S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/22/2019 - 03:57

విజయవాడ (ఎడ్యుకేషన్): లలితా జ్యూయలరీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజల నమ్మకం పొందిన సంస్థగా మంచిపేరు పొందడం అభినందనీయమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. విజయవాడలోని పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులో లలితా జ్యూయలరీ నూతనంగా ఏర్పాటు చేసిన ఆసియాలోనే పెద్దదైన భారీ షోరూమ్‌ను సోమవారం యనమల ప్రారంభించారు.

01/22/2019 - 03:54

గుంటూరు, జనవరి 21: భారత్ నుండి నాణ్యమైన పొగాకు ఉత్పత్తులు ఎగుమతి చేసేందుకు చైనాతో ఒప్పందం కుదిరింది. సోమవారం చైనా రాజధాని బీజింగ్‌లో భారత్ వాణిజ్య విభాగం కార్యదర్శి డాక్టర్ అనూప్ వాద్వాన్ తన బృందంతో అక్కడి వాణిజ్య శాఖ ఉప మంత్రి జాంగ్ జివెన్‌తో చర్చలు జరిపారు. వ్యవసాయ, అనుబంధ ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతుల అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం పొగాకును దిగుమతి చేసుకునేందుకు ఒప్పందం కుదిరింది.

01/22/2019 - 03:15

బడ్జెట్ డాక్యుమెంట్స్ ముద్రణ ప్రారంభం సందర్భంగా ఆనవాయితీగా వస్తున్న ‘హల్వా వేడుక’ను అధికారులతో కలిసి సోమవారం న్యూఢిల్లీలోని తన కార్యాలయంలో జరుపుకొంటున్న కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రులు శివ్ ప్రతాప్ శుక్లా, పొన్ రాధాకృష్ణన్.

01/22/2019 - 02:34

దావోస్, జనవరి 21: దేశంలో ఒక పక్క ధనవంతులు మరింత కుబేరులు అవుతుండగా, పేదవాళ్లు పేదవారిగానే మిగిలిపోతున్నారు. పేద-ధనిక వర్గాల మధ్య అంతరం రోజురోజుకూ ఎక్కువైపోతోందని ఇది సమాజానికి ప్రమాదకర ధోరణి అని హెచ్చరిస్తోంది ఆక్స్‌ఫామ్ స్టడీ నివేదిక. భారత్ దేశంలో కేవలం తొమ్మిది మంది అతి ధనవంతుల సంపద అట్టడుగు వర్గాలకు చెందిన 50 శాతం ప్రజల ఆదాయంతో సమానంగా ఉందని ఆక్స్‌ఫామ్ నివేదిక సోమవారం వెల్లడించింది.

01/22/2019 - 04:38

విజయవాడ: పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను త్వరగా ఆమోదించాలని, పెండింగ్‌లో ఉన్న 3722 కోట్ల రూపాయలను త్వరగా విడుదల చేయాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ప్రాజెక్టు పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే 64.31 శాతం మేర పనులు పూర్తి అయ్యాయని తెలిపారు.

01/22/2019 - 00:26

విజయవాడ, జనవరి 21: పెథాయ్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని టన్నుకు 1550 రూపాయల చొప్పున పౌర సరఫరాల సంస్థ కొనుగోలు చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

01/21/2019 - 23:45

ముంబయి, జనవరి 21: భారత స్టాక్ మార్కెట్ ఈవారం లాభాలతో మొదలైంది. దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయిలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్), ఇన్ఫోసిస్ వంటి భారీ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలను వెల్లడించడంతో, స్టాక్ మార్కెట్ పుంజుకుంది.

01/21/2019 - 23:43

ముంబయలో సోమవారం ఐడీబీఐ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన
ఆటల పోటీల్లో గెలుపొందిన చిన్నారులతో భారత జాతీయ బాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్

01/21/2019 - 23:41

న్యూఢిల్లీ, జనవరి 21: బులియన్ మార్కె ట్ సోమవారం సానుకూల ధోరణులతో కొనసాగింది. ఆభరణాల తయారీదారులతోపాటు సంస్థాగత పెట్టుబడిదారులు కూడా ఆసక్తిని ప్రదర్శించడంతో, జాతీయ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర 40 రూపాయలు పెరిగి 33,200 రూపాయలకు చేరింది. ఉదయం 33,160 రూపాయల వద్ద మొదలైన బులియన్ మార్కెట్ ట్రేడింగ్ నింపాదిగా ముందుకు సాగింది.

01/21/2019 - 23:41

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,188.00
8 గ్రాములు: రూ.25,504.00
10 గ్రాములు: రూ. 31,880.00
100 గ్రాములు: రూ.3,18,800.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,409.626
8 గ్రాములు: రూ. 27,277.008
10 గ్రాములు: రూ. 34,096.26
100 గ్రాములు: రూ. 3,40,962.6
వెండి
8 గ్రాములు: రూ. 330.40

Pages