S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/21/2019 - 23:40

న్యూఢిల్లీ, జనవరి 21: సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా రాకేష్ శర్మను కొనసాగించాలని ఐడీబీఐ పాలక మండలి సోమవారం తీర్మానించింది. ఎల్‌ఐసీకి అనుబంధ సంస్థగా ఐడీబీఐ మారిపోయిన విషయం తెలిసిందే. ఐడీబీఐలో 51 శాతం వాటాలను కొనుగోలు ప్రక్రియను ఇన్సూరెన్స్ దిగ్గజం ఎల్‌ఐసీ ఇటీవలే పూర్తి చేసింది.

01/21/2019 - 23:40

న్యూఢిల్లీ, జనవరి 21: ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 153.21 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 1,249.85 కోట్ల రూపాయలు నష్టపోయిన యూనియన్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరంలో బలపడింది. కాగా, గత ఏడాది మూడో త్రైమాసికంలో బ్యాంక్ 9,133.58 కోట్ల రూపాయల నికర లాభాన్ని సంపాదించింది.

01/21/2019 - 23:39

బెంగళూరులో సోమవారం యాంటీ లాక్ బ్రేకింగ్ (ఎబీఎస్) విధానంతో ఉత్పత్తి చేసిన ఎఫ్‌జెడ్-ఎఫ్1,
ఎఫ్‌జెడ్‌ఎస్-ఎఫ్1 తరహా బైక్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసిన తర్వాత ఫొటోలకు ఫోజులిస్తున్న
యమహా మోటార్ ఇండియా చైర్మన్ మొటొఫుమీ షితారా

01/21/2019 - 23:37

న్యూఢిల్లీ, జనవరి 21: సుమారు 9,000 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీ వాటాలను తిరిగి కొనేందుకు అంగీకరించాలంటూ ఎల్ అండ్ టీ చేసిన ప్రతిపాదనను భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ బోర్డు ‘సెబీ’ తిరస్కరించింది.

01/21/2019 - 04:30

న్యూఢిల్లీ: వేల కోట్ల రూపాయలను రుణంగా తీసుకొని, ఆతర్వాత ఉద్దేశపూర్వకంగానే వాటిని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారస్థుడు నీరవ్ మోదీ వ్యవహారం పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)కి తలనొప్పి వ్యవహారంగా మారింది. బ్యాంకులో చోటు చేసుకుంటున్న అవాంఛనీయ ధోరణులను అరికట్టలేకపోయారన్న ఆరోపణలను బ్యాంకుకు చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)లపై కేంద్ర ప్రభుత్వం వేటు వేసింది.

01/21/2019 - 02:33

ముంబయి, జనవరి 20: గత కొంతకాలంగా అనిశ్చితి పరిస్థితిని ఎదుర్కొన్న బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో లావాదేవీలు కొత్త వారంలో స్థిరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలను వెల్లడించగా, ఇన్ఫోసిస్ 8,260 కోట్ల రూపాయల విలువైన 10.32 కోట్ల ఈక్విటీ షేర్లను తిరిగి కొంటున్నది. ఈ ‘బై బ్యాక్’ ద్వారా స్టాక్ మార్కెట్ లాభపడడం ఖాయం.

01/21/2019 - 02:31

న్యూఢిల్లీ, జనవరి 20: బంగాళా ఖాతంలోని కేజీ-డీ 6 బ్లాక్‌లో భాగస్వామ్యం నుంచి వైదొలగాల్సిందిగా నికో రిసోర్సెస్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) సూచించింది. గ్యాస్ క్షేత్ర అభివృద్ధికి పెట్టుబడులను ఇవ్వలేకపోతున్న నికో వల్ల ఉత్పత్తి ఆలస్యమవుతున్నదని రిల్ అభిప్రాయపడుతున్నది.

01/21/2019 - 02:30

న్యూఢిల్లీ, జనవరి 20: దేశ ఆర్థిక వ్యవస్థను శా సించే పది భారీ కంపెనీల్లో ఆరు కంపెనీలు గత వా రం భారీ లాభాలను ఆర్జించాయ. ఫలితంగా మా ర్కెట్‌లో వీడి విలువ 1,08,274.79 కోట్ల రూపాయ లకు పెరిగింది. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమి టెడ్ (రిల్) అగ్రస్థానాన్ని ఆక్రమించింది.

01/20/2019 - 05:36

ప్యారిస్: పడిపోతున్న ముడి చమురు ధరలు మరింతగా పడిపోకుండా అదుపుచేసేందుకు ఉత్పత్తిని తగ్గించుకోవాలని తీర్మానించినట్టు సౌదీ అరేబియా వెల్లడించింది. ఒపెక్ దేశాల నూతన ఒప్పందం మేరకు చమురు ధరలను పెంచేందుకు తమవంతు యత్నంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది.

01/19/2019 - 22:54

ముంబయి, జనవరి 19: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో ఈ వారం రికార్డు స్థాయిలో లాభాలు నమోదు కాకపోయినప్పటికీ, భారీ నష్టాల నుంచి మార్కెట్ బయటపడింది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ, వరుసగా నాలుగు రోజుల పాటు స్వల్ప లాభాలను ఆర్జించి, నిలదొక్కుకుంది. 36,000 పాయింట్ల మైలురాయిని ఈవారం మరోసారి అధిగమించింది. అదే విధంగా నిఫ్టీ 10,900 పాయింట్లకు తగ్గకుండా లావాదేవీలను సాగించింది.

Pages