య వంతుడైన ముఖేష్ అంబానీ నేతృత్వంలో నడుస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆన్‌లైన్ రిటైల్ మార్కెట్లోకి ప్రవేశించడం ద్వారా డిజిటలైజ్డ్ రీటైల్ స్టోర్లను గణనీయంగా విస్తరించనుంది.

05/13/2019 - 22:33

న్యూఢిల్లీ, మే 13: ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటీవో) పునర్విచారణ విభాగం (అప్పిలేట్ బాడీ)కి చెందిన వివాద పరిష్కార విధానం (డిస్య్పూట్ సెటిల్‌మెంట్ సిస్టం) నిర్వీర్యమైతే సంస్కరణల సమతుల్యానికి విఘాతం ఏర్పడుతుందని భారత్ సోమవారం వ్యాఖ్యానించింది. ఇందువల్ల అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థికాభివృద్థికి ఆటంకం కలుగుతుందని పేర్కొంది.

05/12/2019 - 23:29

న్యూఢిల్లీ: దేశంలోని వివిధ థర్మల్ స్టేషన్లలో బొగ్గు నిల్వలు భారీగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్స రం చివరి మాసమైన మార్చిలో నిల్వ లు రికార్డు స్థాయిలో 3.46 కోట్ల టన్నులకు చేరుకున్నాయి. గత ఏడాది మార్చి మాసంలో ఇది 2.13 కోట్ల టన్నులు మాత్రమే. ఆతర్వాత వరుసగా రెండు నెలలు మరింత తగ్గి, 2.06, 1.91 కోట్ల టన్నులుగా నమోదైంది. గత ఏడాది జూన్ మాసంలో కొంత మెరుగు పడి, 2.00 కోట్ల టన్నులకు చేరింది.

05/12/2019 - 23:27

న్యూఢిల్లీ, మే 12: వరుసగా ఎనిమిది రోజులపాటు తీవ్ర ఒత్తిడికి గురైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారం అంతర్జాతీయ మార్కెట్ స్థితిగతులు, కార్పొరేట్ సంస్థల త్రైమాసిక ఆర్జనలు, స్థూల ఆర్థిక గణాంకాలపై ఆధారపడి కదలాడుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తీరు, అస్థిరత్వాన్ని కూడా మదుపర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు.

05/12/2019 - 23:26

న్యూఢిల్లీ, మే 12: విదేశాలకు ఎగుమతి చేసేందుకు దేశంలో ఇంజనీరింగ్ వస్తువులు తయారు చేస్తున్న కంపెనీలకు ఉక్కు లభ్యతపై కమిటీని వేయాలని కేంద్రం నిర్ణయించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పడుతుందని కేంద్ర ఉన్నతాధికారి ఒకరు పీటీఐతో మాట్లాడుతూ చెప్పారు. ఈ కమిటీ రెండు నెలల్లోగా కేంద్ర ఉక్కు, వాణిజ్య శాఖకు నివేదిక అందచేస్తుందని తెలిపారు.

05/12/2019 - 23:24

న్యూఢిల్లీ, మే 12: గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఏవిఏషన్ టర్బయిన్ ఫుయల్ (ఏఎఫ్‌టీ) వినియోగం 2,151 మెట్రిక్ టన్నులుగా నమోదైంది. కేంద్రం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకూ ఇంత మొత్తాన్ని వినియోగించారు. జనవరిలో 737 మెట్రిక్ టన్నులుకాగా, ఫిబ్రవరిలో వినియోగం 680 మెట్రిక్ టన్నులకు తగ్గింది. అయితే, మార్చి మాసంలో మళ్లీ పెరిగి, 734 మెట్రిక్ టన్నులకు చేరింది.

Pages